News


నెమ్మదిగా కొనసాగుతున్న రేట్‌కట్‌ బదిలీ

Saturday 8th June 2019
Markets_main1559987934.png-26178

ఆర్‌బీఐ ప్రకటిస్తున్న వడ్డీరేట్ల తగ్గింపు బ్యాంకుల ద్వారా కస్టమర్లకు చాలా నెమ్మదిగా చేరుతోందని కోటక​ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. ఆర్‌బీఐ ఆశించినంత వేగంగా రేట్‌కట్‌ బదిలీ జరగడం లేదని పేర్కొంది. అయితే నెమ్మదిగానైనా రేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీ అవుతున్నందున ఈ ఏడాది కస్టమర్లకు అందే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపింది.  ఆర్‌బీఐ గణాంకాలు పరిశీలిస్తే టర్మ్‌ డిపాజిట్‌ రేట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2017 నవంబర్‌ 2018 మార్చి మధ్యలో ఈ రేట్లు 20 బీపీఎస్‌ మేర పెరిగాయి. అప్పటి నుంచి సెప్టెంబర్‌ వరకు ఫ్లాట్‌గా కొనసాగాయి. ఆ తర్వాత కొంత పెరుగుదల కనిపించి ప్రస్తుతం ఫ్లాట్‌గా ఉన్నాయి. లెండింగ్‌ రేట్లు క్రమంగా తగ్గుతూవస్తున్నాయి. చాలా బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను మార్చి- మే మధ్య కాలంలో తగ్గించాయి. ప్రస్తుతం ఉన్న రుణాలపై రేటుకు కొత్త రుణాలపై రేటుకు మధ్య వ్యత్యాసం 65 బీపీఎస్‌ వద్ద కొనసాగుతోంది. లిక్విడిటీ పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రేట్ల తగ్గింపును టర్మ్‌ డిపాజిట్‌ రేట్లలో అమలు చేయడం బ్యాంకులకు సవాలుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారమయితే రేట్ల తగ్గింపు మరింత వేగంగా కస్టమర్లకు చేరనుంది.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

View Pdf One (1559987961[Kotak] Banks, June 6, 2019.pdf)

You may be interested

ఎంటర్‌ప్రెన్యూర్లకు జెఫ్‌బెజోస్‌ సలహాలు

Saturday 8th June 2019

కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్నవారికి ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ రెండు సలహాలు ఇస్తున్నారు. కస్టమర్‌ను మర్చిపోవద్దని, అపజయాలకు కుంగిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకోవాలని ఆయన చెబుతున్నారు. అమెజాన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారవేత్తకు కస్టమర్‌ పట్ల ఎక్కువ ధ్యాస ఉండడమే చాలా ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. కస్లమర్లను సంపూర్ణంగా ఎలా సంతృప్తి పరచాలో తెలుసుకోవాలని సూచించారు. అమెజాన్‌ తన కస్టమర్లను నిలుపుకోవడానికి చాల ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఒక్కోసారి ఉత్పత్తిపై నష్టం

ఎస్‌జీఎక్స్‌నిఫ్టీ 57 పాయింట్లు అప్‌

Saturday 8th June 2019

ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. సింగపూర్‌లో నిన్న రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు అరశాతం (57 పాయింట్లు) లాభంతో ముగిసింది. నిఫ్టీ -50 ఫ్యూచర్స్‌ ముగింపు(11900.75)తో పోలిస్తే 57 పాయింట్లు పెరిగి 11,956.00 వద్ద స్ధిరపడింది. శుక్రవారం దేశీయంగా సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరికి స్వల్ప లాభంతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 39,616 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి

Most from this category