News


సెప్టెంబర్‌ చివరి నాటికి 74 స్థాయికి రూపాయి ..?

Friday 30th August 2019
Markets_main1567157181.png-28115

అమెరికా చైనా మధ్య నిరంతరం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం, డాలర్‌ మారకంలో యువాన్‌ కరెన్సీ క్షీణత తదితర కారణాలతో ఈ సెప్టెంబర్‌ నాటికి రూపాయి విలువ 74స్థాయికి చేరుకుంటుందని వకార్ జావేద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  గతేడాది అక్టోబర్‌, డిసెంబర్‌  మధ్య కాలంలో రూపాయి దాదాపు 4శాతం బలపడింది. ఇదే కాలంలో అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు చల్లారడటంతో దేశీయ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 25శాతం క్షీణించగా, డిసెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.11శాతంగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రెండ్‌ రివర్స్‌ అయ్యింది. జనవరి నుంచి ఆగస్ట్‌ చివరి నాటికి రూపాయి 3శాతం బలహీనపడింది. 

 


డాలర్‌ ర్యాలీ:- అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే పసిడితో పాటు ఈ మధ్యకాలంలో ఫలితంగా డాలర్ల నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ 2019లో భారీ ర్యాలీ చేస్తుంది. ఈ ఆగస్ట్‌లో 98.25 స్థాయిని అందుకుంది. 
ఆగని విదేశీ పెట్టుబడుల ఉపంసహరణ:- ఈ ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.12,105 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇదే ఆగస్ట్‌లో క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రూ.2,940 కోట్లు వచ్చాయి. బేరీష్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అవసరాన్ని ఇది సూచిస్తుంది.
ఆర్‌బీఐ కోత విధానం:- ఆర్బీఐ విధించుకున్న ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యం 4 శాతం కన్నా తక్కువగా నమోదు కావడంతో ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారి రెపో రేట్ల కోత విధించింది. ఈ ఏడాదిలో  వడ్డీరేట్లపై ఇప్పటికే 3సార్లు 25 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది. దానికి కొనసాగింపుగా ఆగస్ట్‌లో మరోసారి 35బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో రెపో రేటు 5.4శాతానికి దిగివచ్చింది. ప్రైవేటు వినియోగ వృద్ధి రేటులో నిరంతర నియంత్రణతో పాటు పెట్టుబడి కార్యకలాపాలు మందగించడంపై విధాన నిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో వడ్డీ రేట్లు బేరిష్ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. 
ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధానం:- 2018లో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను నాలుగుసార్లు పెంచింది. 2019లో జరిగిన ఎఫ్‌ఓఎంసీ సమావేశాల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపునకు ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే 2019 జూలైలో జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో 25 బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్ల కోత విధించారు. తరువాత సమావేశంలో మాట్లాడుతూ ఫెడ్ భవిష్యత్ రేటు తగ్గింపుల ఆశలను రేకెత్తిస్తూ రేటు తగ్గింపును మధ్యంతర చక్రీయ సర్దుబాటు పేర్కొన్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమైతే ఫెడ్‌ వడ్డీరేట్లకు సముఖంగా ఉంటుందని ప్రకటించడంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్ల కోతపై ఆశలను సజీవంగా ఉంచారు. పరస్పర సుంకాల విధింపు కారణంగా అటు అమెరికా, ఇటు చైనాల దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను నెమ్మదిగా తగ్గించడానికి యుఎస్ ఫెడ్ చేసిన ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించలేదు. వడ్డీరేట్ల తగ్గింపు నెమ్మదిగా ఉందని, వ్యవస్థకు ద్రవ్యకొరత తీర్చడంలో ఫెడ్‌ రిజర్వ్‌ విఫలమైందని ట్రంప్‌ పావెల్‌ను విమర్శిస్తున్నారు.    

నెమ్మదించిన భారత ఆర్థికవ్యవస్థ:- గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 5.7శాతంగా నమోదు కావచ్చు. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటును 6.2శాతానికి తగ్గించింది. అలాగే ఇండియా రేటింగ్స్‌ సంస్థ కూడా 0.6శాతం డౌన్‌గ్రేడ్‌ చేసి 6.7శాతానికి సవరించింది.

ట్రేడ్‌వార్‌:- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జూన్‌ నుంచి చైనాకు చెందిన 200బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై టారీఫ్‌లను 10 నుంచి 25 శాతానికి పెంచారు. ఇప్పుడు అదనంగా,  అమెరికా మరోసారి 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై 10శాతం అదనపు పన్నును విధించింది. ఈ పన్నులను రెండు దశల్లో అమలు చేస్తామని అమెరికా చివరికి సుంకాల విధింపును ఆలస్యం చేసింది. సుంకాలను ప్రతీకారంగా.., చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ అమెరికాకు చెందిన 75బిలియన్‌ డాలర్ల దిగుమతలపై 5శాతం, 10శాతం పన్నులను విధిస్తామని ప్రకటించింది. You may be interested

2008 రిపీటా? ఛాన్సేలేదు..

Friday 30th August 2019

ఎకానమీ చాలా బలపడింది మాంద్యాన్ని తట్టుకునే శక్తి ఉంది నిపుణుల అంచనా లాంగ్‌టర్మ్‌ పోర్టుఫోలియోలు నిర్మించుకోవాలని సూచన వీలయినంత తొందరలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందని దాదాపు ఇన్వెస్టర్లంతా మానసికంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల పుణ్యమాని ఆరంభమైన మాంద్య భయాలు నానాటికీ విస్తరించాయి. దీంతో పలు మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మన ఈక్విటీలు సైతం ఇటీవలి కాలంలో బాగా నష్టాలు చవిచూశాయి. చాలా మంచి పోర్టుఫోలియోలు సైతం నెగిటివ్‌లోకి మారాయి. ఈ నేపథ్యంలో

బలమైన ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా ఆర్‌బీఐ నిఘానేత్రం

Friday 30th August 2019

బ్యాంకింగేతర వ్యవస్థను బలపరిచేందుకు కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీలను కూడా ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తన పర్యవేక్షణలోకి తీసుకురానుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు(నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు), వాణిజ్య బ్యాంకులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆర్‌బీఐ ఇకపై నిశితంగా పరిశీలించనుంది. ఇందులో శ్రీరామ్‌ గ్రూప్‌కు చెందిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ వంటి దిగ్గజాలున్నాయి. కాగా ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో 85 శాతం ఆస్తులు వీటి కిందనే ఉండగా, బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాల మొత్తం ఆస్తులలో 12 శాతం

Most from this category