News


రూపాయికి టారిఫ్‌ల సెగ!

Tuesday 12th November 2019
Markets_main1573530277.png-29520

  • 19 పైసలు క్షీణించి 71.47 వద్ద ముగింపు

ముంబై: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలపై తాజాగా నెలకొన్న అనుమానాలు భారత్‌ కరెన్సీపై ప్రభావం చూపాయి. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 71.47 వద్ద ముగిసింది. అక్టోబర్‌ 15 తర్వాత రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ భారత్‌ అవుట్‌లుక్‌కు కోత పెట్టడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ట్రేడింగ్‌ ఒకదశలో రూపాయి 71.54 స్థాయినీ చూసింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో  రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.  చమురు ధర పెరుగుదల భయాలు  కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. 



You may be interested

బీమా పండటం లేదు

Tuesday 12th November 2019

దూరమవుతున్న బీమా కంపెనీలు ప్రకృతి విపత్తులతో భారీ నష్టాలు రీఇన్సూరెన్స్‌ చార్జీలు అధికం తప్పుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్‌, చోళమండలం న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్‌ ఇన్సూరెన్స్‌) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండడం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద

నేడు మార్కెట్‌కు సెలవు

Tuesday 12th November 2019

గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు.     

Most from this category