News


ఈ ఆరు రంగాలకూ బడ్జెట్‌ పుష్‌?!

Thursday 30th January 2020
Markets_main1580374288.png-31338

ఆటో, మెటల్‌, రియల్‌ ఎస్టేట్‌
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆగ్రోకెమికల్స్‌
వినియోగ రంగానికీ చోటు?

దేశ ప్రజలంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న​సాధారణ వార్షిక బడ్జెట్‌ను కేం‍ద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుం‍ది. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే.. మౌలిక సదుపాయాల రంగానికి భారీ పెట్టుబడులు, వృద్ధికి ఊతమిచ్చే బాటలో వినియోగ రంగంలో డిమాండ్‌ పెంచే చర్యలతో పారిశ్రామిక రంగానికి జోష్‌నివ్వడం వంటి అంశాలపై కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ భారీ కసరత్తునే నిర్వహించినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వీటికితోడు హౌసింగ్‌, ఆటో, రియల్టీ తదితర రంగాలతోపాటు,  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపైనా దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపొందిస్తున్న బడ్జెట్‌ ప్రధానంగా ఆరు రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా లబ్డి పొందే వీలున్న కంపెనీలు.. తదితర వివరాలు చూద్దాం..

ఆటో
అంచనాలు: స్క్రాపేజీ పాలసీ, లిథియం సెల్స్‌పై దిగుమతి సుంకాల రద్దు, 2020 నుంచి వాహన రిజిస్ట్రేషన్‌పై ఫీజు పెంచే ప్రతిపాదన వాయిదా, టైర్ల దిగుమతులపై సుంకాల పెంపు వంటి కొన్ని ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు.
కంపెనీలు: స్ర్కాపేజీ పాలసీతో అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌, లిథియం సెల్స్‌ ద్వారా ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ లబ్ది పొందగలవని ఎమ్‌కే అంచనా వేస్తోంది. ఆదాయపన్ను పరిమితి పెంచితే ఆటోకు మేలు చేకూరగలదని చెబుతోంది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ సైతం లాభపడనున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌  పేర్కొంది. టైర్లపై దిగుమతి సుంకాలు పెరిగితే సియట్‌, ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌ అమ్మకాలు పుంజుకోవచ్చునని ఎమ్‌కే చెబుతోంది.

మెటల్స్‌ 
అంచనాలు: కోకింగ్‌ కోల్‌, మెటలర్జికల్‌ కోక్‌ దిగుమతులపై సుంకాల తగ్గింపును మెటల్‌, మైనింగ్‌ కంపెనీలు ఆశిస్తున్నాయి. అల్యూమినియం స్ర్కాప్‌పై దిగుమతి సుంకాల పెంపును కోరుతున్నాయి. డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) తగ్గింపు.
కంపెనీలు: కోల్‌, కోక్‌ ధరలను తగ్గిస్తే టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌పీఎల్‌, సెయిల్‌ లబ్ది పొందగలవని యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌, షేర్‌ఖాన్‌ పేర్కొంటున్నాయి. అల్యూమినియం స్క్రాప్‌పై సుంకాలు పెరిగితే హిందాల్కో, వేదాంతా, నాల్కో లాభపడతాయి. అయితే అల్యూమినియం కోటెడ్‌ స్టీల్‌ తయారీ కంపెనీలపై నామమాత్రంగా ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. డీడీటీ తగ్గితే.. నగదు నిల్వలున్న హిందుస్తాన్‌ జింక్‌, ఎంవోఐఎల్‌, ఎన్‌ఎండీసీ, నాల్కో బలపడవచ్చు.

రియల్టీ
అంచనాలు: అందుబాటు ధరల్లో హౌసింగ్‌కు బూస్ట్‌నిచ్చేందుకు వీలుగా కార్పెట్‌ ఏరియా లేదా రుణ పరిమితులను పెంచవచ్చు. గృహ రుణాలపై పన్ను మినహాయింపులను పెంచవచ్చు. తొలిసారి ఇల్లు కొనేవారికి జీఎస్‌టీ మినహాయించే వీలు. ఆర్‌ఈఐటీలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు. దీర్ఘకాలంగా ఆశిస్తున్న రియల్‌ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదా. 
కంపెనీలు: ప్రస్తుత రూ. 45 లక్షల రుణ పరిమితిని పెంచితే లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలకు మేలు చేకూరగలదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రూ. 3.5 లక్షలవరకూ ఉన్న ప్రస్తుత పన్ను మినహాయింపులు పెంచితే సన్‌టెక్‌, శోభా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లబ్ది పొందగలవని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. గృహ రుణాలపై పన్ను మినహాయింపులు పెరిగితే.. దీర్ఘకాలంలో డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, ఏషియానా, గోద్రెజ్‌, ప్రెస్టేజ్‌ తదితర సంస్థలకు మేలు జరుగుతుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది.

