News


69.26 వద్ద రూపీ ప్రారంభం

Thursday 27th June 2019
Markets_main1561608297.png-26604

డాలర్‌ మారకంలో రూపీ గురువారం(జూన్‌ 27) ట్రేడింగ్‌లో 11 పైసలు బలహీనపడి 69.26 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్‌లో సానుకూలత వలన రూపీ గత సెషన్‌లో 21 పైసలు బలపడి 69.15 వద్ద ముగిసింది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి 90 శాతం దగ్గరగా ఉన్నామని అమెరికా వాణిజ్య సెక్రటరి అనడంతో గత సెషన్‌లో రూపీ బలపడింది. అంతేకాకుండా రాబోయే జీ20 సమ్మిట్‌లో ఈ ఒప్పందం ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికా జీడీపీ సంఖ్యను ప్రకటించడంతో పాటు, ఈ వారం చివరిలో జరగనున్న జీ20 మీటింగ్‌ వలన వచ్చే రెండు మూడు రోజుల్లో రూపీ తక్కువ పరిధిలో కదాలాడవచ్చు. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  69.20-69.90 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.
 



You may be interested

తగ్గిన చమురు ధర

Thursday 27th June 2019

గత సెషన్‌లో 2 శాతానికి పైగా పెరిగిన చమురు ధరలు గురువారం(జూన్‌ 27) ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 0.7శాతం తగ్గి బ్యారెల్‌కు 66.05 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7శాతం నష్టపోయి 58.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం చివరిలో జరగనున్న జీ 20 సమావేశంతో పాటు, ఒపెక్‌, నాన్‌ ఒపెక్‌ దేశాల సమావేశాలుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. అమెరికా నిల్వలు 25 లక్షల

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 27th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సదన నైట్రోకెమ్‌:- స్ట్రిక్స్ వైర్‌లెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  అదానీ పోర్ట్స్‌:- సింగపూర్‌ ఎక్చ్సేంజీలో లిస్ట్‌ అయ్యే సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ నోట్ల జారీ ద్వారా రూ 750 మిలియన్‌ డాలర్ల సమీకరణకు ఫైనాన్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. వెల్‌స్పన్‌ ఇండియా:- సెన్స్‌ ఆర్గానిక్‌ ఇంపోర్ట్‌, ట్రేడింగ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Most from this category