News


యాక్సిస్‌ బ్యాంక్‌...కొనొచ్చు

Monday 29th April 2019
Markets_main1556527095.png-25415

బ్రోకరేజ్‌ సంస్థ:- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర:- రూ.760
టార్గెట్‌ ధర:- రూ.896

ఎందుకంటే: యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఫలితాలను వెలువరించింది. తాజా మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 2 శాతం తగ్గాయి. మొండి బకాయిల కేటాయింపులు 87 శాతం తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 2 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. మొత్తం రుణాల్లో దాదాపు సగంగా ఉన్న రిటైల్‌ రుణాలు 19 శాతం వృద్ధి చెందాయి.  ఫీజు ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.3,000 కోట్లకు పెరిగింది. రుణ నాణ్యత మెరుగుపడింది. వివధ అంశాల్లో పనితీరు బావుంది.  వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు పెరుగుతున్నాయి. ఈ రిటైల్‌ రుణాల జోరు మరింతగా పుంజుకోనున్నది. బ్యాంక్‌ నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకున్న వ్యక్తుల్లో అత్యధికులు నెలవారీ వేతనాలు పొందేవారే కనుక, మొండి బకాయిలు పేరుకుపోయే సమస్య ఉండకపోవచ్చు. దీంతో రుణ నాణ్యత క్షీణించే అవకాశాలు లేవు. రిటైల్‌ డిపాజిట్లు పెంచుకోవడానికి ప్రత్యేకమైన రిటైల్ రుణ విభాగాన్ని ప్రారంభించింది. రిటైల్‌ రుణాలు బాగా పెరిగినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌)లో సీక్వెన్షియల్‌గా ఎలాంటి పురోగతి లేకుండా 3.44 శాతంగానే నమోదైంది.  ఉన్నత స్థాయిలో ఉద్యోగుల పునర్వ్యస్థీకరణ పూర్తి కావడం,  నిర్వహణ సామర్థ్యం పెరగడం, రెండేళ్లలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 18 శాతానికి చేరనుండటం సానుకూలాంశాలు. రెండేళ్లలో రుణాలు 17 శాతం, ఫీజు ఆదాయం 15 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో ప్రాధాన్యత బెట్‌గా యాక్సిస్‌ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం.You may be interested

ఈ నెల్లో పెద్ద ర్యాలీకి ఛాన్స్‌!

Monday 29th April 2019

ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌ గుప్తా ఐదేళ్ల క్రితం చూపిన ధోరణినే ప్రస్తుతం మార్కెట్లు రిపీటు చేస్తున్నాయని ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌ గుప్తా చెప్పారు. ఆ సమయంలో కూడా సూచీలు ఫ్రిబవరిలో ర్యాలీ ఆరంభించి మార్చిలో భారీ దూకుడు చూపాయి. అనంతరం ఏప్రిల్‌లో కన్సాలిడేషన్‌ చెంది, మేలో భారీగా లాభపడ్డాయి. ఇప్పుడు కూడా ఇంతవరకు అలాంటి ట్రెండ్‌నే సూచీలు చూపుతున్నాయని అమిత్‌ తెలిపారు. సాంకేతికంగా నిఫ్టీ స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోందన్నారు.

ఎస్‌బీఐ లైఫ్‌... కొనొచ్చు

Monday 29th April 2019

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.633 టార్గెట్‌ ధర: రూ.800 ఎందుకంటే:-  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ బీమా సంస్థ, ఎస్‌బీఐ లైఫ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రీమియమ్‌ ఆదాయం మంచి వృద్ధిని సాధిస్తోంది. న్యూ బిజినెస్‌ ప్రీమియమ్‌(ఎన్‌బీపీ-కొత్తగా జారీచేసిన పాలసీల ప్రీమియమ్‌) జోరుగా ఉండటం, రెన్యువల్స్‌ ఆదాయం 28 శాతం పెరగడంతో ప్రీమియమ్‌ ఆదాయం 23 శాతం వృద్ధితో

Most from this category