News


ఇండియన్‌ బ్యాంక్‌ కొనొచ్చు..

Tuesday 20th November 2018
Markets_main1542701053.png-22225

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఇండియన్‌ బ్యాంక్‌
రేటింగ్‌ కొనొచ్చు
‍ప్రస్తుత ధర: రూ.229
టార్గెట్‌ ప్రైస్‌: రూ.335

ఆనంద్‌రాఠి.. ఇండియన్‌ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.335గా నిర్ణయించింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బలహీనమైన ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. నిర్వహణ పనితీరు ఆకట్టుకోలేకపోయిందని తెలిపింది. ఎఐఐ వృద్ధి తక్కువగా ఉందని పేర్కొంది. క్రెడిట్‌ వ్యయాలు ఎక్కువగా ఉండటం, వడ్డీ చెల్లింపులు, ట్రెజరీ ఆదాయం తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది. అయితే పీఎస్‌యూ బ్యాంకుల్లో కెల్లా ఇండియన్‌ బ్యాంక్‌ బుక్‌పై ఒత్తిడి తక్కువగా ఉందని పేర్కొంది. ఆరోగ్యకరమైన క్యాపిటలైజేషన్‌, క్రెడిట్‌-డిపాజిట్‌ రేషియో పటిష్టంగా ఉండటం వంటివి సానుకూల అంశాలని తెలిపింది. క్రెడిట్‌ మార్కెట్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ వాటా పెరగొచ్చని అంచనా వేసింది. షేరు చూడటానికి ఆకర్షణీయంగా ఉందని, కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

ఇండియన్‌ బ్యాంక్‌ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542701067INBK_CU_121118.pdf)

You may be interested

యస్‌ బ్యాంక్‌ మళ్లీ డౌన్‌

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ:- యస్‌ బ్యాంకు షేర్ల లాభాలు ఒక్కరోజే పరిమితం అయ్యాయి. బోర్డు నుంచి మరో సభ్యుడి నిష్క్రమణతో మంగళవారం ఆ బ్యాంకు షేర్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. రాణా కపూర్‌ వారసడి వెతికే ప్రక్రియను బోర్డు వేగవంతం చేసిందనే వార్తల నేపథ్యంలో సోమవారం 7శాతం లాభపడిన సంగతి తెలిసిందే.  వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర్య డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్‌ సోమవారం రాజీనామా చేసినట్లు సంస్థ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు తెలిపింది. నాన్‌

క్యాపిటల్‌ నిబంధనల సడలింపుతో బ్యాంకులకు చేటు!!

Tuesday 20th November 2018

రిజర్వు బ్యాంక్‌ తాజాగా బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనలను అమలు చేసేందుకు, అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరింత సమయం ఇవ్వడమనే నిర్ణయం ‍ప్రభుత్వ బ్యాంకులకు క్రెడిట్‌ నెగటివ్‌ చర్య అని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం సోమవారం ఇరు వర్గాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ అనంతరం.. ఇండియన్‌ బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ

Most from this category