News


నాట్కో​ ఫార్మాను కొనవచ్చు: జియోజిత్‌

Friday 23rd November 2018
Markets_main1542950038.png-22342

ఫార్మారంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నాట్కోపార్మా కంపెనీ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ జియోజిత్‌ ‘‘బై’’ రేటింగ్‌ కేటాయించింది. కంపెనీకి చెందిన పలు అంశాలను కూలంకుషంగా పరిశీలించిన అనంతరం గతంలో తాము షేరుకు కేటాయించిన ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్‌కు సవరిస్తున్నట్లు జియోజిత్‌ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నాట్కోషేరుపై రేటింగ్‌ సం‍స్థ విశ్లేషణలు ఎలా ఉన్నాయో చూద్దాం...
రంగం:- ఫార్మారంగం
రేటింగ్‌:- కొనొచ్చు

విశ్లేషణ:- ఫార్మారంగంలో నూతన జనరిక్‌ ఆవిష్కరణలతో పాటు కాలానుగుణంగా ఔషధాలను అభివృద్ధి చేసే అంశంపై కంపెనీ ప్రధానంగా దృష్టిపెడుతుంది. అనుభవం కలిగిన యాజమాన్యం, మల్టీపుల్‌ సెష్పాలిటీ చికిత్సా విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం కంపెనీకి కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు.
1. ఫార్మూలేషన్‌, ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్‌)ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో కంపెనీ నికర ఆదాయం 35శాతం వృద్ధిని సాధించింది.
2. యూఎస్‌ మార్కెట్లో పోటీ కంపెనీలు పరిమితంగా ఉండటంతో ఇదే క్యూ2లో కంపెనీ ఈబిటా ఏడాది ప్రాతిపాదికన 104శాతం, మార్జిన్‌ సైతం 1.50శాతం వృద్ధి చెందింది.
3. ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థల వ్యాధి చికిత్సల్లో వినియోగించే కోపాక్సోన్‌ ఔషధ విక్రయాలకు అమెరికా కోర్టు నుంచి ఆమోదం తెలపడం కంపెనీకి మరో సానుకూలాంశం. కోర్టు విక్రయ అనుమతుల నేపథ్యంలో అమెరికా ఫార్మా మార్కెట్లో కంపెనీ విస్తృతి మరింత పెరుగుతుంది.
4.అమెరికా, కెనడా, ఇండియా, బ్రెజిల్‌ దేశాల్లో వ్యాపార అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో వచ్చే రెండేళ్ల(ఆర్థిక సంవత్సరం 18-20)లో కంపెనీ సీజీఆర్‌ 11శాతంగా నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాము.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంని నాట్లో కంపెనీ షేరుకు గతంలో తాము కేటాయించిన ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ నుంచి ‘‘బై’’కు సవరిస్తున్నామని జియోజిత్‌ తెలిపింది.

(నాట్కో షేరుపై జియోజిత్‌ సమగ్ర విశ్లేషణకు కొరకు కింది లింక్‌పై క్లిక్‌ చేయగలరు)

View Pdf One (154295027438213111102018764FY19Q2 Result Update1.pdf)

You may be interested

సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు..

Friday 23rd November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  ఎస్‌బీఐ ఎస్‌బీఐపై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ రూ.350గా నిర్ణయించాం. బ్యాంక్‌ క్యూ2 ఫలితాలను గమనిస్తే పలు విభాగాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. నిర్వహణ లాభం అంచనాలు మించింది. దేశీ మార్జిన్లు, రుణ వృద్ధి, స్లిపేజ్‌లు, అసెట్‌ రికవరీ, రిటర్న్‌ రేషియో వంటి అంశాలు మెరుగుదల నమోదయ్యింది. క్యాపిటల్‌ పొజిషన్‌ బలంగానే ఉంది.

బ్యాంక్‌ రుణ వృద్ధి 15 శాతం

Friday 23rd November 2018

ముంబై: బ్యాంకింగ్‌ రంగం రుణ వృద్ధి 2018 నవంబర్‌ 9వ తేదీతో ముగిసిన పక్షం​రోజుల్లో 14.88 శాతం పెరిగింది. విలువ రూపంలో ఇది రూ.91.11 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రుణాల పరిమాణం 79.31 లక్షల కోట్లు. ఇక ఇదే సమీక్షా కాలానికి సంబంధించి డిపాజిట్లను చూస్తే, 9.13 శాతం వృద్ధితో 108.35 లక్షల కోట్ల నుంచి 118.25 లక్షల కోట్లకు పెరిగింది. ఈ మేరకు రిజర్వ్‌

Most from this category