News


రిస్క్‌కు నిలవగలిగి, మిగులు సొమ్ముంటేనే.. !

Monday 16th March 2020
Markets_main1584349679.png-32507

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తేలిపోవచ్చు
దశాబ్దాలుగా కేంద్ర బ్యాంకుల విధానాలివే..
కేంద్ర బ్యాంకులకంటే హెల్త్‌కేర్‌ వ్యవస్థ మేలు

షేర్లు పతనమయ్యాయని ఎంచుకోవద్దు
బ్యాలన్స్‌షీట్‌, యాజమాన్యం వంటి అంశాలు చూడాలి


- అరవింద్‌ శాంగర్‌, జియోస్ఫియర్‌ కేపిటల్‌

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ముట్టడిని ఎదుర్కొనేందుకు తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. అయితే దశాబ్దాలుగా సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర బ్యాంకులు ఇవే విధానాలను అవలంబిస్తున్నాయి. ఈసారి ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలు తేలిపోయే అవకాశముందంటున్నారు జియోస్ఫియర్‌ కేపిటల్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ పార్టనర్‌ అరవింద్‌ శాంగర్‌. ఒక ఇంటర్వ్యూలో స్టాక్‌ మార్కెట్లు, కరోనా వైరస్‌ ప్రభావం తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

హెల్త్‌కేర్‌ సిస్టమ్‌
అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రతిసారీ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు, బిలియన్‌ డాలర్లకొద్దీ సహాయక ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం గతంలో ఎరుగని విధంగా కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నీరసించే పరిస్థితులు తలెత్తాయి. దీనిని ఎదుర్కొనేందుకు అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా 0-0.25 శాతానికి చేర్చింది. బిలియన్లకొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేస్తోంది. అయితే ఫెడ్‌ విధానాలు కరోనా సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించలేకపోవచ్చు. అన్ని సమస్యలకూ కేంద్ర బ్యాంకులు ఇలాంటి విధానాలనే అవలంబిస్తున్నాయి. ఇంతకంటే ప్రస్తుతం ఎదురవుతున్న  సమస్యలకు సమర్ధవంత హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ పరిష్కారం చూపే అవకాశముంది.

అంచనా వేయలేం
కోవిడ్‌-19 వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్థితులు ఎంతవరకూ కొనసాగుతాయన్నది చెప్పలేము. వేసవి వచ్చాక ఈ సమస్య ఉపశమించినప్పటికీ తిరిగి వచ్చే ఏడాది తలెత్తవచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాదివరకూ ఈ వ్యాధిని అరికట్టే వ్యాక్సిన్‌ను రూపొందించే పరిస్థితిలేదు. కరోనాకు తగిన చికిత్సను కనుగొనేవరకూ అనిశ్చితి కొనసాగవచ్చు. ఇలాంటి కొన్ని సవాళ్లకు ఫెడ్‌ సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఇంతగా విస్తరించిన ఇలాంటి సమస్యలను గతంలో ఎదుర్కొని ఉండకపోవడంతో భవిష్యత్‌ను అంచనా వేయలేము. 

స్టాక్స్‌ కొనుగోలు
ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు స్టాక్‌ మార్కెట్లలో గతంలో ఎదురుకాకవపోవడంతో ఇన్వెస్టర్లలో అయోమయం చోటుచేసుకుంటోంది. మార్కెట్ల ప్రయాణం ఎటువైపు లేదా పతనం ఎంతవరకూ అన్న విషయాలు అంచనా వేయడం కష్టమే. దీంతో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సరైన సమయాన్ని నిర్వచించలేం. బ్యాలన్స్‌షీట్స్‌ పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్ల ధరలు కనిష్టాలకు చేరుతున్నప్పుడు పెట్టుబడులవైపు దృష్టిపెట్టవచ్చు. కంపెనీల బిజినెస్‌లకు దీర్ఘకాలంలో ఢోకా లేదనుకున్నప్పడు షేర్ల విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో సమయానుగుణ నొప్పిని భరించవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌చేయాలనుకుంటే వేరే దారిలేదు.

వ్యూహాలు ఇలా
దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు అని చెప్పడం తేలికే. కానీ ఈ ప్రయాణంలో ఇన్వెస్టర్లు నష్టాలను భరించవలసి రావచ్చు. ఇందువల్లనే పలువురు ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చూస్తున్నారు. ఇది తెలివైన నిర్ణయాలుగా భావించే ఇలా చేస్తున్నారు. నిజానికి మార్కెట్లు ఎక్కడివరకూ పడిపోతాయో.. లేదా ఎక్కడ ఆగుతాయో ఎవరు చెప్పగలరు? అయితే ఇలాంటి పరిస్థితులను సొమ్ము  చేసుకోవాలనుకుంటే మాత్రం.. మిగులు నిధులుండాలి. రిస్కులను తట్టుకోగలగాలి. వీటికితోడు సహనంతో వ్యవహరించగలగాలి. నాణ్యమైన కంపెనీలను చౌక ధరలకు లభించినప్పడు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లగలగాలి. ఉదాహరణకు ఒక స్టాక్‌ను రూ. 100కు కొనుగోలు చేయాలనుకున్నాక.. నెల తరువాత రూ. 75కు లభిస్తే.. చౌక అనుకోకూడదు. కంపెనీ ఫండమెంటల్స్‌ను పరిశీలించాలి. ఇందుకు అవసరమైన రేషియోలు పరిశీలించాలి. భవిష్యత్‌లో ఆర్జన ఎలా ఉండనుందన్న అంశాన్ని అంచనా వేయలేంగనుక పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, యాజమాన్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్లిష్టసమయాల్లోనూ కంపెనీని సమర్ధవంతంగా నడిపించగల యాజామన్యం కీలకంగా నిలుస్తుంది. ఏదైనా ఒక కంపెనీ షేరు గరిష్టం నుంచి ఇంత శాతం పతనమైంది గనుక చౌకగా లభిస్తున్నదన్న అంచనాలు కరెక్ట్‌కాకపోవచ్చు. షేరు తిరిగి గరిష్టాలకు చేరుకోవడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. 

