News


గ్రామీణ దన్ను: ఈ 10 స్టాక్స్‌కు జోష్‌?

Wednesday 12th February 2020
Markets_main1581491288.png-31725

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల ప్రభావం
జాబితాలో అగ్రికెమికల్స్‌, ట్రాక్టర్స్‌ కంపెనీలు
ఫుట్‌వేర్‌, ఎఫ్‌ఎంసీజీ, మైక్రో ఫైనాన్స్‌కూ చోటు

పలు సానుకూల చర్యలతో బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేపట్టినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు వంటి అంశాలున్నట్లు ప్రస్తావిస్తున్నారు. తగ్గుతున్న వ్యవసాయ ఆదాయం, గ్రామీణ డిమాండ్‌ మందగించడం వంటి ప్రతికూల పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ. 1.3 లక్షల కోట్లను వ్యవసాయం, రైతు సంక్షేమానికి కేటాయించింది. గ్రామీణ పథకాలపై వ్యయాలను 11 శాతంమేర పెంచింది. కాగా.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కారణంగా పెరిగిన రబీ దిగుబడి, వ్యవసాయోత్పత్తులకు తగిన ధరలు వంటి పరిస్థితులు గ్రామ ప్రాంతాలలో డిమాండ్‌కు దోహదం చేయనున్నట్లు బ్రోకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. బడ్జెట్‌ ఇచ్చిన ప్రోత్సాహానికితోడు.. రబీ దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు తదితర అంశాలు గ్రామీణ వినియోగ ఆధారిత రంగాలు, కంపెనీలపై భవిష్యత్‌లో సానుకూల ప్రభావం చూపనున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా బ్రోకింగ్‌ వర్గాలు గ్రామీణ వినియోగ రీత్యా లబ్ది పొందగల 10 కంపెనీల స్టాక్స్‌ను కొనుగోలుకి సూచిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

- ఆదిత్య జవహర్‌, అగ్రి రీసెర్చ్‌, ఇన్వెస్టెక్‌ ఇండియా
ర్యాలీస్‌ ఇండియా: 
అగ్రి కెమికల్స్‌ విభాగంలో ర్యాలీస్‌ ఇండియాను పరిశీలించవచ్చు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఆదాయం 28 శాతం వృద్ధి చెందింది. దేశీ వాటా 54 శాతంకాగా.. ఎగుమతుల నుంచి 46 శాతం ఆదాయాన్ని సాధించింది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే.. కంపెనీ అనుసరిస్తున్న తాజా వ్యూహాలు మెరుగైన పనితీరు ప్రదర్శించేందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల(నెల రోజుల్లో) ర్యాలీస్‌ ఇండియా షేరు 30 శాతం ర్యాలీ చేసింది. అయితే రానున్న రెండేళ్ల కాలంలో ఆర్జన(ఈపీఎస్‌) సగటున 21 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. 

- గౌరవ్‌ దువా, కేపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌
అగ్రి కెమికల్‌ కంపెనీలు: 
వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 2,83,000 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది(2020-21)కి రూ. 15 లక్షల కోట్ల అగ్రిక్రెడిట్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల(ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్స్‌) వినియోగాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీనిలో భాగంగా కెమికల్‌ ఫెర్టిలైజర్స్‌ వినియోగాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ఈ అంశాల కారణంగా ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా, పీఐ ఇండస్ట్రీస్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అతుల్‌ లిమిటెడ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ లాభపడే వీలుంది. 

బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్‌: 
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఫుట్‌వేర్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 25 శాతం నుంచి 35 శాతానికి పెంచింది. దీంతో దేశీయంగా అత్యధిక విక్రయాలు సాధిస్తున్న బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్‌ ప్రొడక్టులకు డిమాండ్‌ పెరిగే అవకాశముంది. 
డాబర్‌ ఇండియా: 
ఈ ఆర్థిక సంవత్సరం​క్యూ3లో డాబర్‌ ఇండియా పటిష్ట నిర్వహణ సామర్థ్యాన్ని చూపింది. అమ్మకాల పరిమాణం నిలకడను చూపగా.. పలు కీలక విభాగాలలో మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. డిమాండ్‌ మందగమనంలోనూ స్థిరమైన వృద్ధిని చూపుతోంది. ఈ కౌంటర్‌ సైతం బడ్జెట్‌తో లబ్ది పొందే వీలుంది. 

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌: 
గ్రామీణ ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టడం ద్వారా కార్యకలాపాలు నిర్వహించే స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ దేశంలోని పలుప్రాంతాలలో విస్తరించింది. తద్వారా ఈ ఎన్‌బీఎఫ్‌సీ- మైక్రోఫైనాన్స్‌ కంపెనీ 17 రాష్ట్రాలలో ఫైనాన్షియల్‌ బిజినెస్‌ నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, తక్కువ ఆదాయంగల కుటుంబాలకు జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌(జేఎల్‌జీ) విధానంలో రుణాలివ్వడం ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. గత రెండేళ్లలో కంపెనీ పటిష్ట పనితీరును చూపింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 85 శాతం పెరిగాయి. నెట్‌వర్త్‌ 43 శాతం బలపడింది. కొన్నేళ్లుగా నిధుల సమీకరణ, పెట్టుబడులను సమకూర్చుకుంటూనే రుణాల నాణ్యతను సైతం నిలుపుకుంటూ వస్తోంది. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఈ కంపెనీకి మేలు చేయగలవు.

- రస్మిక్‌ ఓజా, ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌
ఎస్కార్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కాల్గేట్‌ పామోలివ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌: 
వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 2,83,000 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది(2020-21)కి రూ. 15 లక్షల కోట్ల అగ్రిక్రెడిట్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగం పుంజుకుంటే.. ట్రాక్టర్ల విక్రయ దిగ్గజాలు ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం లబ్ది పొందే వీలుంది. ఇదే విధంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో కాల్గేట్‌ పామోలివ్‌ అధిక అమ్మకాలను సాధించనుంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీలలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌కు అవకాశాలు పెరగనున్నాయి. 

- దీపక్‌ జసానీ, రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: 
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి రూ. 2,83,000 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది(2020-21)కి రూ. 15 లక్షల కోట్ల అగ్రిక్రెడిట్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి విత్తనాలు, ఎరువులు, ఆగ్రో కెమికల్‌ కంపెనీలకు మేలు చేకూర్చనున్నాయి. రబీ పంటలు, వర్షపాత విస్తరణ, ఖరీప్‌ దిగుబడి తదితర సానుకూల అంశాల కారణంగా కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ పుంజుకునే అవకాశముంది.You may be interested

52 వారాల గరిష్టానికి 48 షేర్లు

Wednesday 12th February 2020

బుధవారం 48 షేర్లు 52 వారాల గరిష్టానికి పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అఫెల్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఆల్బర్ట్‌ డేవిడ్‌, ఆర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌,అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌, అతుల్‌, బాలకృష్ణా ఇండస్ట్రీస్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, డాబర్‌ ఇండియా, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎఫ్‌డీసీ, జీఎంఎం

కొనసాగుతున్న యస్‌బ్యాంక్‌ షేరు పతనం

Wednesday 12th February 2020

యస్‌ బ్యాంక్‌ షేరు వరుసగా మూడో రోజూ నష్టాన్ని చవిచూసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.36.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలతో డిపాజిట్‌దారులు యస్‌ బ్యాంకు నుంచి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు గణాంకాలు వెలువడ్డాయి. దీంతో  షేరు ఈ వారం ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో షేరు ఏకంగా 9శాతం నష్టాన్ని చవిచూసింది.

Most from this category