News


కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్చన్‌ లిమిటెడ్‌ షేరును అమ్మేయండి: జియోజిత్‌

Friday 23rd November 2018
Markets_main1542969748.png-22352

ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడంతో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షేరును వదిలించుకోవాలని రేటింగ్‌ సంస్థ జియోజిత్‌ సూచిస్తుంది. మౌలికసదుపాయల  నిర్మాణ రంగలో సేవలు అందిస్తున్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ షేరుపై జియోజిత్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
కేఎన్‌ఆర్‌ సంస్థ:- జాతీయ, అంతర్జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్ట్‌ వ్యాపారాలపై దృష్టి ఎక్కువగా పెడుతోంది. ఇప్పుటి వరకు 12 రాష్ట్రాల్లో రూ.6000 కోట్ల రోడ్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తిచేసింది.
1    ఆర్డర్లు దక్కకపోవడంతో పాటు, హెచ్‌ఏఎం ప్రాజెక్ట్స్‌లో నష్టాల కారణంగా రెండో త్రైమాసికంలో నికరఆదాయం 6శాతం మాత్రమే పెరిగింది.
2    ఏడాది ప్రాతిపదికన ఈబిటా మార్జిన్‌ 100 బేసిస్‌ పాయింట్లు నష్టపోయి 20శాతానికి పరిమైంది. ముడిచమురు ధరల పెరగడం, ఉద్యోగుల వేతనాల వ్యయాలు పెరగడం ఇందుకు కారణమైంది.
3    ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీకి ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా)నుంంచి ఎలాంటి ఆర్డర్లు దక్కకపోవడంతో కంపెనిక ప్రధాన ప్రతికూలాంశంగా మారింది.
4     దక్కించుకున్న ఆర్డర్ల ప్రారంభం ఆలస్యం కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది.
ఈ ప్రతికూలాంశాల నేపథ్యంలో కంపెనీ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్‌ నుంచి ‘‘సెల్‌’’ రేటింగ్‌కు సవరిస్తున్నామని జియోజిత్‌ తెలిపింది.
(కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్ షేరుపై జియోజిత్‌ సమగ్ర విశ్లేషణకు కొరకు కింది లింక్‌పై క్లిక్‌ చేయగలరు)

View Pdf One (15429698433212911122018408KNR Constructions Ltd Q2FY19 Update Rating Reduce.pdf)

You may be interested

జీఎస్టీలోకి త్వరలోనే ఎటీఎఫ్‌, సహజవాయువు!

Friday 23rd November 2018

జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులైన సహజవాయువు, విమనయాన ఇంధనం (ఏటీఎఫ్‌)ను తీసుకొచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించనుంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఏటీఎఫ్‌, సహజవాయువును జీఎస్టీలోకి తీసుకురావడం సులభమేనని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. జీఎస్టీ తదుపరి భేటీ ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదని, డిసెంబర్‌ నెల మధ్యలో ఉండొచ్చని చెప్పారు. ఈ రెండింటిపై పన్ను రేటు ఏదన్నది కూడా ఇంకా ఖరారు కాలేదన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూలైలోనే జీఎస్టీ

10,239 పాయింట్లను కోల్పోతే 10,000 వద్దకే..

Friday 23rd November 2018

ముంబై: వారాంతం ప్రకారం నిఫ్టీ 10,239 పాయింట్ల దిగువన ముగిసిందంటే.. అక్కడ నుంచి 9,900 – 9,700 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని భావించవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. అక్టోబరు 4న 10,754-10,843 స్థాయిలోని బేరిష్‌ గ్యాప్‌లోనికి ప్రవేశించినట్లు వివరించిన ఈయన.. నిజానికి ఈఏడాది ప్రారంభం నుంచే మార్కెట్‌ బేర్‌ పట్టులోనికి వెళ్లిపోయిందని చార్టుల

Most from this category