STOCKS

News


ఈ మిడ్‌ క్యాప్స్‌ మీ దగ్గరున్నాయా?!

Friday 7th February 2020
Markets_main1581052903.png-31591

బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు
బయ్‌, హోల్డ్‌, సెల్‌ రేటింగ్స్‌

జాబితాలో సౌత్‌ బ్యాంక్‌, బేయర్‌ క్రాప్‌
థెర్మాక్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, కేడిలా..

వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలోసాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్రేకవుట్‌ కావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు విభిన్న రంగాలకు చెందిన కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లపై అంచనాలను వెల్లడించాయి. వివరాలు చూద్దాం..

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ రంగ సంస్థ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లను తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయవచ్చని బ్రోకింగ్‌ సంస్థ ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంటోంది. రూ. 14 టార్గెట్‌ ధరను ప్రకటించింది. అయితే ఈ కౌంటర్‌లో పెట్టుబడులకు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేసింది. రుణ నాణ్యతలో స్థిరత్వం కనిపిస్తున్న కారణంగా సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ఏడాది కాలంలో బలపడే వీలున్నట్లు అభిప్రాయపడింది. శుక్రవారం ఉదయం 10 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో సౌత్‌ బ్యాంక్‌ షేరు 0.5 శాతం పుంజుకుని రూ. 10.15 వద్ద ట్రేడవుతోంది.

బేయర్‌ క్రాప్‌సైన్స్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించిన బేయర్‌ క్రాప్‌సైన్స్‌ కౌంటర్‌కు సెల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు రీసెర్చ్‌ సంస్థ కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. అయితే టార్గెట్‌ ధరను రూ. 2700 నుం‍చి రూ. 3000కు పెంచుతున్నట్లు తెలియజేసింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలను మించాయని తెలియజేసింది. ఆదాయం నామమాత్ర వృద్ధినే చూపినప్పటికీ మార్జిన్లు పుంజుకున్నట్లు వివరిం‍చింది. ఈ ఏడాది 9 నెలల కాలంలో మోన్‌శాంటో ఫలితాలతో కలసి పన్నుకు ముందు లాభం 5-7 శాతం బలపడినట్లు తెలియజేసింది. అయితే బేయర్‌ క్రాప్‌సైన్స్‌ షేరు వచ్చే ఏడాది ఈపీఎస్‌తో చూస్తే 37 రెట్లు అధికంగా(పీఈ) ట్రేడవుతున్నట్లు అంచనా వేసింది. దీంతో సెల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బేయర్‌ క్రాప్‌సైన్స్‌షేరు 0.6 శాతం లాభంతో రూ. 4526 వద్ద ట్రేడవుతోంది. 

థెర్మాక్స్‌​ లిమిటెడ్‌
ఇంజినీరింగ్‌ కంపెనీ థెర్మాక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌  పేర్కొంది. షేరు టార్గెట్‌ ధరను రూ. 1170 నుంచి రూ. 1200కు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించినట్లు తెలియజేసింది. గత ఆరు, ఏడు త్రైమాసికాలలో ఆర్డర్లను వేగంగా పూర్తిచేయడంతో కంపెనీ ఆర్డర్‌బుక్‌ క్షీణించినట్లు పేర్కొంది. ఇదే కాలంలో ఆర్డర్లకు సంబంధించి మందగమన వాతావరణం నెలకొన్నట్లు తెలియజేసింది. దీంతో ఆదాయం తగ్గే అవకాశమున్నదని, ఇది ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలలో వ్యక్తమైనట్లు వివరించింది. ఆరు త్రైమాసికాల తదుపరి ఆదాయం వెనకడుగు వేసినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో థెర్మాక్స్‌ షేరు దాదాపు 1 శాతం నష్టంతో రూ. 1048 వద్ద ట్రేడవుతోంది. 

బెర్జర్‌ పెయింట్స్‌
రీసెర్చ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రయివేట్‌ రంగ దిగ్గజం బెర్జర్‌ పెయింట్స్‌ ఇండియా కౌంటర్‌పై హోల్డ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. షేరు టార్గెట్‌ ధరను రూ. 480 నుంచి రూ. 560కు పెంచింది. వార్షిక ప్రాతిపదికన బెర్జర్‌ పెయిం‍ట్స్‌ ఆదాయం 13 శాతం, నికర లాభం దాదాపు 28 శాతం చొప్పున పుంజుకోగలవని అంచనా వేసింది. 2022కల్లా ఆర్‌వోఈ 26 శాతాన్ని అధిగమించగలదని అభిప్రాయపడింది. గతేడాది 21.4 శాతం ఆర్‌వోఈ నమోదైంది. అయితే ప్రస్తుత మార్కెట్‌ ధర రీత్యా షేరు విలువ పెరిగేందుకు అవకాశాలు తక్కువేనని అంచనా వేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బెర్జర్‌ పెయింట్స్‌ షేరు 0.3 శాతం బలపడి రూ. 576 వద్ద ట్రేడవుతోంది.

కేడిలా హెల్త్‌కేర్‌ 
ఫార్మా రంగ కంపెనీ కేడిలా హెల్త్‌కేర్‌కు రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. టార్గెట్‌ ధరను రూ. 310 నుంచి రూ. 330కు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కేడిలా హెల్త్‌కేర్‌ పటిష్ట ఫలితాలు సాధించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్జన అంచనాలను 2-10 శాతంమేర పెంచుతున్నట్లు తెలియజేసింది. ఇండియా, యూఎస్‌లో పటిష్ట అమ్మకాలు సాధిస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది అంచనాలతో చూస్తే కంపెనీ షేరు ఆకర్షణీయ పీఈ(18 రెట్లు)లో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. ఇక 2022 అంచనాలతో చూస్తే.. 15 పీఈలో లభిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం కేడిలా హెల్త్‌కేర్‌ షేరు 0.6 శాతం పుంజుకుని రూ. 275 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఎస్‌బీఐ వడ్డీ రేట్ల కోత

Friday 7th February 2020

రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు తాజా రేట్లు ఈ నెల 10 నుంచీ అమలు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల ప్రభావం ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) తాజాగా వడ్డీ రేట్లలో కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 10(సోమవారం) నుంచీ అమలు చేయనున్నుట్లు ఎస్‌బీఐ పేర్కొంది. తాజా సవరణలో భాగంగా రుణాలకు వర్తించే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను 5 బేసిస్‌ పాయింట్లమేర తగ్గించింది. దీంతో

నేటి వార్తల్లోని షేర్లు

Friday 7th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు యస్‌ బ్యాంక్‌:  ప్రవేటు రంగ రుణదాత యస్‌బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో ఈజీఎంను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో అధీకృత మూలధనాన్ని రూ.800 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచడం, మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ క్లాజ్‌ -5లో సవరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఐడీఎఫ్‌సీ: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఐడీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.342.67 కోట్లుగా నమోదైందని ఐడీఎఫ్‌సీ తెలిపింది. కాగా క్రితం ఆర్థిక

Most from this category