News


ఈ రెండు షేర్లను కొనొచ్చు!

Wednesday 26th February 2020
Markets_main1582702488.png-32105

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను తాకడంతో ఈ వారంలో బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల బాట పట్టాయి. బుధవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకదశలో సెన్సెక్‌ 39వేల మార్కును నిఫ్టీ 12వేల మార్కును కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు మెహుల్‌ కొఠారీ స్వల్పకాలానికి(3నుంచి 4వారాలు) మూడు స్టాక్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో ఎస్కార్ట్స్‌ ఫ్యూచర్స్‌ అమ్మేయని సూచిస్తూ... ఐటీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లను కొనమని సిఫార్సు చేస్తున్నారు. వాటి పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం...

షేరు పేరు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ. 92
స్టాప్‌ లాస్‌: రూ.77
అప్‌సైడ్‌: 12 శాతం
విశ్లేషణ: గతేడాదిలో ఈ షేరు రూ.80ల కీలక నిరోధస్థాయిని ఛేధించి రూ.192లకు చేరుకుంది. అక్కడి నుంచి పతనమైన మరోసారి రూ.80ల స్థాయిని అధిగమించి రూ.222 స్థాయిని అందుకుంది. ఇప్పుడు మరోసారి రూ.222 నుంచి పతనమై మళ్లీ రూ.80 స్థాయికి పతనమైంది. షేరుకు గడిచిన పదేళ్ల నుంచి రూ.80లు డిమాండ్‌ స్థాయిగా ఉంది. చరిత్రలో పరిగణలోకి తీసుకొని రూ.82ల వద్ద కొనుగోలు చేయమని మెహుల్‌ కొఠారీ  సలహానిస్తున్నారు. 

షేరు పేరు: ఐటీసీ
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.220
స్టాప్‌లాస్‌: రూ.198
అప్‌సైట్‌: 6శాతం
విశ్లేషణ: ఐటీసీ షేరు 2018 సెప్టెంబర్‌ నుంచి కరెక్షన్‌ మోడ్‌లో ఉంది. రూ.317 గరిష్టస్థాయి నుంచి షేరు దాదాపు 36శాతం కరెక్షన్‌ లోనైంది. ఇటీవల షేరు రూ.200ల వద్ద కీలకమైన సపోర్ట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ స్థాయి వద్ద షేరు బౌన్స్‌ అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంది. షేరు ధర రూ.205 వద్దకు పతనమైనపుడు కొనుగోలు చేయవచ్చని మెహుల్‌ కొఠారీ సూచిస్తున్నారు. 

షేరు పేరు: ఎస్కార్ట్స్‌ ఫ్యూచర్స్‌
రేటింగ్‌: అమ్మవచ్చు
టార్గెట్‌ ధర: రూ.830
స్టాప్‌ లాస్‌: రూ.920
డౌన్‌సైడ్‌: 6శాతం
విశ్లేషణ: ఈ ఏడాది ప్రారంభం నుంచి షేరు కనిష్టస్థాయి రూ.600 నుంచి ఏకంగా 50శాతం ర్యాలీ చేసి రూ.900 స్థాయికి చేరుకుంది. డైలీ ఛార్ట్‌లో పరిశీలిస్తే షేరు ఓవర్‌బాటమ్‌ జోన్‌లో ప్రవేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షేరు గతేడాది ఆగస్టులో రూ.423 నష్టం నుంచి ఏర్పడిన బేరిష్‌  ఏబీ=సీడీ ప్యాట్రన్‌ పొటెన్షియల్‌ రివల్స్‌ జోన్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది. డైలీ ఛార్జ్‌లోని ఆర్‌ఎస్‌ఐ ఓస్కిలేటర్లు నవంబర్‌ 2019 తర్వాత ప్రతికూల క్రాస్‌ఓవర్‌ను నిర్థారించాయి. ఈ పరిణామాలు ప్రాఫిట్‌ బుకింగ్‌ సంకేతాల్ని సూచిస్తున్నాయి. మెహుల్‌ కొఠారీ ఈ స్టాక్‌ ను రూ.890 వద్ద విక్రయించాలని సూచిస్తున్నారు. You may be interested

రాబోయేది ఎఫ్‌ఎంసీజీ రాజ్యమే!

Wednesday 26th February 2020

తర్వాతి బుల్‌రన్‌లో ఈ రంగమే ఛాంపియన్‌ అంటున్న నిపుణులు వాల్యూ ఇన్వెస్టర్లలో ఎక్కువమందికి కన్జూమర్‌ స్టాకులపై మక్కువ ఎక్కువ. అటు బెంజిమన్‌ గ్రాహమ్‌ నుంచి ఇటు పీటర్‌ లించ్‌ వరకు అనేకమంది కన్జూమర్‌ షేర్లను ఇష్టపడ్డవారే! ఇవి ఎలాంటి ఒడిదుడకులనైనా తట్టుకుంటాయని, భారీ రుణభారాలుండవని, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్స్‌ ఉండవని నిపుణులు అంచనా వేస్తుంటారు. కానీ ఎక్కువశాతం ఈ స్టాకులు ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడేఉంటుంటాయి. కానీ ఈ ట్రెండ్‌ రివర్సవుతోందని

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 26th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు సిప్లా: సిప్లాకు చెందిన గోవా ఫెసిలిటీ కేంద్రానికి యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖను రాసింది. బంధన్‌ బ్యాంక్‌: ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ ప్రాంతాల్లో బంధన్‌ బ్యాంక్‌ శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ 3–5 డాలర్ల డిస్కౌంట్‌తో 500 మిలియన్‌ బేరల్స్‌ క్రూడ్‌ను కొనుగోలు చేసింది. వొకార్డ్‌: ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వొకార్డ్‌కు లాంగ్‌ టర్మ్‌ రేటింగ్‌ బీబీ ఫ్లస్‌ను

Most from this category