News


ఈ 16 షేర్లకూ బడ్జెట్‌.. భారం?!

Tuesday 4th February 2020
Markets_main1580808155.png-31502

రంగాల వారీ జాబితా ఇలా..
పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు
ఎరువులు, బీమా, రియల్టీ

బడ్జెట్‌లో తాజా ప్రతిపాదనల కారణంగా 16 స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాలు పడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని భావిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు, ఎరువులు, బీమా, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలు, కంపెనీలు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వినియోగాన్ని పెంచే చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే అంశాలలో బడ్జెట్‌ నిరాశపరచినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం..

ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై తాజా బడ్జెట్‌లో ఆర్థిక శాఖ జాతీయ విపత్తుల కంటింజెంట్‌ డ్యూటీ(ఎన్‌సీసీడీ)ని ప్రవేశపెట్టింది. దీంతో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఐటీసీ కౌంటర్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. పరిమాణరీత్యా 1000  సిగరెట్లపై రూ. 200-735 వరకూ ఎన్‌సీసీడీని విధించినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇక హుక్కా వంటి పైప్స్‌, సిగరెట్లపై 45-60 శాతం మధ్య ఎన్‌సీసీడీ వర్తించనుంది. నమిలే పొగాకు తదితర ఉత్పత్తులపైనా 10-25 శాతం మధ్య సుంకాలు అమలుకానున్నాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌పైనా ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని బ్రోకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.

టిటాగఢ్‌ వేగన్స్‌, టెక్స్‌మాకో
రైల్వే లైన్ల డబ్లింగ్‌, ట్రాక్‌ల మార్పిడి నెమ్మదించనుంది. వేగన్లు, కోచ్‌ల తయారీ 8-19 శాతం మధ్య మందగించవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రైల్వే పెట్టుబడులు 4 శాతం తగ్గనున్నట్లు తెలియజేసింది. కొత్త లైన్లు, రైల్వే భద్రత 20-45 శాతం మధ్య పుంజుకోనుండగా.. మిగిలిన అన్ని విభాగాలూ 10-18 శాతం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఇవి టిటాగఢ్‌ వేగన్స్‌, టెక్స్‌మాకో తదితర రైల్‌ కౌంటర్లకు ప్రతికూలమని చెబుతోంది.

హావెల్స్‌, యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వర్ల్‌పూల్‌
తాజా బడ్జెట్‌ కొన్ని కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ కౌంటర్లకు ప్రతికూలమని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీలో వినియోగించే కంప్రెషర్లపై దిగుమతి సుంకాలు 10-12.5 శాతం వరకూ పెరగనున్నాయి. ప్రధానంగా కంప్రెషర్లను అత్యధిక శాతం దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. దీంతో పరిశ్రమపరంగా చూస్తే.. వాణిజ్య ఫ్రీజర్లపై దిగుమతి వ్యయాలు 7.5-15 శాతం మధ్య పెరగనున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. వెరసి హావెల్స్‌ ఇండియా, యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వర్ల్‌పూల్‌ ఇండియాపై కొంతమేర ప్రతికూల ప్రభావం పడుతుం‍దని అంచనా వేసింది.

ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రు లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
బీమా రంగ కంపెనీలకూ తాజా బడ్జెట్‌ కొంతమేర ప్రతికూలంగా వెలువడినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. ఆదాయపన్ను శ్లాబులు, మినహాయింపులలో సవరణలు కొంతమేర బీమా, పొదుపు ప్రొడక్టులపట్ల స్వల్పంగా ఆసక్తి తగ్గవచ్చని ఇది ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రు లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లకు కొంతమేర ప్రతికూలమని పేర్కొంది. అయితే ఈక్విటీ, డెట్‌, రియల్టీ, కమోడిటీలతో పోలిస్తే బీమా ప్రొడక్టుల మెచూరిటీ విలువపై పన్ను లేకపోవడం సానుకూలమని తెలియజేసింది.

ఎంబసీ ఆర్‌ఈఐటీ
నిజానికి బడ్జెట్‌లో అందుబాటు ధరల గృహాలకు డిమాండ్‌ పెంచే చర్యలుంటాయని ఊహించినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వ్యాఖ్యానించింది. అయితే గృహ రుణాల వడ్డీ మినహాయింపులను రద్దు చేసే ఆదాయ పన్ను సవరణలను ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఇది ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంటును బలహీనపరుస్తుందని తెలియజేసింది. దీనికితోడు డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) కారణంగా ఆర్‌ఈఐటీలలో యూనిట్లు కలిగిన ఇన్వెస్టర్లకు పన్ను తదుపరి రిటర్నులు తగ్గే అవకాశముంది. ఫలితంగా ఆర్‌ఈఐటీలపట్ల ఆకర్షణ తగ్గవచ్చంటూ ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌  అభిప్రాయపడింది. 

చంబల్‌, దీపక్‌, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌
ఫైర్టిలైజర్స్‌ సబ్సిడీలలో తాజా బడ్జెట్‌ 11 శాతం కోతపెట్టింది. రూ. 71,300 కోట్లకు పరిమితం చేసింది. ఇదే సమయంలో ముడిసరుకుల ధరలు పెరిగితే వర్కింగ్‌ కేపిటల్‌ ఒత్తిళ్లు ఏర్పడవచ్చు. దీంతో చంబల్‌, దీపక్‌, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలకు ఇది కొంతమేర ప్రతికూలంగా పరిణమించవచ్చని షేర్‌ఖాన్‌ పేర్కొంది. 

ఐవోసీ, ఆర్‌ఐఎల్‌
శుద్ధ టెరిఫ్తాలిక్‌ యాసిడ్‌(పీటీఏ)పై యాంటీ డంపింగ్‌ డ్యూటీని ప్రభుత్వం ఉపసంహరించింది. ఇది ఐవోసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) వంటి ఇంధన రంగ కంపెనీలకు ప్రతికూలమని షేర్‌ఖాన్‌ పేర్కొంది. చౌక దిగుమతుల కారణంగా పీటీఏ ధరలు క్షీణించవచ్చని విశ్లేషించింది.
 You may be interested

సిమెంట్‌ షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌

Tuesday 4th February 2020

సరికొత్త గరిష్టానికి శ్రీ సిమెంట్‌ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి ప్రాధాన్యం బడ్జెట్‌లో సిమెంట్‌ రంగానికి ప్రత్యేకించి ఎలాంటి ప్రతిపాదనలూ లేనప్పటికీ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా శ్రీ సిమెంట్‌ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో అల్ట్రాటెక్‌సహా ఏసీసీ, అంబుజా సిమెంట్‌, జేకే తదితర సిమెంట్‌ కౌంటర్లు 2-5 శాతం మధ్య ఎగశాయి. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌ రంగాలకు బడ్జెట్‌లో

పెట్టుబడులు డిస్కౌంట్ల కోసం కాదు: అమెజాన్‌

Tuesday 4th February 2020

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చావు కబురును చల్లగా మెప్పింది. ఇటీవల భారత్‌లో పర్యటన సందర్భంగా సంస్థ సీవోఈ జెఫ్ బెజోస్ ప్రకటించిన రూ.7,100 కోట్లను పెట్టబడులను ధీర్ఘకాలిక అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని, డిస్కౌంట్ల లేదా నష్టాలను పూడ్చుకునేందుకు కాదని అమెజాన్‌ ఇండియా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 50 ప్రపంచ స్థాయిలో మల్టీ-మిలియన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను నిర్మాణం చేపట్టాల్సి అవసరం ఉందని అమెజాన్‌ ఇండియా విక్రయ సేవల విభాగపు అధిపతి

Most from this category