News


ఐఆర్‌సీటీసీ.. షేరుకి ‘తేజస్‌’

Friday 7th February 2020
Markets_main1581067741.png-31600

ఐపీవో ధర రూ. 320
లిస్టింగ్‌ ధర రూ. 644
ప్రస్తుతం రూ. 1515(ఎన్‌ఎస్‌ఈ)

ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాక రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. అందరి అంచనాలను మించుతూ షేరు పురోగమిస్తోంది. గురువారం (6న) ఇంట్రాడేలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 1563 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి రూ. 1504 వద్ద ముగిసింది. ప్రస్తుతం 1 శాతం బలపడి రూ. 1520 వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా ఐపీవో ధర రూ. 320తో పోలిస్తే 5 రెట్లు దూసుకెళ్లింది. లిస్టింగ్‌ రోజు అక్టోబర్‌ 14 ధర రూ. 644తో చూసినా.. కేవలం నాలుగు నెలల్లోనే 135 శాతం ర్యాలీ చేసింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 24,200 కోట్లను అధిగమించింది. రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో రారాజుగా నిలుస్తున్న కంపెనీ ఐపీవోలో 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచితే.. ఏకంగా 225 కోట్ల షేర్లకోసం బిడ్స్‌ దాఖలుకావడం విశేషం. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ దూకుడుకు కారణాలేవిటంటే...? 

బడ్జెట్‌ బూస్ట్‌
రైల్వే అనుబంధ కంపెనీ ఐఆర్‌సీటీసీ.. ఆన్‌లైన్‌ టికెట్లతోపాటు కేటరింగ్‌ సేవలను సైతం అందిస్తోంది. అంతేకాకుండా రైల్‌ నీరు బ్రాండుతో త్రాగునీటి విక్రయాలనూ చేపడుతోంది. వీటికి జతగా ఇటీవల తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణలోకి ప్రవేశించింది. ఇప్పటికే లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్‌- ముంబై మధ్య రెండు తేజస్‌ రైళ్లను నిర్వహిస్తున్న కంపెనీ ఇండోర్‌- వారణాశి మధ్య రాత్రివేళల్లో నడిచే మరో రైలును ప్రవేశపెట్టనుంది. తాజా బడ్జెట్‌లో మరిన్ని తేజస్‌ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇటీవల ఐఆర్‌సీటీసీ షేరు మరింత జోరు చూపుతోంది. బడ్జెట్‌ నుంచి చూస్తే షేరు 30 శాతం జంప్‌చేయగా.. గత నెల రోజుల్లోనే 64 శాతం ఎగసింది.

పటిష్ట ఫలితాలు 
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఐఆర్‌సీటీసీ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 172 కోట్లను తాకింది. క్యూ3లో మరింత మెరుగైన ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు నిపుణలు అంచనా వేస్తున్నారు. వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను సైతం ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు. ఐఆర్‌సీటీసీలో డిసెంబర్‌కల్లా కేంద్ర ప్రభుత్వ వాటా 87.4 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను 12న ప్రకటించనుంది. కాగా.. ఆన్‌లైన్‌ రైల్‌ టికెట్ల బుకింగ్‌లో కంపెనీ 75 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. రైల్‌ నీరుతో రైల్వే విభాగంలో 45 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కంపెనీ రూ. 21 ఈపీఎస్‌ను సాధించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రూ. 26 ఈపీఎస్‌ నమోదుకాగలదని అంచనా వేశారు. గత ఐదేళ్లలో ఐఆర్‌సీటీసీ 25-40 శాతం మధ్య ఆర్‌వోఈ సాధించినట్లు ఈల్డ్‌ మాగ్జిమైజర్‌ వ్యవస్థాపకులు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. ఇదే విధంగా ఆర్‌వోసీఈ సైతం 36-63 శాతం మధ్య నమోదైనట్లు పేర్కొన్నారు.You may be interested

షేర్ల ఎంపికకు నాలుగు రంగాలు!

Friday 7th February 2020

పంకజ్‌ టిబ్రేవాల్‌ షేర్లలో బాటమ్‌అప్‌ ఎంపిక అవకాశాలు వెతికి అందిపుచ్చుకోవాలని కోటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ సూచిస్తున్నారు. బాటమ్‌ అప్‌ షేర్లను నాలుగు రంగాల్లో గుర్తించవచ్చంటున్నారు. మూడునాలుగేళ్లుగా స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం మంచి పాజిటివ్‌గా ఉందన్నారు. అదేవిధంగా సప్లైచైన్స్‌ భారత్‌దిశగా మరలుతున్నాయని, ఇలాంటి సప్లైచైన్స్‌తో సంబంధం ఉన్న కంపెనీలు రాబోయే కాలంలో దూసుకుపోతాయని చెప్పారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలని చెప్పారు. ఇక మూడో పాజిటివ్‌ రంగం క్యాపిటల్‌గూడ్స్‌ అని

మ్యూచువల్‌ ఫండ్లు వాటాలు పెంచుకున్న షేర్లివే..!

Friday 7th February 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాది(2019) డిసెంబర్‌ చివరి నాటికి రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత డిసెంబర్‌ చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకునట్లు గణాంకాలు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు బీఎస్‌ఈ500 కంపెనీల్లో 243 కంపెనీల్లో తమ

Most from this category