News


31 పైసలు బలహీనపడిన రూపీ

Friday 21st June 2019
Markets_main1561089945.png-26457

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం(జూన్‌ 21) 31పైసలు బలహీనపడి 69.75వద్ధ ప్రారంభమైం‍ది. దేశియ కారణాలు కాకుండా అంతర్జాతీయ కారణాల వలన రూపీ బలహీన పడింది. వచ్చే వారంలో జరగనున్న జీ20 సమావేశంలో యూఎస్‌-చైనా దేశాల మధ్య చర్చలపై పెట్టుబడిదారులు దృష్ఠి సారించనున్నారు.ఫెడ్‌ వడ్డి రేట్లను యదాతథంగా కొనసాగించినప్పటికి భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు​ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం, దేశియ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గురువారం రూపీ  24పైసలు బలపడి రూ.69.44 వద్ద ముగిసింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్‌ వడ్డి రేట్ల తగ్గింపుకు సిద్దపడడంతో ఈ నిర్ణయం జులై నెలలో జరిగే సమావేశంలో జరగవచ్చని మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. ఈ రోజు ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపీ 69.20 నుంచి 69.90 పరిధిలో కదలాడొచ్చాని మోతిలాల్‌ తెలిపారు. 
 



You may be interested

పెరిగిన చమురు ధరలు..

Friday 21st June 2019

పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతలే కారణం కొన్నిసెషన్లుగా అప్‌మూవ్‌లో ఉన్న చమురు ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. ఫెడ్‌ వడ్డిరేట్ల తగ్గింపు భవిష్యత్‌లో ఉంటుందనే సంకేతాలివ్వడంతో పాటు అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిందనే వార్తల నేపథ్యం, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో పెరిగిన అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరిగాయి. శుక్రవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.84డాలర్ల వద్ద , డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.6 శాతం పెరిగి

సెన్సెక్స్‌ 100పాయింట్ల నష్టంతో ప్రారంభం

Friday 21st June 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 నష్టంతో 39551 వద్ద, నిఫ్టీ 10 పాయిం‍ట్లు క్షీణించి 11821 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రితం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా లాభపడిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నారు.  కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ అధ్యక్షతన నేడు 35వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగున్న నేపధ్యంలో దేశీయంగా

Most from this category