News


ఈ షేరు మూడు రోజుల్లో 29 శాతం అప్‌..ఎందుకంటే!

Saturday 15th February 2020
Markets_main1581759288.png-31826

వారాంతాన సరికొత్త గరిష్టానికి షేరు
ఈ ఏడాది క్యూ3లో పటిష్ట ఫలితాలు
షేర్ల ముఖవిలువ విభజన బాట
షేరుకి రూ. 13.5 డివిడెండ్‌

కొద్ది రోజులుగా జోరుగా పరుగెడుతున్న ర్వైల్వే రంగ మౌలిక సదుపాయాల పీఎస్‌యూ.. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ షేరు వారాంతాన సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 573కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఆపై 4.5 శాతం లాభంతో రూ. 551 వద్ద ముగిసింది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. దీంతో గత మూడు రోజులుగా షేరు దూకుడు చూపుతూ వస్తోంది. వెరసి గత మూడు రోజుల్లోనే 29 శాతం పురోగమించింది.

క్యూ3 భేష్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నికర లాభం 52 శాతం ఎగసి రూ. 142 కోట్లను అధిగమించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 93 కోట్లు మాత్రమే ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ(ఇబిటా) మార్జిన్లు 11 శాతం నుంచి దాదాపు 13 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా అంటే 3 శాతం వెనకడుగుతో రూ. 1211 కోట్లకు చేరింది. మార్జిన్లు పుంజుకోవడం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు లాభదాయకతను మెరుగుపరచినట్లు నిపుణులు తెలియజేశారు. రుతుపవనాలు అధికకాలం కొనసాగడం, జమ్ము, కాశ్మీర్‌సహా పలు పర్వత ప్రాంతాలలో పనులకు ఆటంకం కలగడంతో ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడినట్లు పేర్కొన్నారు.

భారీ డివిడెండ్‌
క్యూ3 ఫలితాల విడుదల సందర్భంగా ఇర్కాన్‌ ఇం‍టర్నేషనల్‌.. వాటాదారులకు షేరుకి రూ. 13.45 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. అంతేకాకుండా 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనకు బోర్డు ఆమోదించినట్లు  తెలియజేసింది. తద్వారా రూ. 10 ముఖ విలువగల ప్రతీ షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. 

రైల్వే ఇన్‌ఫ్రా..
ర్వైలే రంగ ఇన్‌ఫ్రా‍స్ట్రక్చర్‌ కంపెనీ ఇర్కాన్‌ ఇం‍టర్నేషనల్‌ 2018 సెప్టెంబర్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం 99 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఇష్యూ ధర రూ. 475కాగా.. తద్వారా ప్రభుత్వం రూ. 466 కోట్లు సమీకరించింది. అయితే షేరు 13 శాతం డిస్కౌంట్‌తో రూ. 413 వద్ద లిస్టయ్యింది. ఇందుకు సెకండరీ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. లిస్టింగ్‌ తదుపరి ఇర్కాన్‌.. ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. 2019లో రైల్వే రగానికి చెందిన మరో కంపెనీ రైట్స్‌ లిమిటెడ్‌ తొలుత స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తదుపరి ఇర్కాన్‌ పబ్లిక్‌ ఇష్యూని చేపట్టింది. ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇర్కాన్‌ ఇం‍టర్నేషనల్‌ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనను చేపడుతుంటుంది. వీటిలో రైల్వే ప్రాజెక్టులు అధికంకాగా.. హైవేలు, బ్రిడ్జిలు, రన్‌వేలు, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్లు, రెసిడెన్షియల్‌, ఇండస్ట్రియల్‌ ప్రాపర్టీల అభివృద్ధిని సైతం నిర్వహిస్తుంది. 2019 మార్చికల్లా రూ. 24,000 కోట్లమేర ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. వీటిలో 85 శాతంవరకూ రైల్వేరంగ ప్రాజెక్టులేకావడం గమనార్హం! 

బడ్జెట్‌ పుష్‌
కేంద్ర ఆర్థిక శాఖ గడాది చివర్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 102 లక్షల కోట్ల ప్రణాళికలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీయ మౌలికసదుపాయాల ప్రణాళిక(ఎన్‌ఐపీ)లో భాగంగా రానున్న ఆరేళ్ల కాలంలో ప్రయివేట్‌ రంగానికి భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా పెట్టుబడులను సమకూర్చే అంశంపై బడ్జెట్‌లోనూ కొంతమేర ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ మరిన్ని ప్రాజెక్టులతోపాటు పెట్టుబడులను సమకూర్చుకునే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ కీలకంకాని ఆస్తుల విక్రయం చేపట్టడం ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. రానున్న 6-8 నెలల కాలంలో రైల్వే శాఖ రూ. 25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు బిడ్స్‌ను ఆహ్వానించనుంది. అయితే ఇటీవల సవరించిన పాలసీ ప్రకారం పీఎస్‌యూల మధ్య పరిమిత పోటీకి మాత్రమే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో రూ. 6000-8000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇర్కాన్‌ సొంతం చేసుకునే వీలున్నట్లు ఎస్‌బీఐక్యాప్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది.You may be interested

ఏటీఎం ఛార్జీలు పెరుగుతాయా..?

Saturday 15th February 2020

దానికింత దీనికింత అంటూ ఏదోఒక పేరుమీద ఛార్జీలు వసూలుచేస్తూ.. బ్యాంకులు ఖాతాదారుల జేబులు ఖాళీచేస్తున్నాయి. త్వరలో ఏటీఎంలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. నిర్ణీత ఉచిత లావాదేవీల తర్వాత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలంటే ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే మరికొంత అదనంగా చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందిస్తే ఏటీఎం ఛార్జిలు

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌

Saturday 15th February 2020

ఎప్పుడూ వివిధ రకాల కొత్తకొత్త ఆఫర్లతో ముందుండే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ మరో బిగ్‌ సేల్‌కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి17 నుంచి 21 వరకు మొబైల్‌పై బొనాంజాత సేల్‌ను ప్రకటించింది. దీనిలో ప్రధాన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌లతోపాటు , బడ్జెట్‌ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఏ మొబైల్‌ అయినా యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు మీద కొనుగోలు చేసినట్లయితే 10 శాతం

Most from this category