News


ఈ ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఆకర్షణీయం

Saturday 8th February 2020
Markets_main1581145924.png-31626

జాబితాలో డీమార్ట్‌, టాటా గ్లోబల్‌
డాబర్‌ ఇండియా, బాటా ఇండియా
జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌

గత వారాంతాన విడుదలైన కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజుల్లో రికవరీ సాధించాయని రితేష్‌ ఆషెర్‌, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌, కిఫ్స్‌ ట్రేడ్‌ కేపిటల్‌ పేర్కొన్నారు. ఇకపై మార్కెట్ల ట్రెండ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలతోపాటు.. ఎఫ్‌ంఎసీజీ రంగంపై బడ్జెట్‌ సానుకూల ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఇంకా పలు ఇతర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో రితేష్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం..

3 శాతం అప్‌
బడ్జెట్‌ రోజు పతనమైన మార్కెట్లు నాలుగు రోజుల్లోనే జోరందుకున్నాయి. ఈ వారం 3 శాతం లాభపడ్డాయి. ఇకపైనా ఈ సానుకూల ట్రెండ్‌ కొనసాగే వీలుంది. ఇందుకు ఒత్తిడిలో ఉన్న వివిధ రంగాలకు బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలు, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు వంటివి దోహదం‍ చేయవచ్చు. దీనికితోడు లి‍క్విడిటీ పెంపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న చర్యలు, గతేడాది ఆర్థిక శాఖ ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వంటి అంశాల ప్రభావాన్ని వేచి చూడవలసి ఉంది. గ్రామీణ వినియోగాన్ని పెంచడం, ఎంఎస్‌ఎంఈలకు దన్ను కోసం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు, బ్లూచిప్‌ కంపెనీల ఫలితాలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చే వీలుంది.

11,800 వద్ద మద్దతు
రానున్న వారంలో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీకి 11,800 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇదేవిధంగా 12,400 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురయ్యే వీలుంది. బ్యాంక్‌ నిఫ్టీకి 31000 స్థాయిలో సపోర్ట్‌, 31,600 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఈ వారం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం, తయారీ రంగ గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ గణాంకాలు కొంతమేర స్థూల ఆర్థిక పరిస్థితులను తెలియజేసే వీలుంది. కాగా.. ఇటీవల వెలుగులోకి వచ్చిన మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగనుంది. కనిష్టాల నుంచి చూస్తే..  ఇప్పటికే 40 శాతం వరకూ పుంజుకున్నప్పటికీ మరికొంత లాభపడేందుకు చోటుంది.

ఆ ఐదు స్టాక్స్‌..
ఇటీవల లాభాల బాటలో సాగుతున్న ఎఫ్‌ఎంసీజీ రంగం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతవల్ల ఈ రంగం లబ్ది పొందనుంది. ఇది రానున్న త్రైమాసికాల్లో బ్యాలన్స్‌షీట్లలో ప్రతిఫలించే వీలుంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలోని కంపెనీలు డీమార్ట్‌, జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, డాబర్‌ ఇండియా, బాటా ఇండియా ర్యాలీ చేస్తున్నాయి. మార్కెట్ల ట్రెండ్‌కు సంబంధంలేకుండా లాభపడుతూ వచ్చిన ఈ కౌంటర్లు ఇకపైన కూడా జోరు చూపేందుకు అవకాశముంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో నెలకొన్న డిమాండ్‌, ఫండమెంటల్స్‌, అమ్మకాల పరిమాణం రీత్యా ఈ కంపెనీలు ప్రత్యర్ధి సంస్థలకంటే మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. You may be interested

మహిళా సీఈఓల వేతనాలు తక్కువ!

Saturday 8th February 2020

   మహిళలు కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగినప్పటికీ స్త్రీ పురుషుల వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. పురుష సీఈఓల సగటు జీతాల కంటే మహిళా సీఈఓల సగటు జీతాలు 45 శాతం తక్కువగా ఉన్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. గత ఆర్థికసంవత్సరం 2018లో  22.5 శాతంగా ఉన్న పే గ్యాప్‌ రెట్టింపు అయ్యి 45 శాతానికి చేరిందని ప్రైమ్‌ డేటాబేస్‌ నంబర్స్‌ నివేదిక వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయిన  1,747

రూ.1100 కోట్లకు ఆధీకృత మూలధనం: యస్‌బ్యాంక్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం

Saturday 8th February 2020

ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బ్యాంక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యస్‌ బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. అలాగే ఈక్విటీ షేర్లు లేదా రూ .10,000 కోట్ల విలువైన కన్వర్టబుల్‌ సెక్యూరిటీల జారీ ద్వారా

Most from this category