News


బలపడిన రూపీ..70.80 వద్ద ప్రారంభం

Thursday 8th August 2019
Markets_main1565236311.png-27617

రూపీ డాలర్‌ మారకంలో గురువారం 9 పైసలు బలపడి 70.80 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. దీంతో వరుసగా ఐదు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో విలువను కొల్పోయినట్టయింది. మొత్తంగా ఈ ఐదు సెషన్‌లను కలిపి రూపీ డాలర్‌ మారకంలో 210 పైసలు బలహీనపడడం గమనర్హం. 
 



You may be interested

హెచ్చుతగ్గుల ప్రారంభం

Thursday 8th August 2019

తీవ్ర ఒడుదుడుకుల మధ్య గురువారంనాటి ట్రేడింగ్‌ ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభఃతో 36,808 పాయింట్ల వద్ద మొదలైన కొద్ది నిముషాల్లోనే లాభాలన్నింటినీ కోల్పోయింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 10,900 పాయింట్ల వద్ద మొదలైన తర్వాత 10,855 పాయింట్ల వద్దకు పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో భారతి ఎయిర్‌టెల్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య పెరగ్గా,

రేట్ల కోతతో ఈ స్టాక్స్‌కు అనుకూలం...!

Wednesday 7th August 2019

ఆర్‌బీఐ వరుసగా నాలుగో విడత బుధవారం కీలక రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 35 బేసిస్‌ సాయింట్లను తగ్గించడం వల్ల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గి ఆర్థిక రంగం పునరుత్తేజం చెందుతుందని శామ్కో సెక్యూరిటీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జిమీత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. రేట్ల తగ్గింపు రుణాలపై ఆధారపడిన కంపెనీలకు, అదే సమయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగానికీ ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో

Most from this category