News


14 పైసలు బలపడిన రూపీ

Wednesday 19th June 2019
Markets_main1560916878.png-26396

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం 14పైసలు బలపడి 69.56 వద్ధ ప్రారంభమైం‍ది.  గత మూడు రోజుల నుంచి నష్టపోతున్న రూపీ మంగళవారం 21పైసలు బలపడి 69.70 వద్ద ముగిసింది. తగ్గిన చమురు ధరలు, డాలర్‌ బలహీనంగా ఉండడంతో డాలర్‌ మారకంలో రూపీ బలపడుతోంది.  ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ రోజు వెలువడనున్న  నేపథ్యంలో డాలర్‌ ఒత్తిడికి గురికావచ్చు.  ఫెడరల్‌ ఓపినింగ్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సీ) ప్రకటన ముందు మదుపర్లు జాగ్రత్తను వహించవచ్చు. దీంతో పాటు ఫెడ్‌ వడ్డి రేట్లను యదాతథంగా ఉంచి తరువాత జరిగే సమావేశాల్లో తగ్గించడానికి ప్రయత్నించవచ్చని మోతిలాల్‌ ఉస్వాల్‌ అన్నారు. ఈ రోజు రూపీ 69.40 నుంచి 70.05-70.20 మధ్య ట్రేడవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

స్వీయ తప్పిదాలే అనిల్‌ అంబాని కొంప ముంచాయా?!

Wednesday 19th June 2019

కొన్నేళ్ల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరవ స్థానం‍లో నిలిచిన అనిల్‌ అంబాని ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 2008లో 4200 కోట్లడాలర్లున్న అనీల్‌ సంపద, మంగళవారం క్లోజింగ్‌ అనంతరం వంద కోట్ల డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 77.30 కోట్ల డాలర్లుంటుందని అంచనా. విచ్చలవిడిగా రుణాలను సేకరించడం, లాభదాయకం కాని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడంతో ఆయన తీవ్ర నష్టాలను చూశారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ను విస్తరించడానికి

11750ల పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 19th June 2019

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39,176.56 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 11,750.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. చైనాతో నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం జీ - 20 సదస్సులో ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణం వేగవంతం కాకపోతే, వడ్డీరేట్లపై

Most from this category