News


మిధానీ .. రెండేళ్లలో 3 రెట్లు

Monday 17th February 2020
Markets_main1581927866.png-31856

ప్రస్తుత ధర రూ. 216
సరికొత్త గరిష్టమిది
క్యూ3 ఫలితాలతో జోరు
గత 3 రోజుల్లో 31 శాతం ప్లస్‌
ఐపీవో ధర రూ. 90
రూ. 87 వద్ద లిస్టింగ్‌ 
ఐపీవోకు రెస్పాన్స్‌ తక్కువే

ప్రభుత్వ రంగ దిగ్గజం మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) లిమిటెడ్‌ షేరు ఇటీవల లాభాల దుమ్ము రేపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో తాజాగా ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 36 ఎగసి రూ. 216.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ట్రేడింగ్‌ పరిమాణం సైతం​9 రెట్లు పెరగడం విశేషం! తొలి రెండు గంటల్లోనే ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 70 లక్షల షేర్లు చేతులు మారాయి. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 31 శాతం దూసుకెళ్లింది. 

క్యూ3 భేష్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో మిధానీ నికర లాభం మూడు రెట్లు ఎగసింది. రూ. 60 కోట్లను అధిగమించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 17 కోట్లను మాత్రమే ఆర్జించింది. నికర టర్నోవర్‌ 35 శాతం పెరిగి రూ. 207 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 155 శాతం జంప్‌చేసి రూ. 58.5 కోట్లను తాకింది. 1500టీ సామర్థ్యంతో ఏర్పాటైన ఫోర్జ్‌ ప్రెస్‌ నిలకడ సాధించడం, ఆర్డర్‌బుక్‌ బలపడటం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ప్రధానంగా ఇస్రో నుంచి కాంట్రాక్టులు బాగా పెరిగినట్లు కంపెనీ పేర్కొంటోంది. రానున్న మూడేళ్లలోనూ అంతరిక్ష విభాగం ద్వారా 60-65 శాతం ఆర్డర్లను సంపాదించగలమని భావిస్తోంది. ఈ బాటలో త్వరలోనే రూ. 800 కోట్ల విలువైన ఆర్డర్లను పొందే వీలున్నట్లు తెలియజేసింది. దీనికితోడు గతేడాది రూ. 200 కోట్లుగా నమోదైన పెట్టుబడి వ్యయాలు రూ. 100 కోట్లకు తగ్గనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌
స్పెషల్‌ స్టీల్స్‌, సూపర్‌ అల్లాయ్స్‌తోపాటు టైటానియం అల్లాయ్స్‌ తయారు చేయగల ఏకైక దేశీ కంపెనీ ఇది. క్రిటికల్‌ అల్లాయ్స్‌ తయారు చేసే ఈ పీఎస్‌యూ 1973లో ఏర్పాటైంది. ఏరోస్పేస్‌, పవర్‌ జనరేషన్‌, న్యూక్లియర్‌, డిఫెన్స్‌ తదితర ఇంజినీరింగ్‌ రంగాలకు అవసరమయ్యే కీలక ప్రొడక్టులను రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో ప్రధాన తయారీ కేంద్రం కలిగిన కంపెనీ 2009లో మినీరత్న హోదాను సాధించింది. రోహతక్‌, నెల్లూరులలోనూ ప్లాంట్లను నెలకొల్పింది. 2018 మార్చి చివరి వారంలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఐపీవో ధర రూ. 90కాగా.. ఏప్రిల్‌ 4న 3 శాతం డిస్కౌంట్‌తో రూ. 87 వద్ద లిస్టయ్యింది. ఇందుకు ఐపీవోకు 1.2 రెట్లు మాత్రమే స్పందన లభించడం ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా మార్కెట్లలో నెలకొన్న బలహీన సెంటిమెంటు కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ధరతో చూస్తే ప్రస్తుతం.. మిధానీ షేరు దాదాపు మూడు రెట్లు లాభపడటం విశేషం!!

ర్యాలీ బాటలో
2018 ఏప్రిల్‌ 4న నీరసంగా లిస్టయిన మిధానీ షేరు.. తదుపరి వెంటనే వేగమందుకుంది. ఇదే నెల మూడో వారంలోనే ఫండ్స్‌ కొనుగోళ్లు పెరగడంతో షేరు ధర రెట్టింపయ్యింది. వెరసి రూ. 155కు చేరుకుంది. రుణరహిత కంపెనీకావడంతోపాటు పటిష్ట ఫండమెంటల్స్‌ రీత్యా సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఈ ప్రభుత్వ రంగ కంపెనీవైపు దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రూ. 110-150 శ్రేణిలో కన్సాలిడేషన్‌ అవుతూ వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల ఆర్డర్‌బుక్‌ పుంజుకోవడం, ఆకర్షణీయ ఫలితాలను సాధించడం బ్రేకవుట్‌కు దోహదపడినట్లు పేర్కొన్నారు. You may be interested

12000 మద్దతు కోల్పోతే కరెక‌్షన్‌?!

Monday 17th February 2020

రాబోయే కొన్ని సెషన్లలో నిఫ్టీ 12వేల పాయింట్ల మద్దతు కోల్పోతే కొత్త షార్ట్స్‌ పెరగడం లేదా లాంగ్‌ అన్‌వైండింగ్‌ స్పీడవడం జరుగుతుందని టెక్నికల్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో పుట్స్‌, ఐటీ స్టాక్స్‌లో లాంగ్స్‌ను పరిశీలించవ్చని సూచించారు. నిఫ్టీ ప్రస్తుతం సందిగ్ధ స్థితిలోకి జారిందన్నారు. సూచీ చార్టుల్లో డోజీ క్యాండిల్‌స్టిక్‌ ఏర్పడిందని, ఇది సందిగ్ధతకు సంకేతమని చెప్పారు. మరోవైపు బ్యాంకు నిఫ్టీలో భారీ అమ్మకాలు ప్రధాన సూచీపై

52 వారాల కనిష్టానికి 126 షేర్లు

Monday 17th February 2020

126 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఏ2జడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌. అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా పేపర్‌, ఆర్కిడ్‌ప్లే ఇడస్ట్రీస్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆర్టిమిస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌, ఏటీఎన్‌ ఇంటర్నేషనల్‌, అరిన్‌ప్రొ సొల్యూషన్స్‌, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బాట్రానిక్స్‌ ఇండియా, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, భారత్‌ హెవీ

Most from this category