STOCKS

News


ఫార్మా షేర్లలో బుల్‌ ట్రెండ్‌ షురూ?!

Thursday 6th February 2020
Markets_main1580982915.png-31569

6-12 నెలల్లో ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ
30 శాతం రిటర్నులకు చాన్స్‌?
గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ అంచనా

గతేడాది(2019) మార్కెట్లలో దూకుడు చూపిన స్టాక్స్‌ ఈ ఏడాది(2020)లో వెనకసీట్లో కూర్చుంటాయని గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు గౌతమ్‌ షా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు దూకుడు చూపే వీలున్నట్లు చెబుతున్నారు. ఫార్మా రంగంలో బుల్‌ ట్రెండ్‌ ఇప్పుడే ప్రారంభమైనట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఆటో, రియల్టీ తదితర రంగాలపై  అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..  

బస్‌ మిస్సయ్యారా?
గత వారం మార్కెట్లలో కనిపించిన ట్రెండ్‌ కారణంగా ఇన్వెస్టర్లలో భయాల స్థానే.. బస్‌ మిస్సవుతున్నామన్న ఆలోచనలకు బీజం పడినట్లు కనిపిస్తోంది. ఇందుకు షార్ట్‌ కవరింగ్‌ కొంతకారణమైనప్పటికీ ర్యాలీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 800 పాయింట్లమేర దిద్దుబాటును చవిచూసి.. తిరిగి 12,000 పాయింట్లను అధిగమించింది. అంటే దేశీ మార్కెట్లు పతనాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ మార్కెట్లలో లార్జ్‌క్యాప్స్‌ ఇకపై పెద్దగా వృద్ధి చూపకపోవచ్చు. బడ్జెట్‌ ముగిసింది. విదేశీ మార్కెట్లలోనూ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. మార్కెట్ల రికవరీకి ప్రాముఖ్యత ఉంది. ఇకపై నిఫ్టీ 11800-12,400 స్థాయిలో కదలవచ్చు. 

మిడ్‌క్యాప్స్‌ జోరు
గత రెండేళ్లలోలేని విధంగా ఈ ఏడాది ఇప్పటికే మిడ్‌క్యాప్స్‌ నిలదొక్కుకుంటున్నాయి. ప్రతిసారీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది మొత్తం మార్కెట్లకు మంచి సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుత స్థాయిల నుంచి చూస్తే నిఫ్టీ 2-3 శాతం వరకూ పెరిగేందుకు చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2,000 పాయింట్లవరకూ పుంజుకునే వీలుంది. గత రెండేళ్ల ట్రెండ్‌కు విరుద్ధంగా ఈసారి మెటల్స్‌, ఆటో, ఫార్మా రంగాలు జోరు చూపవచ్చు. 

మెటల్‌, ఫార్మా మెరుపులు
గత రెండేళ్లలో మెటల్స్‌ 50 శాతం విలువను కోల్పోయాయి. తదుపరి గత ఆరు నెలలుగా కన్సాలిడేట్‌ అయ్యాయి. ఈ బేస్‌ మీద ఇటీవల 12-13 శాతం ర్యాలీ చేశాయి. రికవరీ కొనసాగుతుందని భావించవచ్చు. ఈ రంగంలో దీర్ఘకాలానికి టాప్‌-3 స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. ఇకపై మెటల్‌ ఇండెక్స్‌ 15 శాతం ర్యాలీ చేసే అవకాశముంది. మెటల్స్‌ బాటలోనే ఫార్మా ఇండెక్స్‌ సైతం 2015 తదుపరి 50 శాతం దిద్దుబాటును చవిచూసింది. ఇటీవల ఫార్మా రంగంలో పటిష్ట రికవరీ మొదలైంది. దీంతో ఫార్మా రంగంలో బుల్‌ ట్రెండ్‌ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. రానున్న 6-12 నెలల కాలంలో ఫార్మా రంగం 25-30 శాతం వరకూ ర్యాలీ చేయవచ్చని భావిస్తున్నాం. గతేడాది ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లు ఇకపై మందగించే అవకాశముంది.  

ఇండిగో..?
వినియోగ అంశాన్ని తీసుకుంటే పలు రంగాలు ప్రభావితం కావచ్చు. ఇండిగోను సైతం ఒక రకమైన వినియోగ స్టాక్‌గా పేర్కొనవచ్చు, దీర్ఘకాలంలో గ్యాస్‌ రంగానికీ అవకాశాలు పెరిగే వీలుంది. అయితే ఎఫ్‌ఎంసీజీలో పలు కౌంటర్లు అధిక పీఈలలో కదులుతుంటే..హెవీవెయిట్‌ ఐటీసీ 52 వారాల కనిష్టంవద్ద ఉంది. దీంతో థీమ్‌ ఆధారంగా కాకుండా సరైన స్టాక్స్‌ను ఎంచుకుంటే ఈ ఏడాది మంచి రిటర్నులకు అవకాశముంటుంది. గత మూడు నెలల ట్రెండ్‌ ఆధారంగా కొంతవరకూ స్టాక్స్‌ ఎంపికను చేపట్టవచ్చు. 

రియల్టీ..
గత కొన్నేళ్లుగా రియల్టీ రంగం ఊపందుకోవడం.. తిరిగి స్వల్ప కాలంలోనే ర్యాలీకి చెక్‌ పడటం జరుగుతోంది. గత రెండేళ్లలోలేని విధంగా ఇటీవల డీఎల్‌ఎఫ్‌ 50 శాతంవరకూ ఎగసింది. ఈసారి రియల్టీ రంగం‍లోని నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ కొనసాగవచ్చు. కాగా.. ఫార్మా రంగం బాటలోనే ఐటీ ఇండెక్స్‌ సైతం జోరందుకునే వీలుంది. వీటితోపాటు ఆయిల్‌, గ్యాస్‌ రంగంలోని కొన్ని కౌంటర్లకు అవకాశాలు లభించవచ్చు. ఈసారి బ్యాంకింగ్‌ మందగించనున్నట్లు భావిస్తున్నాం.
 You may be interested

మార్కెట్లకు బ్యాంక్స్‌, ఫార్మా దన్ను

Thursday 6th February 2020

నాలుగో రోజూ మార్కెట్లు ప్లస్‌ సెన్సెక్స్‌ 163 పాయింట్లు అప్‌ 49 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  ప్రపం‍చ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగా కదిలాయి. వెరసి వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పెరిగి 41,306 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 12,138 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు కొంతమేర ఒడిదొడుకులను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 41,405 వద్ద

రియల్టీ రంగానికి ఆర్‌బీఐ రిలీఫ్‌: హెచ్‌ఎఫ్‌సీ షేర్ల ర్యాలీ

Thursday 6th February 2020

నిర్మాణాలు వాస్తవంగానే ఆలస్యమైన కమర్షియల్‌ రియాల్టీ రుణాలను డౌన్‌గ్రేడ్ చేయబోమంటూ ఆర్‌బీఐ ప్రకటించడటంతో గురువారం రియాల్టీ కంపెనీల షేర్లతో పాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వాణిజ్య ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లు అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైనప్పటికీ.., మరో ఏడాది పాటు గడువు పొడిగించేందుకు ఆర్‌బీఐ తాజా పాలసీలో నిర్ణయించింది. అంతేకాకుండా ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను డౌన్‌గ్రేడ్‌ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల ప్రాజెక్ట్‌లకు కల్పించే సదుపాయాలకు వీటికీ

Most from this category