మోదీ విజయ బాటలో ‘రూపాయి’
By Sakshi

ముంబై: కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం ‘రూపాయి’ సెంటిమెంట్‌నూ బలపరిచింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 49 పైసలు లాభపడి 69.53 వద్ద ముగిసింది. మోదీ ఘన విజయం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ రూపాయిని బలోపేతం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం మొత్తంలో రూపాయి 70 పైసలు లాభపడింది. దేశీయంగా మోదీ విజయావకాశాలపై సానుకూల అంచనాలు, దేశంలోని విదేశీ నిధులు, క్రూడ్ ఆయిల్ ధరల స్థిరత్వం, ఆసియా కరెన్సీల పటిష్టత వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. గురువారం రూపాయి ముగింఉ 70.02. శుక్రవారం ప్రారంభంలోనే 69.75 వద్ద ట్రేడింగ్ మొదలైంది. రోజంతా 69.81 - 69.50 శ్రేణిలో తిరిగింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా ఎన్నికల ఫలితాలు తక్షణం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా.
You may be interested
కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం
Saturday 25th May 2019ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి మందగమనానికి అడ్డుకట్ట వేయాలి బ్యాంకుల మొండి బాకీల కష్టాలు తీర్చాలి ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు ఉండాలి ఆర్థికవేత్తల అభిప్రాయం న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే
భారత్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్
Saturday 25th May 2019బుల్లిష్ రికమండేషన్లు చేస్తున్న దిగ్గజాలు బీజేపీ ఘన విజయం పట్ల అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్‌లు హర్షం వ్యక్తం చేశాయి. కొత్త ప్రభుత్వం బ్యాంకుల, హౌఽసింగ్, రూరల్ ఎకానమీ, యుటిలిటీస్రంగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చని భావిస్తున్నాయి. స్వల్పకాలానికి వాల్యూషన్లు, ట్రేడ్‌వార్ ఈక్విటీ పరుగులకు రిస్కుగా మారవచ్చని అభిప్రాయపడుతున్నాయి. కానీ దీర్ఘకాలానికి భారత ఈక్విటీలు పరుగులు ఆగవని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ బ్రోకరేజ్‌లు బుల్లిష్ రికమండేషన్లు అందిస్తున్నాయి. బ్రోకరేజ్‌లు సూచిస్తున్న షేర్లు... బ్రోకరేజ్‌ల