News


పతనం నుంచి కోలుకుంటున్న రూపీ

Tuesday 6th August 2019
Markets_main1565064226.png-27558

రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 7 పైసలు బలహీనపడి 70.80 వద్ద ప్రారంభమయినప్పటికి, దేశియ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో తిరిగి పుంజుకొంటుంది. ఉదయం 9.45 సమయానికి రూపీ 26 పైసలు బలపడి 70.54 వద్ద ట్రేడవుతోంది. గత ఆరేళ్లలో ఒకే రోజు అత్యధికంగా రూపీ, గత సెషన్లో(అగష్టు 5) 113 పైసలు బలహీనపడి 70.73 వద్ద ముగిసింది. అంతర్జాతీయ వాణిజ్య భయాలు, దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడం, చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించడం, కశ్మీరీ ఇష్యు వలన గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో భారీగా పడిపోయింది. దీంతో రూపీ గత మూడు సెషన్ల నుంచి పతనమయినట్టయ్యింది. మొత్తంగా ఈ మూడు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో ఏకంగా 194 పైసాలను కోల్పోవడం గమనర్హం. ‘యుఎస్-చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్‌ వార్‌, కశ్మీర్లో రాజకీయ అసమతుల్యత వలన రూపీ డాలర్‌ మారకంలో 11 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో తన 200 ఎస్‌ఎంఏ 70.20 స్థాయిని కొల్పోయింది’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.
‘ఈ రోజు ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 70.20 పైన ముగిస్తే, రూపీ ఈ నెల చివరి నాటికి 71.30 స్థాయికి చేరుకోవచ్చు. రూపీ కి దిగువన 69.85 వద్ద మద్ధతు లభించనుంది. అన్నిటి కన్నా ఈ వారం ఆర్‌బిఐ ఇంకో 25 బేసిస్‌ పాయింట్ల రేట్ల కోత విధిస్తే, రూపీ ప్రభావం అయ్యే అవకాశం ఉంది’ అని వివరించారు. 

 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌:- మూడీస్‌ రేటింగ్‌ సంస్థ రెండు నెలల్లోనే రెండుసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ‍స్తుల నాణ్యత తగ్గడం, షాడో బ్యాంకులకు భారీగా రుణాలిచ్చి ఉండటంతో బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్‌ వెల్లడించింది. గతంలో బ్యాంక్‌కు కేటాయించిన ధీర్ఘకాలిక కరెన్సీ ఇష్యూకు ‘‘బీఎ1’’ రేటింగ్‌ను కొనసాగించే రేటింగ్‌ను పరిశీస్తున్నట్లు తెలిపింది.  బ్రిక్స్‌వర్క్స్‌ రేటింగ్‌ లోయర్‌ టైర్‌

నష్టాల ప్రారంభం....నిముషాల్లో లాభాల్లోకి

Tuesday 6th August 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యద్ధం....కరెన్సీ యుద్ధంగా పరిణమించడం, కశ్మీర్‌ను విభజించడం వంటి అంతర్జాతీయ, దేశీయ అంశాల నడుమ భారీ పతనాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు మంగళవారం సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో 36,568 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల క్షీణతతో 10,815 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ఆసియా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుంటున్ననేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం మార్కెట్‌ ప్రారంభమైన

Most from this category