News


డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌..

Saturday 20th October 2018
Markets_main1540029234.png-21323

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీసీబీ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: డీసీబీ బ్యాంక్‌
ఇండస్ట్రీ: బ్యాంక్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.157
టార్గెట్‌ ప్రైస్‌: రూ.209

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించిందని పేర్కొంది. మరీముఖ్యంగా రుణ నాణ్యత స్థిరంగా కొనసాగించిందని తెలిపింది. వ్యాపారం నిలకడగా ఉండటం, మొండి బకాయిల కేటాయింపులు తక్కువగా ఉండటం, ఎన్‌పీఏల రికవరీ, వ్యయ నియంత్రణ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. కాసా రేషియో తగ్గినప్పటికీ సేవింగ్స్‌ డిపాజిట్ల పెరుగుదల ఆకర్షిస్తోందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్లు అంచనా వేసినట్లే తగ్గాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పోటీ తగ్గడం, ఎంసీఎల్‌ఆర్‌ పెరుగుదల వల్ల ఇందులోనూ వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. రూ.209 టార్గెట్‌ ప్రైస్‌తో డీసీబీ బ్యాంక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

బ్యాంక్‌ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1540029243DCB_Bank_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌కు ‘బై’ రేటింగ్‌

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇండస్ట్రీ: హెల్త్‌కేర్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.718 టార్గెట్‌ ప్రైస్‌: రూ.879 ఆనంద్‌రాఠి.. ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. దేశీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రధానంగా జీవనశైలి సంబంధిత రుగ్మతల చికిత్సలకు అవసరమైన ప్రొడక్టుల తయారీపై

సైయంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ పాజిటివ్‌..

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా సైయంట్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: సైయంట్‌ రంగం: ఐటీ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.653 టార్గెట్‌ ప్రైస్‌: రూ.850 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. సైయంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) బలమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. రెవెన్యూ పరంగా కానీ, మార్జిన్‌ పరంగా కానీ

Most from this category