News


69.13 వద్ద రూపీ ప్రారంభం

Friday 26th July 2019
Markets_main1564116605.png-27325

విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో పాటు అంతర్జాతీయంగా డాలర్‌ బలపడుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 9 పైసలు బలహీనపడి శుక్రవారం ట్రేడింగ్‌లో 69.13 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా దేశియ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో, చమురు ధరలు పెరగడం కూడా రూపీ బలహీనపడడానికి కారణమయ్యాయి. గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు తగ్గి 69.04 వద్ద స్థిరపడింది. విదేశీ సావరిన్ బాండ్లను జారీ చేయాలనే ఆలోచనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరిగి అంచనా వేయాలని పిఎంఓ కోరుకుంటున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో  గురువారం సెషన్ చివరి భాగంలో రూపాయి ఒత్తిడిలోకి వచ్చిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 68.80, 69.20-69.35 పరిధిలో కదలాడవచ్చని విశ్లేషకులు తెలిపారు. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సుందరం మల్టీక్యాప్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ రుణసదుపాయపు సౌకర్యానికి బిబి-(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది అవెన్యూ సూపర్‌మార్ట్‌:- కంపెనీ రూ.30 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది.  జేకే అగ్రి జెనిటిక్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా కుమార్‌ గౌతమ్‌వరమ్‌ నియమితులయ్యారు.  టాటా స్టీల్:- టాటా స్పాంజ్‌ ఐరన్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా ప్రతి షేరు ధర రూ.500లు చొప్పున మొత్తం 2.6కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1292.2 కోట్లకు

టాటా మోటర్స్‌..5 నెలల కనిష్ఠానికి

Friday 26th July 2019

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలను ప్రకటించడంతో, శుక్రవారం ఈ కంపెనీ షేరు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతేకాకుండా గత  సెషన్‌లో 4 శాతం నష్టపోయి రూ.144.30 వద్ద ముగిసింది. ఈ రోజు సెషన్‌లో మరో 3 శాతం నష్టంతో ఐదు నెలల కనిష్టస్థాయి రూ.138.10 వద్ద ప్రారంభమై తిరిగి కోలుకుంది. ఉదయం 9.47 సమయానికి టాటా

Most from this category