News


68.97 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 2nd July 2019
Markets_main1562042840.png-26726

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం(జులై 2) ట్రేడింగ్‌లో 2 పైసలు బలహీనపడి 68.97 వద్ద ప్రారంభమైంది. అమెరికా- చైనాల మధ్య సంధి కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపీ 9 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాల కంటే దేశియ కారకాలు రూపీని ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో బడ్జెట్‌ ఉండడంతో రూపీ లో కదలికలు హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. గత వారం చివరిలో అమెరికా-చైనా దేశాల మధ్య సంధీ కుదరడంతో ఆసియా కరెన్సీలతో పాటు జపాన్‌ కరెన్సీ ఎన్‌ కూడా సానుకూలంగా ట్రేడయ్యింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  69.05-69.70 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.



You may be interested

డిమాండ్‌ భయాలతో తగ్గిన చమురు

Tuesday 2nd July 2019

చమురు ఉత్పత్తి కోత నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు ఒపెక్‌ దేశాలు పొడింగించినప్పటికి  అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ బలహీనపడడంతో భవిష్యత్తులో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా మంగళవారం(జులై​2) ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 64.91 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 0.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.84  డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 2nd July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: ఈ కంపెనీ రేటింగ్‌ను కేర్‌(సీఏఆర్‌ఏ) ఏఏ- నుంచి బీబీకి మార్చింది. హీరో మోటర్‌ కార్ప్‌: 2018 జూన్‌లో 6,52,028 యూనిట్ల అమ్మకాలు జరగగా 2019 జూన్‌లో వాహన విక్రయాలు 6,16,526 యూనిట్లకు పడిపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: రిజల్యూషన్‌ ప్రణాళికను జులై 5 కల్లా అమలు చేయాలని రుణదాతల మధ్య అంగీకారం కుదిరింది. ఈ కంపెనీ జూన్‌ నెలలో కొన్ని బ్యాంకుల రుణాలను

Most from this category