News


ఎస్‌బీఐ లైఫ్‌... కొనొచ్చు

Monday 29th April 2019
Markets_main1556526635.png-25414

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.633
టార్గెట్‌ ధర: రూ.800

ఎందుకంటే:-  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ బీమా సంస్థ, ఎస్‌బీఐ లైఫ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రీమియమ్‌ ఆదాయం మంచి వృద్ధిని సాధిస్తోంది. న్యూ బిజినెస్‌ ప్రీమియమ్‌(ఎన్‌బీపీ-కొత్తగా జారీచేసిన పాలసీల ప్రీమియమ్‌) జోరుగా ఉండటం, రెన్యువల్స్‌ ఆదాయం 28 శాతం పెరగడంతో ప్రీమియమ్‌ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.11,380 కోట్లకు ఎగసింది.  వ్యక్తిగత, గ్రూప్‌ ప్రీమియమ్‌లు జోరుగా పెరుగుతున్నాయి.  ప్రొటెక్షన్‌ బిజినెస్‌పై ఈ కంపెనీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతంగా ఉన్న ఈ విభాగం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి పెరిగింది. ఈ వ్యాపారం మూడు రెట్లు పెరిగి రూ.600 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు 21 శాతం వృద్ధి చెంది రూ.1,41,020 కోట్లకు పెరిగాయి. పెట్టుబడులు ఆదాయం రూ.4,240 కోట్లకు పెరిగింది. కమిషన్‌, బీమా వ్యాపారానికి చెందిన నిర్వహణ వ్యయాలు 26 శాతం పెరిగాయి. నికర లాభం 21 శాతం పెరిగి రూ.460 కోట్లకు పెరిగింది. బ్యాంకఅష్యూరెన్స్‌ వ్యాపారం పుంజుకుంటోంది. విస్తృతమైన బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ కారణంగా రెండేళ్లలో న్యూ బిజినెస్‌ ప్రీమియమ్‌(ఎన్‌బీపీ) 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా. మార్జిన్‌ అధికంగా ఉండే ప్రొటెక్షన్‌ బిజినెస్‌ పెరుగుతుండటం, వ్యయ నియంత్రణ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త వ్యాపారం విలువ (వీఎన్‌బీ-వేల్యూ ఆఫ్‌ న్యూ బిజినెస్‌-సంస్థ జారీ చేసిన పాలసీల లాభదాయకత విలువ) 30 బేసిస్‌ పాయింట్లు పెరిగి 16.8 శాతానికి పెరుగుతుందని అంచనా. రెండేళ్లలో ఎంబెడెడ్‌ వేల్యూ(ఈవీ- భవిష్యత్తులో ఆర్జించే లాభాల ప్రస్తుత విలువ, సవరించిన నికర ఆస్తుల విలువ మొత్తం) 17 శాతం చక్రగతి వృద్ధితో రూ.30,585 కోట్లకు, కొత్త వ్యాపార విలువ (వీఎన్‌బీ) 25 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,743 కోట్లకు, రిటర్న్‌ ఆన్‌ ఈవీ 18 శాతానికి  పెరగగలవని భావిస్తున్నాం.  అందుకే టార్గెట్‌ ధరను రూ.800కు పెంచుతున్నాం. 



You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌...కొనొచ్చు

Monday 29th April 2019

బ్రోకరేజ్‌ సంస్థ:- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర:- రూ.760 టార్గెట్‌ ధర:- రూ.896 ఎందుకంటే: యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఫలితాలను వెలువరించింది. తాజా మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 2 శాతం తగ్గాయి. మొండి బకాయిల కేటాయింపులు 87 శాతం తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 2 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. మొత్తం రుణాల్లో దాదాపు సగంగా ఉన్న రిటైల్‌ రుణాలు 19

యస్‌ బ్యాంకు షేరుకు ఫలితాల షాక్‌ ..!?

Monday 29th April 2019

గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ప్రైవేట్‌రంగ దిగ్గజ కంపెనీ యస్‌బ్యాంక్‌ షేర్లు మంగళవారం 10శాతం మేర నష్టపోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన ఫలితాల ప్రకారం రూ.1506.64 కోట్ల నికర నష్టం నమోదయ్యింది. గతేడాది ఇదే మార్చి క్వార్టర్‌లో రూ.1,180 కోట్ల లాభాన్ని ఆర్జించడం విశేషం. తాజాగా ముగిసిన త్రైమాసికంలో మొండిబకాయిలపై కేటాయింపులు 9రెట్లు పెరగడం నష్టాలకు ప్రధాన కారణమని కంపెనీ

Most from this category