News


బీమా షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత?

Tuesday 4th February 2020
Markets_main1580792516.png-31491

బడ్జెట్‌ ప్రతిపాదనలతో ప్రతికూల ప్రభావం!
బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు

ఆదాయ పన్నుకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న తాజా ప్రతిపాదనల కారణంగా బీమా రంగ కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో బీమా రంగ షేర్ల టార్గెట్‌ ధరలను కుదిస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర వివరాలు చూద్దాం..

కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను సవరణల నేపథ్యంలో బీమా రంగ కంపెనీలపై స్వల్ప కాలంలో పరిమిత ప్రభావం చూపే వీలున్నట్లు కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు ప్రస్తుత శ్లాబులలోనే కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం పలు రకాల పన్ను మినహాయింపులను రద్దు చేయనుండటంతోపాటు.. రానున్న కాలంలో కొత్త ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో అమలు చేసే సంకేతాలిస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో దీర్ఘకాలంలో బీమా రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావంపడవచ్చని  తెలియజేశాయి. 

కోత బాటలో
బీమా రంగంలో నెలకొన్న దీర్ఘకాల అనిశ్చితి కారణంగా బీమా రంగ కంపెనీ షేర్ల టార్గెట్‌ ధరల్లో 7-13 శాతం కోత పెడుతున్నట్లు ఇన్వెస్టెక్‌ తెలియజేసింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఫెయిర్‌ వేల్యూని రూ. 615 నుం‍చి రూ. 590కు కుదిస్తున్నట్లు కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ విలువను రూ. 610 నుంచి రూ. 580కు, ఎస్‌బీఐ లైఫ్‌ విలువను రూ. 1030 నుంచి రూ. 1010కు తగ్గించింది. ఇదే విధంగా ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టార్గెట్‌ ధరలలో విదేశీ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ 2-9 శాతంమేర కోత పెట్టింది.

ఇన్వెస్టెక్‌
బీమా రంగ కంపెనీల షేర్ల డీరేటింగ్‌కు వీలున్నట్లు ఇన్వెస్టెక్‌ అభిప్రాయపడింది. ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితి, షేర్ల అధిక విలువలు దీనికి కారణమని తెలియజేసింది. ఆదాయ పన్ను సవరణలు స్వల్ప కాలంలో పరిమిత ప్రభావాన్నే చూపినప్పటికీ.. పలు మినహాయింపులను రద్దు చేయడంతో దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం​ఉంటుందని పేర్కొంది. వెరసి బీమా రంగ కంపెనీ షేర్ల టార్గెట్‌ ధరలను 7-13 శాతంమేర తగ్గిస్తున్నట్లు తెలియజేసింది.

జెఫరీస్‌
బీమా రంగ ప్రొడక్టులపై తాజా ఆదాయ పన్ను సవరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని జెఫరీస్‌ పేర్కొంది. రూ. 15 లక్షలకుపైన ఆదాయం ఆర్జించే వ్యక్తులు లేదా పూర్తి మినహాయింపులను పొందుతున్న వారికి ఇవి లబ్డి చేకూర్చవని తెలియజేసింది. డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు బీమా రంగ కంపెనీల మార్జిన్లపై ఒక్కసారే ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడింది.

కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌
తాజాగా ప్రతిపాదించిన పన్ను రేట్లు బీమా రంగంలో కొత్త బిజినెస్‌ విలువ(VNB) మార్జిన్లకు సంబంధించి 1-1.5 శాతంమేర కోతకు దారితీయవచ్చని కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది. ఇదే విధంగా ఇప్పటికే అమలవుతున్న బిజినెస్‌ విలువ(VIF)పై 3-5 శాతంమేర ప్రభావం ఉంటుందని తెలియజేసింది. ఐసీఐసీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, మ్యాక్స్‌ లైఫ్‌పై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. 

మోతీలాల్‌ ఓస్వాల్‌
పన్ను మినహాయింపులను తొలగించడంతో బీమా రంగ ప్రొడక్టుల విక్రయాలు తగ్గనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఇంకా ఇలా వివరించింది.. కొత్త విధానాలకు మళ్లే వ్యక్తులు బీమా పాలసీల కొనుగోళ్లపై పన్ను మినహాంపులను కోల్పోతారు. నిజానికి కొత్త విధానంలో పన్ను పెరిగే అవకాశముంది. ఫలితంగా కొత్త విధానాలకు అత్యధిక శాతంమంది ఆసక్తి చూపించకపోవచ్చు. దీంతో బీమా రంగంలో కొత్త బిజినెస్‌ విక్రయాలపై అంతగా ప్రభావం​ఉండకపోవచ్చు. అయితే సమీపకాలంలో బీమా రంగ స్టాక్స్‌ ఒడిదొడుకులను చవిచూసే వీలుంది.

మోర్గాన్‌ స్టాన్లీ
బీమా రంగ కంపెనీల డివిడెండ్‌ ఆదాయంపై ప్రస్తుతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. దీంతో పన్ను రేట్లపై ప్రభావం పడుతుందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. కొత్త ప్రతిపాదనలు పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపకపోవచ్చునని అభిప్రాయపడింది. అయితే మినహాయింపులను రద్దు చేయనున్న వార్తలు దీర్ఘకాలంలో అనిశ్చితికి తెరతీస్తాయని తెలియజేసింది. అధిక విలువల రీత్యా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు ఈక్వల్-వెయిట్‌, ఎస్‌బీఐ లైఫ్‌నకు రెలిటివ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌లను ప్రకటించింది.


 



You may be interested

ఐటీసీ షేరు పతనం... పన్నుపోటొక్కటే కారణమా?

Tuesday 4th February 2020

అంతర్జాతీయంగా బలహీనంగా ఉన్న టొబాకో వ్యాపారం ప్రభావం చూపని కొత్త సీఈఓ బడ్జెట్లో సిగిరెట్లపై పన్ను భారం పెంచడంతో ఐటీసీ రెండ్రోజుల్లో దాదాపు 12 శాతం పతనమైంది. ఇప్పుడే కాదు చాలాసార్లు అనలిస్టులు, మదుపరుల అంచనాలను ఐటీసీ బోల్తా కొట్టిస్తూనే ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లుగా దాదాపు 85 శాతం మంది అనలిస్టులు ఈ స్టాకుపై బుల్లిష్‌గా ఉంటున్నా ఐటీసీ మాత్రం స్థిరంగా పతనమవుతూ వచ్చింది. తాజాగా దాదాపు ఐదేళ్ల కనిష్ఠాలకు

షేర్ల పరోక్ష బదిలీ పన్నుపై ఎఫ్‌పీఐల మల్లగుల్లాలు!

Tuesday 4th February 2020

షేర్ల పరోక్ష బదిలీపై పన్ను విధింపు నిబంధనల నుంచి  తమ పెట్టుబడులు రక్షించుకునేందుకు మారిషస్‌, కేమన్‌ ఐలాండ్స్‌ నుంచి భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఎఫ్‌పీఐలు తంటాల పడుతున్నాయి. సింగపూర్‌ లేదా లండన్‌లో ఒక ఫండ్‌ మేనేజర్‌ను నియమించుకోవడం ద్వారా పన్ను నిబంధనల పరిధి నుంచి తప్పించుకోవడం లేదా తమకుతాము పునర్‌వర్గీకరించుకోవడం చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. సెబి కేటగిరీ 1 పథకం కింద రిజిస్టరయిన సంస్థలకు మాత్రమే షేర్ల పరోక్ష బదిలీపై పన్ను

Most from this category