News


68.54 వద్ద ప్లాట్‌గా రూపీ

Tuesday 16th July 2019
Markets_main1563252370.png-27086

దేశియ ఎగుమతులు ఎనిమిది నెలల తర్వాత నెగిటివ్‌ జోన్‌లోకి పడిపోవడంతో రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం(జులై 16) ట్రేడింగ్‌లో 68.54 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. జూన్‌ నెలలో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25.01 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో జూన్‌ నెలలో 9 శాతం దిగుమతులు తగ్గి 40.29 బిలియన్‌ డాలర్లగా ఉంది. వాణిజ్య లోటు 15.28 బిలియన్‌ డాలర్లు కాగా ఇది గత ఏడాది జూన్‌లో నమోదైన వాణిజ్య లోటు 16.6 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ కావడం గమనర్హం. 
    రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, హస్తకళలు, రెడి మేడ్‌ వస్త్రాలు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, ఆయిల్‌ మీల్స్‌, చమురు విత్తనాల  రవాణా తగ్గడంతో ఎగుమతులు పడిపోయాయని పీటీఐ తెలిపింది. దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో పాటు అంతర్జాతియంగా డాలర్‌ బలహీన పడడం వలన గత సెషన్‌లో రూపీ 15 పైసలు బలపడి 68.54 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  68.30-68.90 పరిధిలో ట్రేడవ్వచ్చని  బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రోజు విడుదల కానున్న జూన్‌ రిటైల్‌ అమ్మకాల డేటా గత నెల కంటే బాగుంటుందనే అంచనాల నేపథ్యంలో ఈ రోజు డాలర్‌ స్వల్పంగా బలపడే అవకాశం ఉంది.

 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 16th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కమ్మిన్స్‌ ఇండియా:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సందీప్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- 1:2 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ను ఇష్యూ చేసింది. ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన 42.75లక్షల వారెంట్లను ఈక్విటీ షేర్లగా మార్చుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. జిందాల్‌ కాటెక్స్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి కనిక్‌ శర్మ రాజీనామా చేశారు.  అశోక్‌ లేలాండ్‌:- డిమాండ్‌ తగ్గడంతో పట్నానగర్‌ యూనిట్‌ను జూలై 16

రెండో రోజు తగ్గిన చమురు

Tuesday 16th July 2019

అమెరికా గల్ఫ్‌లో  చమురు ఉత్పత్తి తిరిగి పుంజుకోవడంతో పాటు, చైనా జీడీపీ రేటు రెండవ క్వార్టర్‌లో నెమ్మదించడంతో వరుసగా మంగళవారం కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 66.38 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్‌ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 59.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.4 శాతం, అమెరికా క్రూడ్‌ 1 శాతం నష్టపోయి

Most from this category