మరింత బలపడిన రూపీ
By Sakshi

డాలర్ మారకంలో రూపీ బలపడి మంగళవారం(జూన్ 25) ట్రేడింగ్లో 69.32 వద్ద ప్రారంభమైంది. డాలర్ ఇతర మేజర్ కరెన్సీలతో పోల్చుకుంటే బలహీనపడడంతో రూపీ గత సెషన్లో 23 పైసలు బలపడి 69.35 ముగిసింది. ఫెడ్ వడ్డి రేట్ల కోత ఉంటుందనే నేపథ్యంలో డాలర్ బలహీనంగా ఉంది. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ వడ్డి రేట్లను తగ్గించాలని బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం కూడా డాలర్ బలహీన పడడానికి కారణం. ఈరోజు రూపీ డాలర్ మారకంలో 69.05 నుంచి 69.70 పరిధిలో ట్రేడవ్వవచ్చని మోతిలాల్ ఉస్వాల్ అన్నారు.
You may be interested
స్థిరంగా చమురు
Tuesday 25th June 2019అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వాతవరణం చమురు ధరల పెరుగుదలకు సహకరించిన క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గుదల ఒత్తిడి కారణంగా మంగళవారం(జూన్ 25) చమురు ధరలు స్థిరంగా ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.5 శాతం పెరిగి బ్యారెల్కు 64.89 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్ 0.8శాతం నష్టపోయి 57.87 డాలర్ల వద్ద ముగిశాయి. అమెరికా తయారి రంగం మందగించిందని ఫలితంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గిందని
నెగిటివ్ ఓపెనింగ్
Tuesday 25th June 2019ప్రతికూల ఆసియా సంకేతాల నేపథ్యంలో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు నెగిటివ్గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల నష్టంతో 39,084 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11,681 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఆసియా డౌన్.... ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీపింగ్లు వాణిజ్య చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆసియా స్టాక్ సూచీలు క్షీణించాయి. చైనా షాంఘై సూచి 2 శాతంపైగా