News


మల్లీప్లెక్స్‌ షేర్లు సూపర్‌ హిట్‌- ఎందుకంటే?

Thursday 20th February 2020
Markets_main1582181939.png-31957

చరిత్రాత్మక గరిష్టానికి పీవీఆర్‌ సినిమాస్‌
సరికొత్త గరిష్టానికి చేరిన ఐనాక్స్‌ లీజర్‌ 
మందగమనంలోనూ సినిమాలకు కలెక్షన్స్‌ ఫుల్‌

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా మల్టీప్లెక్స్‌ థియేటర్లు వీక్షకులతో కళకళలాడుతున్నాయి. దీంతో మార్కెట్‌ లీడర్‌ పీవీఆర్‌ సినిమాస్‌, ప్రధాన ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి తాజాగా ఈ రెండు షేర్లూ చరిత్రాత్మక  గరిష్టాలను తాకాయి. నేటి ట్రేడింగ్‌లో పీవీఆర్‌ సినిమాస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 2121ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఐనాక్స్‌ లీజర్‌ సైతం 3 శాతంపైగా ఎగసి రూ. 504 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఇటీవల మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నప్పటికీ కొద్ది రోజులుగా మల్టీప్లెక్స్‌ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఈ ఏడాది పీవీఆర్‌ షేరు 20 శాతం ర్యాలీ చేసింది. దేశీయంగా రెండో పెద్ద మల్టీప్లెక్స్‌ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ షేరు గత ఐదు నెలల్లో 60 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు మార్కెట్‌ విశ్లేషకులు వివిధ సానుకూల అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇవేంటో చూద్దామా..?

భవిష్యత్‌ అం‍చనాలు
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో మల్టీప్లెక్స్‌ కంపెనీలు మరింత పటిష్ట పనితీరు చూపనున్నాయి. ఇందుకు ఇటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న సినిమాలకుతోడు.. బాలీవుడ్‌లో రిలీజ్‌కానున్న భారీ చిత్రాలపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రకటనల ఆదాయం సైతం​పుంజుకుంటోంది. వీటికి జతగా కంపెనీలు ప్రతీ ఏటా స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం పీవీఆర్‌ 90-100 స్క్రీన్లను జత చేసుకోనుంది. డిసెంబర్‌కల్లా కొత్తగా 67 స్ర్కీన్లను ప్రారంభించడం ద్వారా వీటి సంఖ్యను 825కు చేర్చుకుంది. ఇదే విధంగా ఐనాక్స్‌ డిసెంబర్‌కల్లా 614 స్క్రీన్లకు ఎదిగింది. ఇటీవల కొంతకాలంగా తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషా చిత్రాలకు సైతం దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ ఆదరణ పెరుగుతుండటం కలసి వస్తోంది. వీక్షకులను ఆకర్షించగల సినిమాలు విడుదలైతే.. ఆహారం, పానీయాల(ఎఫ్‌ అండ్‌ బీ) విభాగం సైతం అధిక అమ్మకాలను సాధించే వీలుంటుంది. 

పీవీఆర్‌​ ర్యాలీ
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీవీఆర్‌ సినిమాస్‌ ప్రస్తావించదగ్గ ఫలితాలనే సాధించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 55 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు క్షీణించింది. అయితే ఇబిటా 76 శాతం జంప్‌చేసి రూ. 315 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 8.6 శాతం పుంజుకుని రూ. 916 కోట్లకు చేరింది. క్యూ3లో ప్రకటనల ఆదాయం 8 శాతం బలపడగా.. 9 నెలల కాలం(ఏప్రిల్‌- డిసెంబర్‌)లో 16 శాతం ఎగసింది. క్యూ3లో ఇబిటా మార్జిన్లు 0.4 శాతం నీరసించి 20.4 శాతానికి చేరాయి. ఈ కాలంలో క్విప్‌ ద్వారా రూ. 500 కోట్లను సమకూర్చుకుంది. స్ట్రీట్‌ డాన్సర్‌, లవ్‌ ఆజ్‌ కల్‌, బాఘీ-3 తదితరాల వసూళ్లపై సినీ విశ్లేషకులు ఆశావహంగా ఉన్నారు. 

ఐనాక్స్‌ క్యూ3 బలం
ఐనాక్స్‌ లీజర్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 40 శాతం ఎగసి రూ. 51 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం పుంజుకుని రూ. 518 కోట్లకు చేరింది. ఇబిటా 25 శాతం పెరిగి రూ. 108 కోట్లయ్యింది. దీంతో గత నెల రోజుల్లో ఐనాక్స్‌ లీజర్‌ షేరు 22 శాతం బలపడింది. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ కనిష్టం నుంచి 370 పాయింట్ల రికవరీ..!

Thursday 20th February 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్ల రికవరీతో మిడ్‌ సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ రికవరీ అయ్యింది. మిడ్‌ సెషన్‌ కల్లా ఇంట్రాడే కనిష్టస్థాయి(30702.45) నుంచి ఏకంగా 372.25 పాయింట్లు లాభపడింది. ఏజీఆర్‌ అంశంలో సుప్రీం కోర్టు తీర్పుతో కష్టాలను ఎదుర్కొంటున్న వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహాయం అందవచ్చనే అంచనాలతో బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,838.20)తో పోలిస్తే 0.68శాతం లాభం‍తో 31వేలపైన

52 వారాల కనిష్టానికి 65 షేర్లు

Thursday 20th February 2020

గురువారం 65 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, అట్లాంటా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌,బిర్లా టైర్స్‌, సీ అండ్‌ సీ కనస్ట్రక‌్షన్స్‌, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకేట్‌, సీఎంఐ, సీఐఎల్‌ నోవా పెట్రోకెమికల్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, కేంబ్రిడ్జ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌, డీప్‌ ఇండస్ట్రీస్‌, డీపీఎస్‌సీ,

Most from this category