News


40 పైసలు బలహీనపడిన రూపీ

Thursday 1st August 2019
Markets_main1564634779.png-27461

 రేట్ల కోత కోత మరింతగా ఉండదనే సంకేతాన్ని ఫెడ్‌ ఇవ్వడంతో డాలర్‌ రెండేళ్లలో గరిష్ఠంగా బలపడింది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో 40 పైసలు బలహీనపడి 69.20 వద్ద గురువారం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉండడంతో పాటు, యుఎస్‌ ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. కానీ మరింతగా రేట్ల కోత ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 68.80 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ 69.05 నుంచి 69.50 మధ్య కదలాడే అవకాశం ఉందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజీ తెలిపింది. 



You may be interested

పసిడికి ఫెడ్‌ రేట్ల కోత కష్టాలు

Thursday 1st August 2019

2వారాల కనిష్టానికి పసిడి ధర మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఫెడ్‌ వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు 2వారాల కనిష్టానికి పతనమయ్యాయి. నిన్నరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు 11 ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించింది. తాజా తగ్గింపుతో ఫెడ్‌ రేటు 2.25-2శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ మందగమన ఆందోళనలు, యూఎస్‌ ద్రవ్యోల్బణం నీరసించిన నేపథ్యంలో వడ్డీరేట్లపై కోత విధింస్తున్న ఫెడ్‌

పదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడ్‌

Thursday 1st August 2019

దశాబ్దకాలం తర్వాత యుఎస్‌ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, యుఎస్‌ ద్య్రవ్యోల్బణం తగ్గడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఫెడ్‌ తెలిపింది. కానీ మరింత రేట్ల కోత ఉండదనే సంకేతాన్ని ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ భయాలు, తగ్గుతున్న యుఎస్‌ ద్రవ్యోల్బణం దృష్ఠ్యా 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తన తాజా రెండు రోజుల

Most from this category