News


ఎల్‌అండ్‌టీ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థల అభిప్రాయమిదే..!

Saturday 25th January 2020
Markets_main1579950014.png-31209

ఎల్‌ అండ్‌ టీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి 2.03శాతం పెరిగి రూ.1359.80 వద్ద స్థిరపడింది. మూడో క్వార్టర్‌ ఫలితాలను ఒక పరిశీలిస్తే... పన్ను వ్యయం తగ్గడంతో పాటు నిర్వహణ ఆదాయం కలిసిరావడంతో నికరలాభం గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధిని సాధించి రూ.రూ.2,560 కోట్లను ఆర్జించింది.  మొత్తం ఆదాయం రూ.34,823 కోట్ల నుంచి రూ.36,718 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యవస్థలో ఆర్థిక మందగమనంతో ఈ త్రైమాసికంలో రూ.41,579 కోట్ల ఆర్డర్లు సంపాదించినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి ఆర్డర్ల బుక్‌ 5 శాతం వృద్ధితో రూ.3,06,280 కోట్లకు పెరిగింది.

త్రైమాసిక ఫలితాలను విశ్లేషించిన పలు బ్రోకరేజ్‌ సంస్థలు కంపెనీ షేరుపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

బ్రోకరేజ్‌ సంస్థ పేరు: మోర్గాన్‌ స్టాన్లీ
రేటింగ్‌: ఓవర్‌ రేటింగ్‌
టార్గెట్‌: రూ.1556 
విశ్లేషణ: షేరు ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. అయితే టార్గెట్‌ ధరను మాత్రం రూ.1753 నుంచి రూ.1556కు తగ్గించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జిక్యూషన్, ద్రవ్య సంబంధిత సవాళ్లు ఆదాయ వృద్ధిని ప్రభావితం చేయడంతో మూడో త్రైమాసికంలో అంచనాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. నగదు ప్రవాహాలు మెరుగుపడటంతో పాటు ఎగ్జిక్యూషన్ సవాళ్లు తగ్గడంతో క్యూ4లో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అశాభావాన్ని వ్యక్తం చేసింది.

బ్రోకరేజ్‌ పేరు:- సిటి
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1700
విశ్లేషణ: బ్రోకరేజ్‌ సంస్థ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1700లుగా నిర్ణయించింది. కంపెనీ క్యూ3లో తమ అంచనాలకు మించి రాణించిందని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. బలమైన ఆర్డర్లను దక్కించుకున్న నేపథ్యంలో కంపెనీ క్యూ4లో ఫలితాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. సిటీ బ్రోకరేజ్‌ సంస్థ టాప్‌ పిక్‌లో ఎల్‌అండ్‌టీ ప్రథమస్థానంలో ఉంది. 

బ్రోకరేజ్‌ సంస్థ: ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
రేటింగ్‌ : మెయింటెన్స్‌ అవుట్‌పర్‌ఫామ్‌
టార్గెట్‌ ధర: రూ.1775
విశ్లేషణ: ప్రధాన వ్యాపారమైన ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక‌్షన్‌ విభాగం ఆర్డర్‌ ఇన్‌ఫ్లో మెరుగుపడుతూనే ఉంది. కొన్ని ఆర్డర్‌లలో నిర్దిష్ట సమస్యల కారణంగా ఎగ్జిక్యూషన్ కొద్దిగా బలహీనంగా ఉంది. ఆర్డర్ ఇన్‌ఫ్లో పరంగా ఎల్ అండ్ టి గైడెన్స్‌ను అందుకుంటుందని ఆశిస్తోంది. రెవెన్యూ వర్కింగ్‌ క్యాపిటల్‌ స్థాయి క్షీణించింది. అయితే రానున్న కాలం‍లో మెరుగుపడవచ్చు. ఆర్థిక సంవత్సరం 2019-21లో ఆదాయం 13-15శాతం వృద్ధి చెందవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.

బ్రోకరేజ్‌ సం‍స్థ: కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ. 1560లు 
విశ్లేషణ: సహేతుకమైన వాల్యూవేషన్‌ ఉండటంతో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అయితే షేరు టార్గెట్‌ ధరను రూ.1,560 నుంచి రూ.1550ల స్వల్పంగా కోత విధించింది. క్యూ 3 ఫలితాల్లో బలహీనతను చేర్చడానికి కోర్ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్చన్స్‌ అంచనాలను 7-10 శాతం తగ్గించింది. సమీప-కాల పైప్‌లైన్ రెండంకెల ఎఫ్‌వై 21 ఆదాయ వృద్ధిని మెరుగుపరుస్తుంది. 



You may be interested

ప్రీ-బడ్జెట్ అంచనాలు, క్యూ3 ఫలితాలే నడిపిస్తాయ్‌..

Monday 27th January 2020

ఈవారంలోనే జనవరి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు  శనివారం కేంద్ర బడ్జెట్.. ఆ రోజూ పని చేయనున్న మార్కెట్‌ ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, టాటా మోటార్స్ ఫలితాలు మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రకటనపై మార్కెట్‌ వర్గాలు కొండంత ఆశతో ఉన్నాయి. నీరసించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని గాడిన

5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాల పెంపు?!

Saturday 25th January 2020

బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందంటున్న నిపుణులు చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌, కెమికల్స్‌, హస్తకళల రంగాల దాదాపు 50 రకాల ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు పెంచాలని భారత్‌ యోచిస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన దాదాపు 5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని సమాచారం. తాజా సుంకాల

Most from this category