ఆగ్రోకెమికల్స్‌
అంచనాలు: యూరియా ధరలపై నియంత్రణలు ఎత్తివేసేయోచనలో ఉన్నట్లు ఎరువుల శాఖ ఇటీవల పేర్కొంది. పోషకాధారిత సబ్సిడీ రేట్లు(ఎన్‌బీఎస్‌) పరిధిలోకి యూరియాను తీసుకురావడం ద్వారా సబ్సిడీని రైతులకు ప్రత్యక్షం‍గా అందించాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. పీఎంఎఫ్‌బీవై, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, అగ్రిక్రెడిట్‌ తదితర పథకాలకు అధిక కేటాయింపులు ఉండవచ్చని అంచనా.
కంపెనీలు: యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులకు సబ్సిడీలు పెంచితే కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, జీఎస్‌ఎఫ్‌సీ, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, ఆర్‌సీఎఫ్‌ తదితరాలకు మేలు చేకూరవచ్చని యాంటిక్‌ స్టాక్‌ పేర్కొంది. మైక్రోఇరిగేషన్‌ ఫండ్‌కు నాబార్డ్‌ నిధులు పెంచితే జైన్‌ఇరిగేషన్‌ లబ్డి పొందవచ్చు. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
అంచనాలు: మొత్తం పెట్టుబడి వ్యయాలను 10-12 శాతంమేర పెంచవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐతోపాటు.. రైల్వేలకూ అధిక కేటాయింపులు. మెట్రో ప్రాజెక్టుల బడ్జెట్‌ పెంపు.
కంపెనీలు: ఎన్‌హెచ్‌ఏఐకు కేటాయింపులు పెరిగితే దిలీప్‌ బిల్డ్‌కాన్‌, అశోకా బిల్డ్‌కాన్‌, సద్భావ్‌ ఇంజినీరింగ్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లబ్ది పొందే వీలు. వీటితోపాటు సిమెంట్‌ కంపెనీలు అల్ట్రాటెక్‌, శ్రీ సిమెంట్‌, రామ్‌కో, జేకే లక్ష్మీ లాభపడవచ్చు. ఇదే విధంగా మెట్రో, రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఎల్‌అండ్‌టీ, కేకుమార్‌, ఐటీడీ సిమెంటేషన్‌, ఎన్‌సీసీ, సీమెన్స్‌, ఏబీబీ, కేఈసీ, కల్పతరు పవర్‌కు మేలు జరుగుతుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది. వాటర్‌, శానిటేషన్‌ విభాగంలో అయితే జిందాల్‌ సా, టాటా మెటాలిక్స్‌, శ్రీకాళహస్తి పైప్స్‌కు ప్రయోజనముంటుంది. వీటికి జతగా.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల ద్వారా అహ్లువాలియా, ఎన్‌బీసీసీ సైతం లబ్ది పొందవచ్చు. 

వినియోగం

అంచనాలు: వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు లేదా స్లాబులలో సవరణలు చేపట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల పథకాలకు అధిక కేటాయింపులు. 
కంపెనీలు: ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల ఆదాయపన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చు. ఇదే విధంగా రూ. 5-10 లక్షల ఆదాయానికి 10 శాతమే పన్ను విధింపు ఉండవచ్చు. రేట్లు, శ్లాబులు సానుకూలంగా సవరిస్తే.. ఆటో, వైట్‌గూడ్స్‌తోపాటు.. దుస్తులు తదితర కంపెనీలకు మేలు చేకూరవచ్చని షేర్‌ఖాన్‌ భావిస్తోంది. దీంతో డిక్సన్‌, యాంబర్‌, వోల్టాస్‌, వర్ల్‌పూల్‌ లబ్ది పొందవచ్చు. గ్రామీణ పథకాల ద్వారా ఎఫ్‌ఎంసీజీ విభాగంలో హెచ్‌యూఎల్‌, కాల్గేట్‌, డాబర్‌, ఇమామీ, జ్యోతీ లేబ్‌కు లాభం చేకూరే వీలు. పసిడిపై కస్టమ్స్‌ పెంచితే టైటన్‌ తదితర కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. You may be interested

ఇండియాలో 9 శాతం తగ్గిన పసిడి డిమాండ్‌: డబ్ల్యూజీసీ

Thursday 30th January 2020

   9 శాతం తగ్గిన డిమాండ్‌ న్యూఢిల్లీ: భారత దేశంలో ఆపదసమయాల్లో ఆదుకుంటుందని బంగారంమీదే ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతుంటారు. కానీ 2019లో బంగారానికి డిమాడ్‌ 9 శాతం తగ్గి 690.4 టన్నులుగా నమోదైందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీసీ) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక మందగమనంతో పాటు రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడంతో  డిమాండ్‌ తగ్గిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. కాగా 2018 సంవత్సరం ముగింపు ధరతో పోలిస్తే 24 శాతం

బజాజ్‌ అటో ఫలితాలు అంచనాలను మించాయ్‌...!

Thursday 30th January 2020

బజాజ్‌ అటో మూడో త్రైమాసికపు ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు మించి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఈ క్యూ3లో రూ.1,262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.1,102 కోట్లతో ఇదే ఇది 15శాతం అధికం. విశ్లేషకులు రూ.1,190 కోట్ల నికరలాభాన్ని సాధించవచ్చని అంచనా వేశారు. నిర్వహణ ఆదాయం 3శాతం పెరిగి రూ.7,640 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఇదే క్వార్టర్‌లో ఇది రూ.7,436

Most from this category