News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో.. బ్లాక్‌బస్టర్‌!?

Saturday 22nd February 2020
Markets_main1582358235.png-32008

పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి 
అనధికార మార్కెట్లో భారీ ప్రీమియం
ఐపీవో ధర అంచనా రూ. 750-755!
రూ. 1100-1300 మధ్య లిస్టింగ్‌ చాన్స్‌?

బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం​స్టేట్‌బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్లలో అత్యంత ఆసక్తి నెలకొన్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్‌లో ఇష్యూకి 40 శాతం అధిక ధర(ప్రీమియం) పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఇష్యూ మార్చి 2న ప్రారంభమై 5న ముగియనుంది. నిజానికి ఇష్యూకి ఎస్‌బీఐ ధరను ఇంకా నిర్ణయించనేలేదు. విశ్లేషకులు షేరుకి రూ. 750-755 ధరను అంచనా వేస్తున్నారు. గ్రే మార్కెట్లో ఈ ధరపై రూ. 310- 320వరకూ అధికంగా చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇష్యూ దగ్గరపడితే ఇది మరింత పెరగవచ్చని.. జనవరిలో ఈ ప్రీమియం రూ. 200 స్థాయిలో పలికినట్లు తెలియజేశాయి. వెరసి ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ 2020లో సూపర్‌స్టార్‌గా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఐఆర్‌సీటీసీ బాటలో
ఇటీవల స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ పొందాక వేగంగా పరుగు తీస్తున్న కొన్ని పబ్లిక్‌ ఇష్యూలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జోరుమీదున్న పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీసహా.. డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆఫ్లే ఇండియా, ఇండియామార్ట్‌ భారీ ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాం‍క్‌ తదితరాలను మిస్‌ అయిన ఇన్వెస్టర్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లను దక్కించుకోవాలసి ఆశిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్‌, ఏవీపీ రీసెర్చ్‌ నిపుణులు ప్రశాంత్‌ తాప్సే తెలియజేశారు. ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించే అవకాశమన్నట్లు అంచనా వేశారు. 

ఐపీవో తీరిదీ
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ 13 కోట్లషేర్లకుపైగా విక్రయానికి ఉంచనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను సైతం తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రమోటర్లు రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు అంచనా. ఎస్‌బీఐ కార్డ్స్‌లో స్టేట్‌బ్యాంక్‌కు 74 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామి సీఏ రోవర్‌ హోల్డింగ్స్‌(కార్లయిల్‌) మిగిలిన 26 శాతం వాటాను కలిగి ఉంది. ఆఫర్‌లో భాగంగా కార్లయిల్‌ 9.3 కోట్ల షేర్లను, ఎస్‌బీఐ 3.7 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. 

తొట్టతొలిగా
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా దేశీయంగా క్రెడిట్‌ కార్డ్స్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన తొలి కంపెనీగా నిలనుంది. పరిశ్రమకు మించిన వృద్ధిని చూపుతున్న కంపెనీకావడంతోపాటు.. ప్రత్యేక తరహా బిజినెస్‌ కలిగి ఉండటంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్దార్థ ఖేమ్కా చెబుతున్నారు. దీనికితోడు వినియోగదారుల ఆధారిత బిజినెస్‌కావడం కూడా ఆకర్షణను పెంచుతున్నట్లు తెలియజేశారు. కంపెనీ పటిష్ట ఫండమెంటల్స్‌, కార్డ్స్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్న కంపెనీగా తొలిసారి లిస్టింగ్‌ వంటి అంశాలు ఎస్‌బీఐ కార్డ్స్‌కు డిమాండ్‌ పెంచనున్నట్లు మార్కెట్‌ నిపుణులు మనీష్‌ భట్‌ పేర్కొంటున్నారు. ఈ అంశాల నేపథ్యంలో లిస్టింగ్‌ తదుపరి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇన్వెస్టర్లకు లాభాలు అందించే వీలున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. రూ. 1100-1300 స్థాయిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ సాధింవచ్చని కేపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ నిపుణులు గౌరవ్‌ గార్గ్‌ అంచనా వేస్తున్నారు.

కంపెనీ వివరాలు
క్రెడిట్‌ కార్డుల బిజినెస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి రెండో ర్యాంకులో ఎస్‌బీఐ కార్డ్స్‌ నిలుస్తోంది. 2019 నవంబర్‌కల్లా 18 శాతం వాటాను సొంతం చేసుకుంది. 18 కోబ్రాండెడ్‌ భాగస్వామ్యాలను కలిగి ఉంది. గత రెండేళ్లలో కార్డుల వినియోగం, ఔట్‌స్టాండింగ్‌లలో 35 శాతం, 54 శాతం చొప్పున వృద్ధిని సాధించింది. మాతృ సంస్థ ఎస్‌బీఐకి గల 22,000 బ్రాంచీల నెట్‌వర్క్‌ దన్నుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు వివరించారు. 



You may be interested

కునాల్‌ బోత్రా నుంచి టాప్‌ రికమెండేషన్లు

Saturday 22nd February 2020

మైండ్‌ ట్రీ మైండ్‌ట్రీలోని చార్ట్ సెటప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో బలమైన షేరు యాక్షన్‌ చూస్తున్న కొన్ని రంగాల్లో ఐటీ సెక్టార్‌ ప్రధానమైంది. ఈ రంగంలోని మైండ్‌ట్రీ కంపెనీ మధ్యస్థాయి ఐనప్పటీకీ.., ప్రైజ్‌ యాక్షన్‌ దృష్ట్యా ఐటీ రంగానికి నాయకత్వం వహిస్తుంది. మైండ్‌ ట్రీ తరువాత ఎన్‌ఐఐటీ టెక్‌ షేరులో మంచి యాక‌్షన్ కన్పిస్తుంది. గత 10 - 12 వారాలలో మైండ్‌ట్రీ  స్థిరత్వమైన ర్యాలీ షేరు ధర నాలుగు

ఇండియాలో అత్యంత విలువైన కంపెనీలు ఏవో మీకు తెలుసా?

Saturday 22nd February 2020

 మన దేశంలో అత్యంత విలువైన కంపెనీలా జాబితాలో రిలయన్స్‌ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్‌ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎప్పుడూ టాప్‌ 10 జాబితాలో ఉండే ఎస్‌బీఐ తాజాగా తన స్థానాన్ని చేజార్చుకుని 11వ స్థానంతో సరిపెట్టుకోగా,...టాప్‌ 10లోకి బజాజ్‌ ఫైనాన్స్‌ వచ్చి చేరింది. జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఈ కింది విధంగా ఉన్నాయి..... క్రమసంఖ్య కంపెనీ పేరు ప్రస్తుత ధర(రూపాయలలో) మార్కెట్‌ విలువ(రూ.కోట్లలో) 1. రిలయన్స్‌    1,485.50 941,693 2.  టీసీఎస్‌       2,156.30 809,126 3. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ 1,217.30  666,914 4. హెయూఎల్‌     2,251.00 487,299 5.  హెచ్‌డీఎఫ్‌సీ  2,362.45 408,602 6. ఐసీఐసీఐబ్యాంక్‌ 546.00  353,346 7. ఇన్ఫోసిస్‌ 796.70  339,280 8. కోటక్‌ మహీంద్రా 1,684.40 322,103 9. భారతీఎయిర్‌టెల్‌ 545.50 297,600 10. బజాజ్‌

Most from this category