News


ఈ వారం పిక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌

Saturday 22nd September 2018
Markets_main1537599375.png-20480

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ను ఈ వారం స్టాక్‌ పిక్‌గా సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌
ఇండస్ట్రీ: రియల్‌ ఎస్టేట్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.466
టార్గెట్‌ ప్రైస్‌: రూ.565
బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రియల్టీ కంపెనీ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.565కు వెళ్లొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయి నుంచి రూ.414 వరకు దిగువకు పడిపోతే మరిన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. సెజ్‌ వ్యాపారంలో వృద్ధి నమోదవుతోందని తెలిపింది. అందుబాటు గృహాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పాలసీల వల్ల కంపెనీకి ఎక్కువ ప్రయోజనం కలుగనుందని పేర్కొంది. రియల్టీ పరిశ్రమలోని సంస్థాగత మార్పులు కంపెనీపై సానుకూల ప్రభావం చూపుతాయని తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. ప్రాజెక్టుల అమలులో జాప్యం, రెరా/ఎన్‌సీఎల్‌టీ కారణంగా స్వల్పకాలిక సవాళ్లు, హోమ్‌ బయర్స్‌ మార్కెట్‌ ట్రెండ్‌ మారడం, కన్సూమర్లు ఇన్వెస్ట్‌మెంట్‌ కోణంలో ప్రాపర్టీని కొనుగోలు చేస్తుండటం, పాత పాలసీల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడ వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది. కంపెనీ బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ సానుకూల అంశమని పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందని తెలిపింది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో రెవెన్యూ వృద్ధి 23 శాతంగా, పీఏటీ వృద్ధి 26 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 


కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1537599384HSL_Pick of the Week-Mahindra Lifespace Developers - (MLDL)_170918.pdf)

You may be interested

ఇలాంటప్పుడు డిఫెన్సివ్‌ స్టాకులతోనే రక్షణ!

Saturday 22nd September 2018

పతనం ఇస్తున్న సంకేతాలు గతంలో నిఫ్టీ పలుమార్లు భారీ పతనాలను చవిచూసిందని, అందువల్ల శుక్రవారం సడన్‌ పతనానికి కారణాలు అన్వేషించడం మాని తర్వాత ఏమి చేయాలో ఆలోచించుకోవాలని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పతనాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఇక మీదట పోర్టుఫోలియోలో డిఫెన్సివ్‌ స్టాక్స్‌ను పెంచువాలని ఈ అనూహ్య పతనం సంకేతాలు ఇస్తోందన్నారు. జీడీపీ నెంబర్లు ప్రకటించినప్పటినుంచి సూచీలు బలహీనంగా కొనసాగిస్తున్నాయి. ‘రూమర్లున్నప్పుడు కొనండి.. వార్తలను బట్టి అమ్మండి’’అనే

వారం కనిష్ట ధర వద్ద ముగిసిన పసిడి

Saturday 22nd September 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఈవారం చివరి రోజైన శుక్రవారం ‘‘వారం కనిష్ట ధర’’ వద్ద స్ధిరపడింది. బ్రెగ్జిట్‌ అందోళనలతో పాటు, వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలు బలపడటం ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి 10.30డాలర్ల నష్టపోయి 1201.30 డాలర్ల వద్ద ముగిసింది. బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే శుక్రవారం ‘‘బ్రిటన్‌ ఐరోపా కూటమి నుంచి వైదొలగే ప్రక్రియకు

Most from this category