News


ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 27th January 2020
Markets_main1580108880.png-31234

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధృక్పథం వెలిబుచ్చుతున్నాయి. 
= బ్యాంకు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ తెలిపింది. టార్గెట్‌ ధరను రూ. 560 నుంచి రూ. 650కి పెంచింది. బ్యాంకు క్యు3 ఫలితాల్లో ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ బలంగా ఉన్నాయని, రికవరీలు మెరుగుపడ్డాయని తెలిపింది. స్లిపేజ్‌లు బీబీ బుక్‌ మాత్రం కొంత పెరిగాయని, ఇవి సమీప భవిష్యత్‌లో అసెట్‌ క్వాలిటీకి ఇబ్బందులు తీసుకురావచ్చని తెలిపింది. లోన్‌, డిపాజిట్‌ గ్రోత్‌లను అధిక స్లిపేజ్‌లు కమ్మేసాయని తెలిపింది. అయితే బ్యాంకు సహించే స్థాయికి లోపే స్లిపేజ్‌లు (2.1 శాతం) ఉన్నాయని పేర్కొంది. రాబోయే సంవత్సరానికి ఈపీఎస్‌ అంచనాలను పెంచింది. 
= బ్యాంకు షేరుకు కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. టార్గెట్‌ను రూ. 650గా నిర్ణయించింది. బ్యాంకు బలమైన ప్రదర్శన చూపిందని, ఎర్నింగ్స్‌ మెరుగుదలపై ఆరోగ్యకర సంకేతాలు ఇచ్చిందని వెల్లడించింది. కోర్‌ పీపీఓపీపై ప్రత్యేక శ్రద్ధతో బాలెన్స్‌ షీటును బలోపేతం చేస్తోందని తెలిపింది. రిటైల్‌ పోర్టుఫోలియో మంచి పెరుగుదల చూపుతోందని తెలిపింది. కొత్తగా డిఫాల్టయితున్న కంపెనీలకు రుణాలిచ్చిన జాబితాలో బ్యాంకు లేకపోవడం కలిసివచ్చేఅంశమని పేర్కొంది. రాబోయే సంవత్సరానికి ఆర్‌ఓఏ 1.7 శాతం, ఆర్‌ఓఈ 16.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. 



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ క్యూ3 నష్టం రూ. 570 కోట్లు

Monday 27th January 2020

ఇంపెయిర్‌మెంట్‌ చార్జీల ఎఫెక్ట్‌ 52 వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్లమేర నికర నష్టం నమోదు చేసింది. గతేడాది అంటే 2018-19 క్యూ3లో రూ. 485 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం

52 వారాల గరిష్టానికి 57 షేర్లు

Monday 27th January 2020

-52 వారాల కనిష్టానికి 26 షేర్లు ఇంచుమించు 57 షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, అమర రాజా బ్యాటరీస్‌, అపోలో హాస్పటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అతుల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, డాబర్‌ ఇండియా, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, జుబ్లింట్‌ ఫుడ్‌ వర్క్‌, లారస్‌ ల్యాబ్స్‌, పీవీఆర్‌, టొరంటో పవర్‌, వైభవ్‌

Most from this category