ఆర్థిక వృద్ధి 
కొంతకాలంగా దేశ ఆర్థిక వ్యవస్థ అంత అశాజనకంగా ఏమీలేదు. ప్రస్తుతం కరోనా కల్లోలం కారణంగా రికవరీ మరికొంతకాలం ఆలస్యంకావొచ్చు. దీంతో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహాల విషయంలో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. షేర్ల ధరలు దిగివచ్చాయన్న ఆలోచనతోకాకుండా కంపెనీలో నిజమైన విలువను పట్టుకోలగినప్పుడు పెట్టుబడులకు ఆలోచించడం మేలు. నిజానికి దేశీ ప్రభుత్వం పెట్రోల్‌ ధరను డీరెగ్యులేట్‌ చెయ్యలేదని చెప్పవచ్చు. ఇది స్వేచ్చా మార్కెట్‌కాదు. ప్రభుత్వం ధరలను నియంత్రిస్తోంది. చమురు ధరల పతనాన్ని వినియోగదారులకు అందించకపోవడం నిరాశపరచింది. చమురు ధరల పతన ప్రయోజనాన్ని ప్రభుత్వం ఎక్సయిజ్‌ డ్యూటీలు పెంచడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కోసం వినియోగించుకుంటోంది. ధరల నిర్ణయంలో ఆయిల్‌ మార్కెటిం‌గ్‌ కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నట్లుగా తోస్తోంది. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నప్పటికీ బడ్జెట్‌లో పన్నులను తగ్గించడం ద్వారా వినియోగ డిమాండ్‌ పెంచే చర్యలు చేపట్టింది. ఇదేవిధంగా పెట్రోల్‌ ధరల తగ్గుదలను వినియోగదారులకు బదిలీ చేస్తే.. డిమాండు పెరుగుదలకు సహకరించే వీలుండేది. ఇప్పటికే ఆర్‌బీఐ సైతం లిక్విడిటీ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యల ద్వారా వినియోగానికి బూస్ట్‌నిచ్చే ప్రయత్నాలు చేసింది. 

కరోనా కట్టడి
ద్రవ్య విధానాల సంగతి పక్కనపెడితే.. కరోనా వైరస్‌ కేసుల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే ప్రజలు యూఎస్‌, యూరోపియన్‌ దేశాలతో గణాంకాలు పోల్చడం తప్పు. ఆఫ్రికా దేశాలలో కరోనా వ్యాప్తిలేదు. అలాగని ఇది వాతావరణ సమస్యకాదు. గ్లోబల్‌ ట్రావెల్‌కు సంబంధించిన అంశం.  You may be interested

ఫిబ్రవరిలో టోకు ధరలు తగ్గాయ్‌

Monday 16th March 2020

 మనదేశంలో టోకు ధరలు ఫిబ్రవరిలో గణనీయంగా తగ్గాయి. ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు తగ్గడంతో ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.26 శాతం తగ్గిందని వాణిజ్య పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. జనవరిలో టోకు ధరలు 3.1 శాతం ఉండగా ఫిబ్రవరిలో అది 2.26 తగ్గినట్లు తెలిపింది. కాగా టోకుధరల సూచి ప్రకారం 2018 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.93 శాతంగా ఉంది. ఈ జనవరిలో ఉల్లిపాయల టోకు

19 నుంచి యస్‌ బ్యాంక్‌ పూర్తి సేవలు

Monday 16th March 2020

అనేక రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేటురంగ రుణ దాత యస్‌ బ్యాంక్‌ పూర్తి స్థాయి సేవలు మార్చి 18నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1132 బ్రాంచ్‌లలో మార్చి 19 ఉదయం నుంచి తమ ఖాతాదారులకు సేవలను అందించనున్నట్లు యస్‌బ్యాంక్‌ ట్వీటర్‌ ద్వారా వెల్లడించింది. అన్నిరకాల డిజిటల్‌ సేవల్ని కూడా పొందవచ్చని తెలిపింది. యస్‌బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన మారటోరియంను మార్చి 18న ఎత్తివేయనుండడంతో బ్యాంకు యధాతధంగా సేవలను అందించనుందని తెలిపింది.

Most from this category