News


ఎస్‌బీఐ దూకుడు.. కారణాలివి!

Thursday 13th February 2020
Markets_main1581584860.png-31759

అగ్రస్థానానికి చేరిన ఎస్‌బీఐ ఫండ్‌
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ రెండో ర్యాంకు
మార్చిలో క్రెడిట్‌ కార్డ్స్‌ విభాగం ఐపీవో 
రూ. 10,000 కోట్ల సమీకరణ లక్ష్యం
తాజాగా 3 శాతం పెరిగిన ఎస్‌బీఐ షేరు

గత కొన్నేళ్లుగా పలు విభాగాలలో ప్రవేశించిన ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) దూకుడు చూపుతోంది. ఓవైపు క్రెడిట్‌ కార్డ్స్‌ బిజినెస్‌లో వేగవంతంగా ఎదుగుతూనే.. మరోపక్క మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) విభాగంలోనూ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. తాజాగా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) రీత్యా ఎస్‌బీఐ ఎంఎఫ్‌ దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రూ. 3.82 లక్షల కోట్ల ఏయూఎంతో తొలి ర్యాంకులో నిలిచింది. తద్వారా ఇప్పటివరకూ ఆధిపత్యం వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీని రెండో ర్యాంకులోకి నెట్టింది. నెలవారీ రూ. 21,000 కోట్లను జమచేసుకోవడం ద్వారా ఎస్‌బీఐ ఎంఎఫ్‌ ఈ ఫీట్‌ను సాధించింది. జనవరి చివరికల్లా ఎస్‌బీఐ ఎంఎఫ్‌.. ఏయూఎం రూ. 3.82 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌.. ఏయూఎం రూ. 3.79 లక్షల కోట్లుగా నమోదుకాగా.. ఐసీఐసీఐ ఎంఎఫ్‌ రూ. 3.68 లక్షల కోట్ల ఏయూఎంను సాధించింది.

ఈక్విటీ, డెట్‌ అండ
ఇటీవల ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడానికితోడు.. రుణ పథకాలలో పెట్టుబడులు పెరగడం దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు లాభించింది. ఇది ఎస్‌బీఐ ఎంఎఫ్‌కు మరింత దన్నునిచ్చింది. ఇప్పటికే ఈక్విటీ పెట్టుబడుల్లో ముందంజలో ఉన్న ఎస్‌బీఐ ఎంఎఫ్‌ తాజాగా రూ. 3,000 కోట్లను జమ చేసుకుంది. తద్వారా ఈక్విటీ ఏయూఎం రూ. 1.93 లక్షల కోట్లకు చేరగా.. రుణ సెక్యూరిటీల(ఆస్తుల) విలువ రూ. 15,000 కోట్లు పెరిగి రూ. 1.63 లక్షల కోట్లను తాకింది. ఎస్‌బీఐ ఎంఎఫ్‌ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 695 పథకాలున్నాయి. వీటిలో 334 ఓపెన్‌ ఎండెడ్‌, 361 క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలను నిర్వహిస్తోంది. కాగా.. విడిగా డెట్‌ ఏయూఎంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ రూ. 1.99 లక్షల కోట్లతో తొలి ర్యాంకులో నిలుస్తోంది. 
 

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో
మార్చి తొలి వారంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించడంతో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాం‍క్‌.. ఇందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా క్రెడిట్‌ కార్డుల అనుబంధ విభాగం ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయనుంది. ఐపీవోకి ప్రైస్‌బ్యాండ్‌ రూ. 690-700 స్థాయిలో నిర్ణయించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీ విలువ రూ. 60,000 కోట్లకు చేరే అవకాశముంది. యూఎస్‌ క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు అమెక్స్‌, డిస్కవరీతో పోలిస్తే భారీ ప్రీమియంను సాధించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఆర్జన 41 శాతం వృద్ధి సాధిస్తుండటం దీనికి కారణమని తెలియజేశాయి.

76 శాతం వాటా
సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ 13 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచే అవకాశముంది. వీటికితోడు రూ. 500 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను సైతం జారీ చేయనుంది. వీటిలో సుమారు 3.73 కోట్ల షేర్లను ఎస్‌బీఐ, 9.3 కోట్లకుపైగా కార్లయిల్‌ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ కార్డ్స్‌లో మాతృ సంస్థ స్టేట్‌బ్యాంక్‌కు 76 శాతం వాటా ఉంది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ మిగిలిన 24 శాతం వాటాను కలిగి ఉంది. ఇష్యూకి కొటక్‌ మహీంద్రా కేపిటల్‌, యాక్సిస్‌ కేపిటల్‌, డీఎస్‌పీ మెరిల్‌లించ్‌ తదితర సంస్థలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

ద్వితీయ ర్యాంక్‌
ఎస్‌బీఐ ప్లాస్టిక్‌ కార్డ్స్‌ విభాగం 9.5 మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉన్నట్లు అంచనా. తద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లలో దేశీయంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం వార్షిక ప్రాతిపదికన దాదాపు 36 శాతం చొప్పున ఎగసింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ దాదాపు 26 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గత 6-7 ఏళ్ల కాలంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ) 25 శాతానికి తగ్గలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.   

షేరుకి దన్ను
ఓవైపు మ్యూచువల్‌ ఫం‍డ్‌ బిజినెస్‌లో చూపుతున్న వృద్ధి, మరోపక్క ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ వంటి అంశాలు స్టేట్‌బ్యాంక్‌ కౌంటర్‌కు ఇటీవల జోష్‌నిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌బీఐ వాటాదారులు విడిగా ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఇది ఎస్‌బీఐ కౌంటర్లో కొనుగోళ్లకు కారణమవుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో మధ్యాహ్నం 12.50 ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్‌ షేరు 3 శాతం పుంజుకుని రూ. 329 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 331 వరకూ ఎగసింది. You may be interested

జవవరిలో ఫండ్‌ మేనేజర్లు కొన్న స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లివే..!

Thursday 13th February 2020

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు జనవరిలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు ఆసక్తి చూపించే కొన్ని ప్రధాన కంపెనీల షేర్లను ఇప్పుడు చూద్దాం..! మ్యూచువల్‌ ఫండ్‌ పేరు: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ పేరు: శ్రీరాం కో సిమెంట్‌ ప్రస్తుత ధర: రూ.779 కంపెనీ మార్కెట్‌ క్యాప్‌: రూ.18,348 కోట్లు విశ్లేషణ: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వెస్ట్రన్‌ మార్కెట్లో శ్రీరాం

52 వారాల కనిష్టానికి పడిపోయిన 91షేర్లు​

Thursday 13th February 2020

91 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో అగ్రిటెక్‌ ఇండియా, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌, అర్టిమీస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌, ఆరియన్‌ప్రో సొల్యూషన్స్‌ మిల్స్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా,భారత్‌ గేర్స్‌, బిర్లా టైర్స్‌, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, జీఎంఐ, కాంప్‌కామ్‌ సాఫ్ట్‌వేర్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, దీప్‌ ఇండస్ట్రీస్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్‌స్‌ కార్పొరేషన్‌,

Most from this category