News


ఎయిర్‌టెల్‌.. లాభాల ట్యూన్‌ వెనుక?!

Monday 10th February 2020
Markets_main1581328574.png-31657

3 నెలల్లో షేరు 45 శాతం ర్యాలీ
ఏడాదిలో షేరు ధర రెట్టింపు
గత వారం సరికొత్త గరిష్టానికి 
మార్కెట్‌ విలువలో 12వ ర్యాంక్‌

మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు ఇటీవల జోరు చూపుతోంది. ఓవైపు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు సరికొత్త కనిష్టాలకు చేరినప్పటికీ ఎయిర్‌టెల్‌ కౌంటర్లో ర్యాలీ నమోదవుతూ వస్తోంది. ప్రధానంగా పేరుకుపోయిన ఏజీఆర్‌ బకాయిలు, పెరుగుతున్న నష్టాలు వంటి అంశాలతో వొడాఫోన్‌ ఐడియా డీలాపడగా.. దక్షిణాఫ్రికా కార్యకలాపాలు బలపడుతుండటం, ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు వీలుగా 3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించగలగడం వంటి అంశాలు ఎయిర్‌టెల్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నష్టాలను బాగా తగ్గించుకోవడం కూడా ఈ కౌంటర్‌లో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసినట్లు తెలియజేశారు. వెరసి ఎయిర్‌టెల్‌ షేరు గత మూడు నెలల్లో 45 శాతంపైగా లాభపడింది. 2019 నవంబర్‌ 7న రూ. 372 వద్ద కదిలిన ఎయిర్‌టెల్‌ షేరు ఈ ఫిబ్రవరి 6కల్లా రూ. 553కు చేరింది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకడం విశేషం!

12వ ర్యాంక్‌
ఇటీవల ఎయిర్‌టెల్‌ షేరు చరిత్మాత్మక గరిష్టానికి చేరడం ద్వారా రూ. 3 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)ను అధిగమించింది. తద్వారా బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల టాప్‌ ర్యాంక్‌ జాబితాలో 12వ ర్యాంకును కైవసం చేసుకుంది. వెరసి దిగ్గజ కంపెనీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్‌(టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదితరాల సరసన నిలుస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి చూస్తే ఎయిర్‌టెల్‌ షేరు ధర రెట్టింపుకావడం విశేషం!

క్యూ3 ఫలితాలు
ఎయిర్‌టెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. క్యూ2లో రూ. 23,146 కోట్లు నమోదుకాగా.. తాజా క్వార్టర్‌లో ఇవి రూ. 1035 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు నిధులను పక్కనపెట్టడం నష్టాలకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 8 శాతంపైగా పెరిగి రూ. 21,947 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఇబిటా 5 శాతం పుంజుకుని రూ. 9270 కోట్లను తాకింది. ఇటీవల మొబైల్‌ సేవల ధరలను పెంచడంతో ఏఆర్‌పీయూలు బలపడనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శించే వీలున్నట్లు చెబుతున్నారు. క్యూ3లో ఏఆర్‌పీయూలు రూ. 7 పెరిగి రూ. 135కు చేరగా.. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 3.6 మిలియన్లమేర పెరిగి 28.3 కోట్లకు చేరింది. ఇదే కాలంలో రుణ భారం రూ. 3360 కోట్లు తగ్గి రూ. 84,800 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో జెఫరీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ తదితర బ్రోకరేజీలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. 

వొడాఫోన్‌ ఎఫెక్ట్‌
వడ్డీలు, పెనాల్టీలుసహా ఏజీఆర్‌ బకాయిల భారం రూ. 53,000 కోట్లకు చేరడంతో వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వాన్ని కలుగజేసుకోమంటూ అభ్యర్ధించింది. పెనాల్టీలు, వడ్డీలను మినహాయించడంతోపాటు.. అసలు(ప్రిన్సిపల్‌)ను చెల్లించేందుకు 10ఏళ్ల గడువు ఇవ్వవలసిందిగా కోరింది. లేదంటే కార్యకలాపాల నిలిపివేత పరిస్థితులు తలెత్తవచ్చంటూ వ్యాఖ్యానించింది. అయితే వొడాఫోన్‌ ఐడియా కొనసాగితేనే పరిశ్రమకు మేలని, మూడు ప్రధాన సంస్థలకు బిజినెస్‌ అవకాశాలున్నాయంటూ ఎయిర్‌టెల్‌ ఈ అంశంపై సానుకూలంగా స్పందించడం విశేషం! కాగా.. ఒకవేళ వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు మందగిస్తే.. ప్రత్యర్ధి సంస్థలు అటు రిలయన్స్‌ జియో, ఇటు ఎయిర్‌టెల్‌ ప్రధానంగా లబ్ది పొందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

1995లో ప్రస్థానం
భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ సేవల కార్యకలాపాలు అందించేందుకు  1995లో ఏర్పాటైంది. తదుపరి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. 2017లో మొబైల్‌ సేవల సంస్థ టెలినార్‌ ఆసియా బిజినెస్‌ను కొనుగోలు చేసింది. తద్వారా 43.4 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌తోపాటు.. 4.4 కోట్లమంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇదే విధంగా  19 సర్కిళ్లలో విస్తరించిన టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన కన్జూమర్‌ బిజినెస్‌ను సైతం సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతిని పొందింది. మరోవైపు అనుబంధ సంస్థల ద్వారా దక్షిణాఫ్రికా, తదితర ప్రాంతాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 10th February 2020

3.50శాతం నష్టపోయిన మెటల్‌ షేర్లు 6శాతం పతమనమైన టాటా స్టీల్‌ అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్ తగ్గడంతో సోమవారం దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 3.50శాతం క్షీణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన నాన్‌ఫెర్రస్‌ మెటల్‌ ఉత్పత్తి

ఐటీసీ, ఐషర్‌ కౌంటర్లలో పెరిగిన షార్ట్స్‌

Monday 10th February 2020

షేరు ధరలో పతనం నమోదయి, ఓఐ పెరిగిన షేరు కౌంటర్లో షార్ట్స్‌ పెరిగినట్లు, ధరతో పాటు ఓఐ పెరిగితే లాంగ్స్‌ పెరిగినట్లు నిపుణులు విశ్లేషిస్తారు. ఫిబ్రవరి డెరివేటివ్స్‌ సీరిస్‌లో ట్రేడర్ల యాక్టివిటీ పెరిగిన ఐదు షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.  1. ఐటీసీ: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 10 శాతం. ధరలో మార్పు: - 10.5 శాతం. బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించడం షేరుపై పెను నెగిటివ్‌ ప్రభావం చూపింది.

Most from this category