News


68.90 వద్ద రూపీ ప్రారంభం

Monday 1st July 2019
Markets_main1561953892.png-26697

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 28) ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ  69.02 వద్ద ముగిసింది. జీ20 సమ్మీట్‌ ఫలితాలకై మదుపర్లు వేచి ఉండడంతో పాటు రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య సంధీ కుదరడంతో రూపీ సానుకూలంగా ట్రేడవుతోంది. అమెరికా-చైనా సమావేశం తర్వాత ఆసియా మార్కెట్లు డాలర్‌ మారకంలో బలపడ్డాయి.  గత వారంలో రూపీ 55 పైసలు బలపడిన విషయం​తెలిసిందే. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  69.05-69.70 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.



You may be interested

పెరిగిన చమురు

Monday 1st July 2019

రష్యా, సౌది అరేబియా, ఇరాక్‌ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గింపు కాలపరిమితిని పొడింగించాడానికి సుముఖత చూపడంతో ఆయిల్‌ ధరలు సోమవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 1.12 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.86 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 1.10 శాతం పెరిగి బ్యారెల్‌కు 59.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ఉత్పత్తి తగ్గిం‍పు ఇంకో 9 నెలలు పొడిగించే అవకాశం ఉందని

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 1st July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఆసియా కలర్ కోటెడ్ ఇస్పాట్ లిమిటెడ్ (ఎసీసీఐఎల్) దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ సమర్పించిన బిడ్‌కు శుక్రవారం ఎసీసీఐఎల్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.  జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఐబీసీ చట్టం ద్వారా కంపెనీ బిడ్‌ దక్కించుకునేందుకు హిందూజా ఎతిహాద్‌ కన్షారియం సిద్ధమైంది. టాటా గ్రూప్‌ బిడ్‌పై ఎలాంటి నిర్ణయం

Most from this category