News


17 నెలల కనిష్టానికి రూపాయి

Tuesday 10th March 2020
Markets_main1583812360.png-32378

  • 30 పైసలు క్షీణత
  • 74.17 వద్ద క్లోజింగ్
  • కరోనాతో మందగమన భయాలు కారణం

ముంబై: కరోనావైరస్‌ ప్రభావంతో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో దేశీ కరెన్సీ సోమవారం ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 30 పైసలు తగ్గి 74.17 వద్ద క్లోజయ్యింది. చమురు ధరలు భారీగా పతనం కావడం కూడా ఇందుకు దారి తీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. సోమవారం ఇంటర్‌బ్యా్ంక్‌ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ క్రితం ముగింపు 73.87తో పోలిస్తే కొంత బలహీనంగా .. 73.99 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత గరిష్టంగా 73.85, కనిష్టంగా 74.17 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 30 పైసల నష్టంతో 74.14 వద్ద క్లోజయ్యింది. "ఎకానమీపై కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాల నుంచి హెడ్జింగ్‌ కోసం ఇన్వెస్టర్లు బాండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రూపాయి క్షీణించింది" అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్టు (ఫారెక్స్, బులియన్ విభాగం) గౌరంగ్ సోమయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం 73.80-74.20 శ్రేణిలో ప్రతికూల ధోరణిలోనే రూపాయి ట్రేడింగ్ జరగవచ్చని ఆయన చెప్పారు. 



You may be interested

దివీస్‌ వైజాగ్‌ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం

Tuesday 10th March 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్‌ ల్యాబొరేటరీస్‌.. విశాఖపట్నంలోని డీసీవీ-సెజ్‌ యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయని తెలిపింది. భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామం వద్ద ఈ యూనిట్‌ నెలకొంది. కాగా, సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.60 శాతం తగ్గి రూ.2,182 వద్ద స్థిరపడింది. 

మరోసారి భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత

Tuesday 10th March 2020

2020లో 5.3 శాతంగా ఉంటుందని అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2020 సంవత్సరానికి గతంలో వేసిన 5.4 శాతం నుంచి 5.3 శాతానికి మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సవరించింది. కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో వినియోగ డిమాండ్‌ క్షీణిస్తుందన్న అంచనాలతో ఈ నిర్ణయానికి వచ్చింది. మార్చి నెలకు సంబంధించి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తన అంచనాలను మూడీస్‌ తాజాగా విడుదల చేసింది. చైనా వెలుపల కరోనా వైరస్‌ వేగంగా

Most from this category