News


స్వల్ప కాలానికి 12 బుల్లిష్‌ స్టాక్స్‌!

Monday 17th February 2020
Markets_main1581921450.png-31853

జాబితాలో బయోకాన్‌, లుపిన్‌
టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, సింఫనీ

నవీన్‌ ఫ్లోరిన్‌, సుప్రజిత్‌, ఇండొకొ
వివిధ విశ్లేషకుల సిఫారసులు

కరోనా వైరస్‌, ఆర్థిక మందగమనం, ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాలు తదితర అంశాల మధ్య స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల వెలువడిన ఆర్థిక గణాంకాలు నిరాశను కలిగించినట్లు తెలియజేశారు. ఐఐపీ నీరసించడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం జోరందుకోవడం తదితరాల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తదుపరి పాలసీ సమీక్షలో రెపో రేటులో కోతపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్ల దిశను అంచనా వేయడం క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న వారాలలో లాభాలను అందించే స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ట్రేడర్లకు కష్టతరంగానే కనిపిస్తున్నట్లు తెలియజేశారు. 

నిఫ్టీ ఇలా..
గత వారం నిఫ్టీ నామమాత్ర లాభంతో 12,113 వద్ద ముగిసింది. వీక్లీ చార్టుల ప్రకారం నిఫ్టీ డోజీ కేండిల్‌ను సూచిస్తోంది. దీంతో ట్రేడర్లు అనిశ్చితికి లోనయ్యే అవకాశమున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రోహిత్‌ సింగ్రే పేర్కొన్నారు. నిఫ్టీ 12,000- 12,250 పాయింట్ల మధ్య కన్సాలిడేట్‌కావచ్చని చెబుతున్నారు. నిఫ్టీకి 12,050- 11,990 పాయింట్ల మధ్య మద్దతు లభించగలదని, 12,190- 12,250 మధ్య రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలకు సాంకేతిక అంశాల ఆధారంగా మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని స్టాక్స్‌ను సిఫారసు చేస్తున్నారు. వివరాలు చూద్దాం..

- మజర్‌ మొహమ్మద్‌, చీఫ్‌ స్ట్రాటిజిస్ట్‌, టెక్నికల్‌ రీసెర్చ్‌, ట్రేడింగ్‌ అడ్వయిజరీ, చార్ట్‌వ్యూఇండియా.ఇన్‌
లుపిన్‌ లిమిటెడ్‌
గత 50 సెషన్లలో లుపిన్‌ షేరు క్షీణపథం(డౌన్‌స్లోపింగ్‌ చానల్‌)లో పయనిస్తూ వచ్చింది. రూ. 695 వద్ద కనిష్టాన్ని తాకిన తదుపరి గత 5 రోజులుగా కన్సాలిడేషన్‌లో పడింది. దీంతో సమీపకాలంలో ఈ కౌంటర్‌కు రూ. 695 వద్ద మద్దతు లభించే వీలుంది. వారాంతాన ఈ కౌంటర్‌లో పుల్‌బ్యాంక్‌ కనిపించింది. రూ. 695 ఎగువన నిలదొక్కుకోగలిగితే.. రూ. 750 వరకూ బలపడేందుకు అవకాశముంది. పొజిషనల్‌ ట్రేడర్లు రూ. 749 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 699 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.

నవీన్‌ ఫ్లోరిన్‌
గత నెల 29న రూ. 1259 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన తదుపరి నవీన్‌ ఫ్లోరిన్‌ కౌంటర్‌ గత రెండు వారాలు కన్సాలిడేషన్‌ను చవిచూసింది. తదుపరి అప్‌ట్రెండ్‌ బాట పట్టింది. మరోవైపు గత 18 వారాలుగా ఈ కౌంటర్‌ లాభపడుతూనే(ఎసెండింగ్‌ చానల్‌) వస్తోంది. ఈ బాటలో నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు రూ. 1108 వద్ద కనిష్టాన్ని తాకి బౌన్స్‌ అయ్యింది. గత రెండు సెషన్లలో మరింత వేగమందుకుంది. దీంతో ప్రస్తుత ధరల వద్ద, రూ. 1170-1150 స్థాయిలోనూ కొనుగోళ్లు చేపట్టవచ్చు. రూ. 1334 టార్గెట్‌కాగా.. రూ. 1128 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

సింఫనీ లిమిటెడ్‌
అటు షేరు ధర, ఇటు ట్రేడింగ్‌ పరిమాణం‍ రీత్యా సింఫనీ కౌంటర్‌ బ్రేకవుట్‌ సాధించింది. తద్వారా మధ్యంతర గరిష్టం(టాప్‌) రూ. 1333ను అధిగమించింది. ఇది మధ్యకాలానికి అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. రూ. 1305కు ఎగువన నిలదొక్కుకోగలిగితే.. రూ. 1485 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1305 దిగువన స్టాప్‌లాస్‌ను అమలు చేయవలసి ఉంటుంది.

