News


బలహీనంగా రూపీ..68.98 వద్ద ప్రారంభం

Tuesday 23rd July 2019
Markets_main1563856082.png-27242

చమురు ధరలు పెరగడంతో పాటు, అమెరికా డాలర్‌ బలపడడంతో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి డాలర్‌ మారకంలో 68.98 వద్ద ప్రారంభమైంది. గత వారం ఇరాన్ బ్రిటిష్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన నేపధ్యంలో గత సెషన్‌లో చమురు ధరలు పెరిగాయి. దీంతోపాటు లిబియా తన అతిపెద్ద చమురు క్షేత్రంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం గమనర్హం.  గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో12 పైసలు క్షీణించి  68.92 వద్ద ముగిసింది. వాణిజ్య చర్చల తర్వాత అనిశ్చితిలో ఉన్న యూఎస్‌ మార్కెట్లు ఈ నెల చివరిలో జరగనున్న ఫెడ్‌ వడ్డి రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాల నేపథ్యంలో రికార్డు స్థాయికి ఎదిగాయి. రాబోయే రెండు రోజుల్లో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ)కూడా మరింత ఉద్దీపన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. 
  ‘ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 68.65, 69.05-69.20 పరిధిలో కదలాడవచ్చు’ అని  బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. అంచనాల కంటే అమెరికా ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉండడంతో డాలర్‌ మేజర్‌ కరెన్సీలతో పోల్చితే వరుసగా మూడవ సెషన్‌లో కూడా బలపడింది. ఫెడ్‌ వడ్డి రేట్లను తగ్గించనుందనే వార్తలు వినిపిస్తున్నప్పటికి డాలర్‌ బలపడడం గమనర్హం. ఈ వారం విడుదలు కానున్న అమెరికా జీడిపీ ఫలితాలపై మదుపర్లు దృష్ఠి పెట్టే అవకాశం ఉంది. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌

Tuesday 23rd July 2019

ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అరశాతం క్షీణించింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,342.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అధిక వెయిటేజీ కలిగిన యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల 2.50శాతం నష్టపోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.65శాతం (190 పాయింట్లు) క్షీణించి 29,095.50 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,284.95)తో పోలిస్తే 108 పాయింట్లు(0.38) క్షీణించి 29,214.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టీవీఎస్‌ మోటర్స్‌:- సింగపూర్‌లో తన అనుబంధ సం‍స్థ  వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా అమెరికా ఆధారిత సార్టప్‌ కంపెనీ సినాప్టిక్ సిస్టమ్స్ లో 7మిలియన్‌ డాలర్ల పెట్టుబడుతున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.  వడిలాల్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి రాజేష్‌ గాంధీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విజయ్‌ షా నియమితులయ్యారు.  బంధన్‌ బ్యాంక్‌:- సంజీవ్‌ నారాయణి బిజినెస్‌ హెడ్‌గా నియమితులయ్యారు.  ఆల్ఫాగో:- మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పోరేషన్‌

Most from this category