News


డీమార్ట్‌, నెస్లే.. తగ్గితే కొనొచ్చు?!

Tuesday 11th February 2020
Markets_main1581414428.png-31695

సిగరెట్ల బిజినెస్‌ విడదీస్తే.. ఐటీసీ భేష్‌ 
స్టీల్‌ కంపెనీలపట్ల ఆసక్తి లేదు

- దేవంగ్‌ మెహతా, ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌, సెంట్రమ్‌ ఇండియా
ప్రపంచ మార్కెట్లు సరికొత్త రికార్డులను చేరుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొస్తున్నట్లు సెంట్రమ్‌ ఇండియా ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌ దేవంగ్‌ మెహతా పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)కు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో లార్జ్‌ క్యాప్స్‌తోపాటు.. మిడ్‌ క్యాప్‌ కౌంటర్లూ లాభపడనున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ముడిచమురు ధరలు తగ్గితే పలు రంగాలకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. దేవంగ్‌ వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాలను పరిశీలిద్దాం.. 

రిటైల్‌ ఆకర్షణీయం
నిజానికి చాలా కంపెనీలు ఇప్పటికే ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. యాజమాన్యాలు సైతం అంత హుషారుగా ఏమీ లేవు. అయితే మార్కెట్లు మాత్రం వినియోగ ఆధారిత రిటైల్‌ రంగంవైపు ఆకర్షితమవుతోంది. ఆర్గనైజ్‌డ్‌ రిటైల్‌ అమ్మకాలతోపాటు చిన్నస్థాయిలో వినియోగం పెరుగుతుండటం ఇందుకు కారణం. డీమార్ట్‌, నెస్లే వంటి ప్రత్యేక తరహా కంపెనీలు ప్రీమియం విలువతో ట్రేడవుతున్నాయి. వీటిని ఇతర కంపెనీలతో పోల్చి చూడలేం. ఈ కౌంటర్లు క్షీణించినప్పుడల్లా ఇన్వెస్ట్‌ చేస్తుంటాం. డీమార్ట్‌ మార్జిన్లు తక్కువే అయినప్పటికీ క్యాష్‌ కౌగా చెప్పవచ్చు. సొంత స్టోర్లకుతోడు, నగదు వెచ్చించడం ద్వారా సరఫరాదారుల నుంచి అధిక డిస్కౌంట్లలో సరుకులను కొని వినియోగదారులకు విక్రయిస్తోంది. తద్వారా ప్రత్యేక బిజినెస్‌ను సాధిస్తోంది. అంతేకాకుండా సొంత స్టోర్లను అధికంగా కలిగి ఉంది. దీంతో డీమార్ట్‌ అధిక ప్రీమియంలో ట్రేడవుతోంది. వృద్ధికి విఘాతం కలగనంతవరకూ ఈ విలువలు కొసాగుతాయి. వేల్యూ స్టాక్స్‌ విషయానికివస్తే.. అధిక రిస్కుల కారణంగా చాలా వరకూ వేల్యూ ట్రాప్స్‌గా పేర్కొనవచ్చు. 

ఐటీసీ ఎందుకంటే
ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీలలో చూస్తే దిగ్గజం ఐటీసీ 52 వారాల కనిష్టం వద్ద కదులుతోంది. సిగరెట్‌ బిజినెస్‌ రిస్కులను తగ్గించుకునే బాటలో కంపెనీ బిస్కట్లు, హోటళ్లు తదితర విభాగాలపై దృష్టి పెడుతోంది. అయితే ఈ విభాగాలలో ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించలేకపోతోంది. దీంతో ప్రతి బడ్జెట్‌లోనూ అదనపు పన్నుల బారినపడుతున్న సిగరెట్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయడాన్ని మార్కెట్లు ఆశిస్తుంటాయి. సిగరెట్ల బిజినెస్‌ విడదీస్తే ఐటీసీ సైతం ప్రీమియం విలువను సాధించగలుగుతుంది. ఇందువల్లనే హెచ్‌యూఎల్‌ విలువతో పోలిస్తే సగం పీఈలోనే ట్రేడువుతుంటుంది. 

స్టీల్‌ సంగతేంటి?
ముడిచమురు ధరలు తగ్గినప్పుడల్లా దిగుమతుల బిల్లు తగ్గుతుంది. రూపాయి బలపడుతుంటుంది. ప్రధానంగా పెయింట్లు, అధెసివ్‌ కంపెనీలు ఏషియన్‌, బెర్జర్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలు లాభపడేందుకు వీలుంటుంది. కాగా.. ఇటీవల మెటల్‌ షేర్లపై మార్కెట్‌ దృష్టి పడింది. అయితే సైక్లికల్స్‌లో సిమెంట్‌పై మాత్రమే ఆసక్తి చూపుతుంటాం. ప్రస్తుతం స్ట్రక్చరల్‌ స్టోరీ రెండుమూడేళ్లకే పరిమితంకావచ్చు. దీర్ఝకాలికంగా భావించడంలేదు. దీనికితోడు కరోనా వైరస్‌ తదితరాల కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మెటల్స్‌ పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా తోస్తోంది. సహజంగానే మెటల్స్‌ పట్ల మాకు అంత ఆసక్తిలేదు. పెట్టుబడుల కోసం సాధారణంగా ఇతర రంగాలను పరిశీలిస్తుంటాం. 
 You may be interested

టాప్‌ బిలియనీర్ల జాబితాలోకి అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత

Tuesday 11th February 2020

భారత్‌లో టాప్‌-10 బిలియనర్స్‌ జాబితాలో అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణన్‌ ధమానీ చోటు దక్కించుకున్నారు. గతవారంలో ఫిబ్రవరి5న కంపెనీ క్యూఐపీ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.2,049 వద్ద మొత్తం రూ.4వేల కోట్లను సమీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో సోమవారం షేరు 8.5శాతం పెరిగి రూ.2,484.15 వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల

ఫార్మా షేర్లపై ‘‘పాంచ్‌’’ పంచ్‌లు!

Tuesday 11th February 2020

దేశీయ ఫార్మా కంపెనీల షేర్లను ఐదు అంశాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1. యూఎస్‌ జనరిక్స్‌ వ్యాపారం: అమెరికాలో జనరిక్స్‌ వ్యాపారం ఇంకా ఇక్కట్ల నుంచి బయటకు రాలేదు. ఒకప్పుడు ఫార్మా కంపెనీలన్నీ జనరిక్స్‌ వ్యాపారంలో భారీగా లాభాలు పొందాయి. కానీ అక్కడ ఈ వ్యాపారంపై నియంత్రణా నిబంధనలు పెరగడంతో జనరిక్స్‌ మార్కెట్‌ దెబ్బతిన్నది. దీనికితోడు కొత్తగా పెద్ద ఉత్పత్తుల లాంచింగ్‌లు లేకపోవడం, ఆర్‌అండ్‌డీ వ్యయాలు తగ్గడం, అనుమతుల్లో జాప్యం,

Most from this category