- అజిత్‌ మిశ్రా, రీసెర్చ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌
టీసీఎస్‌ లిమిటెడ్‌
గత ఆరు నెలల్లో రూ. 1950-2240 స్థాయిలో టీసీఎస్‌ కౌంటర్‌ కన్సాలిడేట్‌ అయ్యింది. తద్వారా ట్రయాంగిల్‌ ప్యాటర్న్‌ ఏర్పడింది. ఇటీవల ఐటీ విభాగంలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీనికితోడు చార్టులు సైతం సానుకూలతను చాటుతున్నాయి. వెరసి ఈ కౌంటర్‌ నెమ్మదిగా బలపడటంతోపాటు.. తాజా బ్రేకవుట్‌ను సాధించే అవకాశముంది. రూ. 2250 టార్గెట్‌తో ఫ్రెష్‌ లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 2145 వద్ద స్టాప్‌లాస్‌ను ఉంచాలి. 

బయోకాన్‌ లిమిటెడ్‌
రెండు నెలల కన్సాలిడేషన్‌ తదుపరి బయోకాన్‌ కౌంటర్‌ ఇటీవల బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుత చార్టుల ప్రకారం తాజా ర్యాలీ(అప్‌మూవ్‌)కు అవకాశమున్నట్లు కనిపిస్తోంది. రూ. 322 టార్గెట్‌తో ఫ్రెష్‌ లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 294 వద్ద స్టాప్‌ లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.

- నీరజ్‌ షెట్టి, టెక్నికల్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
వీక్లీ టైమ్‌ఫ్రేమ్‌ చార్టుల ప్రకారం గత రెండు వారాలలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ షార్ప్‌ అప్‌సైడ్‌ బౌన్స్‌ను సూచిస్తోంది. లాంగ్‌ టెర్మ్‌ చార్ట్‌ ప్రకారం రూ. 950 స్థాయిలో కనిష్టాల వద్ద నుంచి బౌన్స్‌ అయినట్లు సంకేతాలున్నాయి. ఇంతక్రితం నమోదైన డౌన్‌ట్రెండ్‌కు చెక్‌ పడినట్లు కనిపిస్తోంది. గత రెండు వారాలలో ట్రేడింగ్‌ పరిమాణం పుంజుకోవడంతోపాటు షేరు బలపడింది. 14 రోజుల ఆర్‌ఎస్‌ఐ సానుకూలతను చాటుతోంది. దీంతో రూ. 1405 టార్గెట్‌తో రూ. 1232 స్థాయిల వరకూ కొనుగోళ్లు చేపట్టవచ్చు. రూ. 1200 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.

టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌
కొద్ది నెలలుగా టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ కౌంటర్‌ స్థిరమైన అప్‌ట్రెండ్‌లో కదులుతోంది. హైయర్‌ టాప్స్‌, బాటమ్స్‌తో ఇంటర్మీడియట్‌ అప్‌మూవ్‌ నమోదైంది. రూ. 400 స్థాయిలో కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించే సంకేతాలు ఇస్తోంది. ట్రేడింగ్‌ పరిమాణంతోపాటు.. మొమెంటమ్‌ ఆస్కిలేటర్లు సైతం​ప్రస్తుత అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. రూ. 438 టార్గెట్‌తో రూ. 375 వరకూ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 365 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది.

- భవిన్‌ మెహతా, డెరివేటివ్స్‌ స్ట్రాటజిస్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌, దోలత్‌ కేపిటల్‌
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
ప్రతికూల మార్కెట్లోనూ వారాంతాన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు కొనుగోళ్ల దన్ను లభించింది. టెక్నికల్‌ కన్సాలిడేషన్‌ నుంచి బయటపడిన ఈ స్టాక్‌ మరింత బలపడే వీలుంది. రిస్క్‌-రివార్డ్‌ సానుకూలంగా కనిపిస్తోంది. ఎంఏసీడీ, ఆర్‌ఎస్‌ఐ సంకేతాలు ఈ కౌంటర్‌లో జోరు కొనసాగనున్నట్లు సూచిస్తున్నాయి. రూ. 655 టార్గెట్‌తో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 605 వద్ద(ముగింపు ప్రాతిపదికన) స్టాప్‌లాస్‌ తప్పనిసరి.  

