News


క్రూడ్‌, డాలర్‌ డౌన్‌.. రూపీ అప్‌..

Wednesday 26th December 2018
Markets_main1545798665.png-23232

ఇండియన్‌ రూపాయి బుధవారం లాభాలతో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.88 వద్ద ఆరంభమైంది. రూపాయి సోమవారం ముగింపు స్థాయి 70.13గా ఉంది. కాగా మంగళవారం క్రిస్మస్‌ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు. 

క్రూడ్‌ ధరలు పతనం కావడం మన కరెన్సీకి కలిసొచ్చింది. అలాగే అమెరికాలో రాజకీయ అస్థిరతల వల్ల డాలర్‌పై ఒత్తిడి నెలకొంది. దీంతో రూపాయికి బలం చేకూరింది. క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 55 డాలర్ల దిగువునే ట్రేడ్‌ అయితే.. రూపాయి సెంటిమెంట్‌ బలపడుతుందని ఒక ఫారెక్స్‌ డీలర్‌ తెలిపారు. అమెరికా డాలర్‌ ఇతర మార్కెట్ల కరెన్సీలతో పోలిస్తే బలహీన పడిందని, ఇది కూడా రూపాయికి సానుకూల అంశమని పేర్కొన్నారు.

ఇక భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.235 వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.287గా ఉంది. బాండ్‌ ఈల్డ్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4 శాతం మేర లాభపడింది. ఇదే సమయంలో రూపాయి 8.5 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.46 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.91 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 

ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మలేసియా రింగిట్‌ 0.12 శాతం, థాయ్‌ బట్‌ 0.1 శాతం, దక్షిణ కొరియా ఒన్‌, 0.07 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.07 శాతం పెరిగాయి. ఇండోనేసియా రుపియా 0.35 శాతం, జపాన్‌ యెన్‌ 0.14 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.03 శాతం నష్టపోయాయి. 

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.581తో పోలిస్తే 0.02 శాతం క్షీణతతో 96.557 వద్ద ట్రేడవుతోంది. 
 



You may be interested

త్వరలో కొత్త రూ.20 నోటు విడుదల

Wednesday 26th December 2018

న్యూఢిల్లీ: అదనపు ఫీచర్లతో కూడిన కొత్త 20 రూపాయిల నోట్లను ఆర్‌బీఐ త్వరలోనే వ్యవస్థలోకి తీసుకురానుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ అప్పటి వరకు వ్యవస్థలో లేని రూ.2,000, రూ.200 నోట్లతోపాటు, కొత్త రూపంలో రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ సిరీస్‌ కింద వీటిని 2016 నవంబర్‌ తర్వాత తీసుకొచ్చింది. పాత నోట్లతో పోలిస్తే ఇవి రూపంలోనూ, సైజులోనూ భిన్నంగా ఉన్న

10,600 దిగువకు నిఫ్టీ

Wednesday 26th December 2018

సెన్సెక్స్‌ 280 పాయింట్లు డౌన్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,663 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,470 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల నష్టంతో 35,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచేకొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 280 పాయింట్ల

Most from this category