News


71.20-71.80 శ్రేణిలో రూపీ

Thursday 17th October 2019
Markets_main1571286047.png-28942

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం 5 పైసలు బలపడి 71.38 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో రూపీ డాలర్‌ మారకంలో కనిష్ఠ స్థాయి నుంచి 11 పైసలు బలపడి 71.43 వద్ద ముగిసింది. రూపీ-డాలర్‌ జంటకు గరిష్ఠ స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఐసీఐసీఐ బ్రోకరేజి తెలిపిం‍ది. ఈయూ(యురోపియన్‌ యూనియన్‌), బ్రిటన్‌కు మధ్య చివరి క్షణంలోనైనా ఒప్పందం కుదురుతుందనే అంచనాలుండడంతో జీబీపీ(గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌), యూరో బలపడ్డాయి. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ గత సెషన్‌లో స్వల్ప నష్టంలో ముగిసింది. ఈయూ-యూకే మధ్య ఒప్పంద కుదిరితే పౌండ్‌ మరింత బలపడే అవకాశం ఉంది.
    ఈ వారం చివరిలో బ్రెక్సిట్‌ సమ్మిట్‌ జరగనుండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించే అవకాశం ఉందని, ఫలితంగా రూపీ కొంత పరిధిలో కదలాడనుందని విశ్లేషకులు తెలిపారు.  ‘దేశీయంగా ఆర్‌బీఐ మీటింగ్‌ మినిట్స్‌ శుక్రవారం వెలువడనున్నాయి. తదుపరి ఆర్‌బీఐ సమావేశంలో రేట్ల కోత ఉంటుందనే అంచనాలుండడంతో రూపీ ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది’ అని ఫారెక్స్‌ అండ్‌ బుల్లియన్‌ ఎనలిస్ట్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ గౌరంగ్‌ సోమయా అన్నారు.  వచ్చే రెండు మూడు సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.20, 71.80 పరిధిలో ట్రేడవుతుందని అంచనావేశారు. 

 



You may be interested

భారీగా పెరిగిన యుఎస్‌ నిల్వలు..నష్టాల్లో చమురు

Thursday 17th October 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు మరింత పెరిగాయి. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.59 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.67 శాతం నష్టపోయి బారెల్‌ 59.02 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.79 శాతం నష్టపోయి బారెల్‌ 52.94 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్‌ 11తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు 10.5

ఫోన్‌తోనూ ఎన్‌ఎఫ్‌సీ చెల్లింపులు: ఎస్‌బీఐ కార్డ్‌

Thursday 17th October 2019

న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్‌) టెర్మినల్స్‌లో మొబైల్ ఫోన్ ద్వారా సులభతరంగా చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎస్‌బీఐ కార్డ్ అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగించే ఈ విధానంలో.. పీవోఎస్‌ మెషీన్‌పై మొబైల్ ఫోన్‌ను ఒకసారి తాకిస్తే చాలు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వెంట ఉండక్కర్లేదని, పిన్‌ నంబరు బాదరబందీ ఉండదని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి

Most from this category