News


క్షీణించిన రూపాయి

Wednesday 26th June 2019
Markets_main1561521316.png-26572

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం(జూన్‌ 26) ట్రేడింగ్‌లో బలహీనపడి 69.40 వద్ద ప్రారంభమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గమని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పౌల్‌ అనడంతో డాలర్‌ బలపడింది. కానీ అమెరికా సుంకాలు, ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధలా వలన రేట్‌ కట్‌ తప్పనిసరిగా అవసరం అని ఆయన తెలిపారు. పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల వలన గత సెషన్‌లో రూపీ ప్లాట్‌గా 69.36 వద్ద ముగిసింది. ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే నేపథ్యంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫెడ్‌ వడ్డి రేట్లను తగ్గించాలని బోర్డుపై ఒత్తిడి తీసుకురావడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి డాలర్‌ బలహీనపడింది. ఈ వారం చివరిలో జీ20 సమావేశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను వహించే అవకాశం ఉందని మోతిలాల్‌ ఉస్వాల్‌ అన్నారు. ఈరోజు రూపీ డాలర్‌ మారకంలో 69.40 నుంచి 69.90 పరిధిలో ట్రేడవ్వవ‍చ్చని తెలిపారు.



You may be interested

బంగారం....6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి

Wednesday 26th June 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చింది. ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు నష్టపోయి 1,409.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ నిన్న న్యూయార్క్‌ మాట్లాడుతూ కొంతకాలం పాటు కీలక వడ్డీరేట్లపై రాజకీయ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. పావెల్‌ వ్యాఖ్యలతో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న వడ్డరేట్ల కోత విధింపుపై

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 26th June 2019

వడ్డీ రేట్ల కోతపై అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ నీళ్లుచల్లడంతో ప్రపంచ సూచీలు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56  పాయింట్ల తగ్గుదలతో 39,371 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల క్షీణతతో 11,768 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌లు 1-2 శాతం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. ఎన్‌టీపీసీ,

Most from this category