News


రూపాయికి 54 పైసల నష్టం

Saturday 3rd August 2019
Markets_main1564807468.png-27513

  • 69.60కు చేరిక
  • డాలర్లకు మళ్లీ డిమాండ్‌

ముంబై: చమురు ధరల పెరుగుదల, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోందన్న ఆందోళనలు, తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూపాయిపైనా గణనీయమైన ప్రభావం చూపించాయి. డాలర్లకు డిమాండ్‌ ఏర్పడడంతో శుక్రవారం డాలర్‌తో రూపాయి 54 పైసలు నష్టపోయి రూ.69.60కు చేరింది. రూపాయితోపాటు వర్ధమాన కరెన్సీలపైనా ఈ ప్రభావం పడింది. చైనాకు చెందిన 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మరోసారి ప్రకటించడం గమనార్హం. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 69.26 వద్ద మొదలైన రూపాయి ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.69.67 కనిష్ట స్థాయిని నమోదు చేసి చివరకు 69.60 వద్ద క్లోజయింది. రూపాయికి వరుసగా ఇది రెండో రోజు నష్టం. గురు, శుక్రవారాల్లో మొత్తం మీద డాలర్‌తో 81 పైసలు నష్టపోయింది. వారం మొత్తంమీద నికర నష్టం 71 పైసలు. ‘‘అమెరికా అధ్యక్షుడు 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్టు ప్రకటించడం అంతర్జాతీయంగా ఈక్విటీల్లో అమ్మకాలకు దారితీసింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే శర్మ తెలిపారు.



You may be interested

ఐటీసీ లాభం రూ.3,437 కోట్లు

Saturday 3rd August 2019

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.3,049 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,437 కోట్లకు పెరిగిందని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,746 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,532 ‍కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.7,668 కోట్ల నుంచి రూ.8,114 కోట్లకు చేరాయని వివరించింది.  డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ,

ఏడో ర్యాంకుకు పడిపోయిన భారత్‌

Saturday 3rd August 2019

ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల విడుదల భారత్‌ కంటే ముందుకెళ్లిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ 2017లో ఆరో స్థానం న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్‌ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్‌ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్‌ డాలర్లు), జపాన్‌ (4.9 ట్రిలియన్‌

Most from this category