- శ్రీకాంత్‌ చౌహాన్‌, టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
బుల్స్‌, బేర్స్‌ మధ్య కంజెషన్‌ను సూచిస్తూ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్లో రెక్టేంగిల్‌ బాక్స్‌ ప్యాటర్న్‌ నమోదైంది. అయితే ఇటీవల బుల్స్‌ పైచేయి సాధించినట్లుగా సూచిస్తూ ఈ కౌంటర్‌లో బ్రేకవుట్‌ జరిగింది. దీంతో తదుపరి బుల్‌ రన్‌కు చాన్స్‌ కనిపిస్తోంది. ఫలితంగా రూ. 825 టార్గెట్‌తో మధ్యకాలానికి ఈ కౌంటర్లో కొనుగోళ్లు చేపట్టవచ్చు. రూ. 770 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

- అమిత్‌ గుప్తా, సహవ్యవస్థాపకులు, సీఈవో, ట్రేడింగ్‌ బెల్స్‌
ఇండొకొ రెమిడీస్‌
దీర్ఘకాలిక డౌన్‌స్లోపింగ్‌ చానల్‌ నుంచి ఇటీవల ఇండొకొ రెమిడీస్‌ కౌంటర్‌ బ్రేకవుట్‌ సాధించింది. భారీ ట్రేడింగ్‌తో బుల్లిష్‌ ధోరణి కనిపిస్తోంది. డైలీ టైమ్‌ఫ్రేమ్‌ సైతం బుల్లిష్‌ ఫ్లాగ్‌  ఫార్మేషన్‌ను సూచిస్తోంది. దీంతో ఈ కౌంటర్‌ మరింత బలపడేందుకు వీలుంది. రూ. 300 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 227 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది.

సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌
డౌన్‌స్లోపింగ్‌ చానల్‌ నుంచి బయటపడిన సుప్రిజిత్‌ ఇంజినీరింగ్‌ కౌంటర్‌ బుల్లిష్‌ దశలోకి చేరిన సంకేతాలు ఇస్తోంది. అన్ని రకాల ప్రధాన చలన సగటులనూ అధిగమించింది. 200 రోజుల చలన సగటు నుంచి భారీ ‍ట్రేడింగ్‌ పరిమాణంతో బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ఆర్‌ఎస్‌ఐ సానుకూల సంకేతాలు ఇస్తోంది. రూ. 225 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 190 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

- వైశాలీ పరేఖ్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఎనలిస్ట్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌
కేఆర్‌బీఎల్‌
200 రోజుల చలన సగటు వద్ద కేఆర్‌బీఎల్‌ కౌంటర్‌కు పటిష్ట మద్దతు లభిస్తోంది. దీనికితోడు ఇటీవల రూ. 260 వద్ద రివర్సల్‌ నమోదైంది. తద్వారా సమకూర్చుకున్న బలంతో రానున్న రోజుల్లో మరింత పుంజుకునేందుకు అవకాశముంది. రూ. 350 టార్గెట్‌తో ఈ కౌంటర్‌లో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ. 278 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది.

(సాంకేతిక అంశాల ఆధారంగా విశ్లేషకులు ఇచ్చిన రికమండేషన్స్‌ ఇవి. పెట్టుబడులు చేపట్టేముందు ఇన్వెస్టర్లు మార్కెట్‌ నిపుణులను సం‍ప్రదించవలసిందిగా మనవి)


 You may be interested

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 12 శాతం క్రాష్‌

Monday 17th February 2020

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రక్రియను వేగవంతం  చేసినట్లు ఎల్‌ఐసీ ప్రకటించడంతో సోమవారం నిఫ్టీలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 12 శాతం పడిపోయి రూ.362.60కు చేరింది. కాగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్‌​ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.18,700 కోట్లుగా ఉంటే, ఐడీబీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.37,214 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈ సమాచారం ప్రకారం.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటా 51 శాతంకాగా, ఎల్‌ఐసీ హౌసింగ్‌

అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 17th February 2020

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో సోమవారం ఉదయం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.20శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఈ ఇండెక్స్‌ 2,207.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొండిబకాయిలు మరింత పెరగవచ్చని భయాలతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లను విక్రస్తున్నారు. టెలికాం కంపెనీలకు ప్రభుత్వరంగ

Most from this category