News


బలపడిన రూపీ

Friday 19th July 2019
Markets_main1563511757.png-27168

వరుస నష్టాలకు చెక్‌చెపుతూ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూపీ డాలర్‌ మారకంలో 0.18 శాతం బలపడి 68.78 వద్ద  ట్రేడవుతోంది. రూపీ డాలర్‌ మారకంలో 22 పైసలు బలపడి 68.75 వద్ద ప్రారంభమైంది. ఈక్విటీ మర్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ 15 పైసలు కోల్పోయి 68.97 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడవరోజు కూడా రూపీ బలహీనపడి 43 పైసలు కోల్పోయినట్టయ్యింది. విదేశి నిధులు బయటకు వెళ్లడంతో పాటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో రూపీ బలహీనపడుతోందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. 
     ‘విదేశీ నిధుల ఔట్‌ఫ్లో, ముడి చమురు ధరల పెరుగుదల, బలహీనమైన ఆసియా కరెన్సీల కారణంగా గురువారం సెషన్లో  డాలర్‌ మారకంలో రూపీ బలహీనపడింది’ అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ హెడ్ పిసిజి అండ్‌ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ వికె శర్మ అన్నారు.  గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్కు 0.90 శాతం పెరిగి 64.23 డాలర్లకు చేరుకుంది. మేజర్‌ ఆరు కరెన్సీలతో డాలర్‌ను అంచనా వేసే డాలర్‌ ఇండెక్స్‌ 0.04 శాతం తగ్గి 97.18 వద్దకు చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మూలధన మార్కెట్లలో అమ్మకాలకు మొగ్గు చూపారు. రూ.16.97 కోట్లు  విదేశి ఔట్‌ఫ్లో బుధవారం జరిగిందని సమాచారం.
   ఈక్విటీ బెంచ్ మార్క్ బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం ప్రతికూలంగా ముగిసింది. సెన్సెక్స్‌30 ఇండెక్స్‌  సెషన్ అంతటా నష్టల్లో ట్రేడయి చివరికి 318.18 పాయింట్లు లేదా 0.81 శాతం కోల్పొయి 38,897.46 వద్ద ముగిసింది. అదేవిధంగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90.60 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టపోయి 11,596.90 పాయింట్ల వద్ద ముగిసింది. అంతేకాకుండా పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌లు గురువారం 6.38 శాతంగా ఉంది.
రూపాయి/డాలర్‌కు రిఫరెన్స్ రేటును 68.8051 వద్ద, రూపాయి/యూరో 77.1434 వద్ద , రూపాయి/బ్రిటిష్ పౌండ్ల  85.3908 వద్ద, రూపాయి / 100 జపనీస్ యెన్ 63.60 గా ఫైనాన్షియల్ బెంచ్మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బిఐఎల్) నిర్ణయించింది.You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 19th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  థెరాక్స్‌:- జార్ఖండ్‌ల్‌ఓ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఇండియా గవర్నెంట్‌ పవర్‌ నుంచి రూ.471 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. టాటా మోటర్స్‌:- తన అనుబంధ యూనిట్‌ బార్బో రోబోటిక్స్‌ అటోమోటిక్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియను జూలై 17న పూర్తి చేసినట్లు తెలిపింది.  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌:- టైర్‌ -1, టైర్‌ -2 బాండ్లపై రేటింగ్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘నెగిటివ్‌’’కు సవరించింది.  నిప్పన్‌ లైఫ్‌

క్షణాల్లో లాభాల్లోంచి నష్టాల్లోకి

Friday 19th July 2019

అంతర్జాతీయ సానుకూలతలను అందిపుచ్చుకుని లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ క్షణాల్లో నష్టాల్లోకి జారకుంది. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాల తెరలేపడంతో సూచీల ప్రారంభ లాభాలన్నీ హరించుకపోయాయి. ముఖ్యంగా అటో, ఫైనాన్స్‌, ఫార్మా సెక్టార్లలో అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సెన్సెక్స్‌ గరిష్టస్థాయి(39,058.73) నుంచి 385 పాయింట్లు నష్టపోయి 38,673.07 వద్ద, నిఫ్టీ(11,640.35) 113 పాయింట్లు క్షీణించి 11527 వద్దకు పతనమైంది. ఉదయం గం.9:50ని.లకు సెన్సెక్స్‌

Most from this category