News


రూపాయి.. మూడు నెలల కనిష్టం!

Tuesday 25th February 2020
news_main1582599462.png-32057

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 34 పైసలు పడిపోయింది. 71.98 వద్ద ముగిసింది. గడచిన మూడు నెలల్లో ఈ స్థాయికి (నవంబర్‌ 13 తర్వాత) రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీల భారీ పతనం, విదేశీ మార్కెట్లలో అమెరికా కరెన్సీకి డిమాండ్‌ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణంగా ఉన్నాయి. 71.94 వద్ద ప్రారంభమైన రూపాయి ఒకదశలో 72.01ని కూడా చూసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, ఈక్విటీల పతనం, డాలర్‌, బంగారం వంటి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడుల తరలింపు వంటి అంశాల నేపథ్యంలో రూపాయి మరింత బలహీనమయ్యే వీలుందని అంచనా.    2018 అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. నిజానికి అంతర్జాతీయ క్రూడ్‌ ధరల పతనం రూపాయి విలువకు సానుకూలం కావాల్సి ఉంది. అయితే చైనా కరోనా వైరస్‌ ప్రభావం మొత్తంగా ప్రపంచ వృద్ధిపై పడుతుందన్న భయాలు, ఈక్విటీ మార్కెట్ల బలహీనత సంబంధిత అంశాలు రూపాయి తాజా పతనానికి కారణం అవుతుండడం గమనార్హం. 



You may be interested

గెయిల్‌ రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు

Tuesday 25th February 2020

విస్తరణ పనుల కోసం  వెల్లడించిన కొత్త సీఎమ్‌డీ  న్యూఢిల్లీ: గెయిల్‌ ఇండియా కంపెనీ విస్తరణ కార్యకలాపాల నిమిత్తం ఐదేళ్లలో రూ.1.05 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ, నగరాల్లో గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ ఏర్పాటు,  పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు... వీటి కోసం ఈ పెట్టుబడులు పెట్టనున్నామని గెయిల్‌కు సీఎమ్‌డీగా నియమితులైన మనోజ్‌ జైన్‌ పేర్కొన్నారు. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ కోసం రూ.45,000-50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని తెలిపారు. సీటీ

మెరిసిన బంగారం

Tuesday 25th February 2020

అంతర్జాతీయంగా 1,700 డాలర్లకు చేరిక దేశీయంగానూ పరుగే  రూ.1000 వరకూ లాభం కరోనా భయాలు ప్రధాన కారణం రూపాయి పతనమూ కారణమే! ముంబై: చైనాలో మొదలై ప్రపంచ దేశాలను విస్తరిస్తూ పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం,  ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి

Most from this category